విజయవాడలో రెచ్చిపోతున్న బ్లేడ్‌ బ్యాచ్‌

విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతోంది. జనావాసాల మధ్యే దాడులు చేస్తూ వణికిస్తోంది. తాజాగా కృష్ణలంక నెహ్రూ నగర్‌లో సీతారామయ్య అనే డ్రైవర్‌పై దాడి చేశారు. ఆర్టీసీ బస్‌స్టాండ్, రైల్వే ట్రాక్, పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్ అడ్డాలుగా ఈ ముఠా దందాలకు దిగుతోంది. ఒంటరిగా ఉన్న వాళ్లను టార్గెట్ చేస్తోంది. కొన్నాళ్లుగా జరుగుతున్న ఆగడాలు భరించలేక.. తమకు రక్షణ కల్పించాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు.


TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భక్తులకు కరెంట్‌ షాక్‌.. ఆలయంలో తొక్కిసలాట

Thu Aug 8 , 2019
తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ జరిగింది. వీఐపీ క్యూలైన్‌లో ఐరన్‌ బారికేడ్‌కు విద్యుత్‌ సరఫరా జరిగి.. భక్తులకు కరెంట్‌ షాక్‌ తగిలింది. విద్యుత్‌ ఘాతంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీయడంతో.. ఒక్కసారిగా ఆలయంలో అలజడి మొదలై తొక్కిసలాటకు దారి తీసింది. భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 20మంది భక్తులకు గాయాలయ్యాయి. సిబ్బంది అప్రమత్తమై విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో పెను […]