పాలు పదినిమిషాలు మరగబెడితే..

స్కూలుకి టైమవుతోంది. పిల్లాడు పాలైనా తాగి వెళతాడని తల్లి హడావిడిగా పాలు కాచి అందులో హార్లిక్సో, బూస్టో కలిపి ఇస్తుంది. ఎంత టైమ్ అయిపోతున్నా కనీసం పది నిమిషాలైనా పాలు కాచమంటున్నారు శాస్త్రవేత్తలు. లేకపోతే పాలల్లో ఉన్న హానికారక రసాయనాలు కడుపులోకి వెళ్లిపోతాయి. తెలంగాణ పశువైద్య యూనివర్శిటీ పరిశోధకులు పాలపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడించారు. పురుగు మందులు చల్లిన పశుగ్రాసం తినడం వలన గేదెలు, ఆవులు ఇచ్చే పాలల్లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని తెలుసుకున్నారు. కలుషిత నీరు, మందులు వాడిన పశుగ్రాసం తినడం వల్ల పాలు విషతుల్యం అవుతున్నాయని పరిశోధకులు తేల్చారు. అందుకే కనీసం పది నిమిషాలైనా మరగబెట్టని పాలు తాగితే అల్జీమర్స్, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు. రెండు పొంగులు రాగానే స్టవ్ కట్టేయకుండా కొద్ది సేపు మరిగించితే మంచిదని సూచిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

జగన్‌ పాలన మొత్తం అవినీతి మయం : కన్నా లక్ష్మీనారాయణ

Fri Jul 19 , 2019
జగన్‌ పాలన మొత్తం అవినీతి మయమన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ సీఎం రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టేశారని విమర్శించారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కన్నా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారని, ఆ పార్టీ నేతలు భూ కబ్జాదారులుగా మారారని ఆరోపించారు కన్నా. కబ్జాలను అడ్డుకుంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని విమర్శించారు.