సెక్రటేరియట్‌కే రాని కేసీఆర్‌కు.. కొత్త సచివాలయం ఎందుకు:లక్ష్మణ్

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యహరచన చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగుస్థానాలు కైవసం చేసుకున్న ఉత్సాహంలో ఉన్న కమలదళం మరింత దూకుడు పెంచింది. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్‌ను తరిమి కొట్టడమే తమ లక్ష్యమంటున్నారు బీజేపీ నేతలు.తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆదే ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. గ్రామ గ్రామానికి బీజేపీ విస్తరించేలా వ్యూహరచన చేస్తోంది. ఈమేరకు భారీ లక్ష్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చేపట్టింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

తెలంగాణ నుంచి టీఆర్ఎస్ ను తరిమికొట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్. కేసీఆర్ పాలనలో ప్రాజెక్టుల పేరు చెప్పి కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. అసలు సెక్రటేరియట్ కే రాని కేసీఆర్..మళ్లీ కొత్త సచివాలయం ఎందుకు కడుతున్నారని నిలిదీశారు. వాస్తు దోషం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు లక్ష్మణ్. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు లక్ష్మణ్.. దళితులకు మూడెకరాల భూపంపిణీ చేస్తానని.. పనికి రాని భూముల్ని అంటగట్టి వారిని అవమానపర్చారని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు లక్ష్మణ్.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

నాన్నా మమ్మల్ని చంపొద్దు

Fri Jul 12 , 2019
ఉత్తరప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ మిశ్రా కూతురు సాక్షి మిశ్రా వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు…. కన్నతండ్రే తమను వేటాడుతున్నాడంటూ సాక్షి మిశ్రా ఆరోపిపిస్తోంది. దళితున్ని పెళ్లి చేసుకున్నందుకు తనను, తన భర్తను చంపేస్తారని ఆరోపించింది సాక్షి మిశ్రా. తండ్రి నుంచి తమను కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈమె పేరు సాక్షి మిశ్రా. ఉత్తరప్రదేశ్‌లోని బీదారి చేన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కుమార్తె. […]