నాగార్జున పొలంలో డెడ్ బాడీ..

హీరో నాగార్జున పొలంలో మృతదేహం కలకలం రేపుతోంది. షాద్ నగర్ మండలంలోని పాపిరెడ్డి గూడలో నాగార్జున కొనుగోలు చేసిన 40 ఎకరాల వ్యవసాయ భూమిలో మృతదేహం లభ్యమైంది. ఈనెల 10న వ్యవసాయ క్షేత్రంలో నాగార్జున, అమల చెట్లు నాటారు. వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేశారు నాగార్జున కుటుంబ సభ్యులు.

ఈమేరకు వ్యవసాయసాగుపై నిపుణులను పంపించారు. పొలంలోకి వెళ్లిన నిపుణులు ఒక ప్రాంతంలో ఉన్న గదిలో కుళ్లిపోయిన మృతదేహన్ని గుర్తించారు. దీంతో స్థానికులు, నిపుణులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గదిని సీజ్‌ చేసిన పోలీసులు అక్కడే పోస్ట్ మార్టమ్ నిర్వహించాలని నిర్ణయించారు. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపైన ఆరా తీస్తున్నారు.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

విక్రమ్ ల్యాండర్‌పై సన్నగిల్లుతున్న ఆశలు!

Thu Sep 19 , 2019
చంద్రునిపై పరిశోధనల కోసం వెళ్లిన విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. పది రోజులు గడిచిపోయినప్పటికీ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ దొరకడం లేదు. భూకేంద్రంతో విక్రమ్‌ను కాంటాక్ట్ చేయడానికి ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. నాసా సహకారంతోనూ ప్రయోజనం కనిపించలేదు. విక్రమ్‌ పరిస్థితిని తెలుసుకోవడానికి నాసా శాస్త్రవేత్తలు లూనార్ రికానసెన్స్ ఆర్బిటార్‌ను పంపించారు. చంద్రుడి ఉపరితలానికి సమీపంలో పరిభ్రమిస్తున్న లూనార్, ఈ నెల 17న విక్రమ్ సమీపంలోకి వస్తుందని నాసా […]