పబ్జీ ఆడొద్దంటూ తల్లిదండ్రులు మందలించడంతో..

పబ్జీ గేమ్‌ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం కోరాడ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బోయ లోహిత్‌ పబ్జీ ఆటకు బానిసగా మారాడు. దీంతో తల్లిదండ్రులు అతణ్ని మందలించారు. చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన లోహిత్‌.. చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ లోహిత్‌ ప్రాణాలు వదిలాడు.

పిల్లల ప్రవర్తన, అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని.. ఇలాంటి ఆటల విషయంలో ముందునుంచే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒంటరిగా ఫీలవ్వడం వల్లనే పిల్లలు ఇలాంటి మొబైల్‌ గేమ్స్‌కు బానిసగా మారుతున్నారని.. తల్లిదండ్రులు వారి కోసం తగినంత సమయం కేటాయించాలని చెబుతున్నారు.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

నవ్వు ఎంత పనిచేసింది.. నవ్వడానికి తెరిచిన నోరు..

Wed Sep 11 , 2019
జీవితంలో ఏదైనా మోతాదుకు మించితే ముప్పు తప్పదు.. మనం చేసే ప్రతి పని లిమిట్‌లోనే ఉండాలి.. కాదని అతి ఉత్సాహంతో చేస్తే మాత్రం అనర్ధమే. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ఉదాహరణగా నిలిచింది.  పగల్బడి నవ్వి చైనాకు చెందిన ఓ మహిళ చిక్కుల్లో పడింది. ఏదైనా హాస్యభరిత సన్నివేశం చూసినప్పుడు కానీ, చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా జోక్ వేసినప్పుడు ముసిముసిగా లేదా పగల్బడి నవ్వడం సహజం. కానీ […]