విక్రమ్ జాడ కనిపెట్టారా – హాలీవుడ్ హీరో

విక్రమ్ ల్యాండర్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. విక్రమ్ ఎలా ఉందో అని కోట్లాదిమంది టెన్షన్ పడుతున్నారు. ఇస్రో, నాసాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ కూడా విక్రమ ల్యాండర్ ఆచూకీపై ఆరా తీశాడు. డైరెక్టుగా నాసాకు వెళ్లి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌తో మాట్లాడారు. విక్రమ్ జాడ కనిపెట్టారా అని ఆస్ట్రోనాట్ నిక్ హెగ్యూను అడిగారు. ఐతే, విక్రమ్ ఆచూకీ ఇంకా లభించలేదని నిక్ బదులిచ్చాడు.

బ్రాడ్ పిట్‌ నటించిన యాడ్‌ ఆస్టా చిత్రం త్వరలో విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్ కోసం నాసాలో సందడి చేశాడూ పిట్‌. ఐఎస్‌ఎస్‌లోని ఆస్ట్రోనాట్ నిక్ హెగ్యూకు వీడియో కాల్ చేసి 20 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రయాన్ గురించి బ్రాడ్ పిట్ ప్రస్తావించారు. విక్రమ్ ల్యాండర్ ఆచూకీని కనిపెట్టారా అని ప్రశ్నించారు.

మరోవైపు, విక్రమ్ ల్యాండర్‌ ఫోటో తీయడానికి నాసా రంగంలోకి దిగింది. విక్రమ్ ల్యాండైనట్లుగా భావిస్తున్న ప్రాంతంపైకి నాసాకు చెందిన లూనార్ రికన్‌సెన్స్ ఆర్బిటర్‌ను పంపించారు. ఈ ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలానికి చాలా దగ్గరగా పరిభ్రమిస్తోంది. అందువల్ల విక్రమ్ ఫోటోలు తీయడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఆ ఫోటోలు అందితే ల్యాండర్ పరిస్థితిపై ఇస్రో శాస్త్రవేత్తలకు మరింత సమాచారం లభిస్తుంది.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అధికారిక లాంఛనాలను తిరస్కరించిన కోడెల కుటుంబ సభ్యులు

Wed Sep 18 , 2019
అధికారిక లాంఛనాలను కోడెల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. అవమానాలకు గురిచేసి ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలు అనడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలతో కలిసి అంత్యక్రియలు నిర్వహిస్తామని కోడెల కుటుంబ సభ్యులు చెబుతున్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు తెలిపారు. కోడెల మృతికి జగన్‌ బాధ్యత వహించాలని ఆయన మరోసారి డిమాండ్‌ చేశారు. కోడెల శివప్రసాద్ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వాదిస్తోంది టీడీపీ. కేసులతో వేధించటం, అవమానించటం […]