రూ.25 వేలకే బుల్లెట్టా.. ఇంతకీ ఎక్కడ

చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న సామెత ఎంత నిజమో దొంగిలించిన సరుకు అమ్ముకుంటే ఎంతో కొంత వస్తుంది. సగం వచ్చినా సంతోషమేగా అని పట్టుకొచ్చిన వెహికల్స్ అన్నీ తక్కువ రేటుకు అమ్మేస్తోంది ఓ ముఠా. కడప జిల్లా నందలూరులో దాదాపు లక్షన్నర ఖరీదు చేసే బుల్లెట్ వాహనం మీద కుర్రకారు షికార్లు కొడుతోంది. నిన్న నడుస్తూ కనిపించావ్. ఇవ్వాళేంట్రా బుల్లెట్ మీద రయ్‌ మంటూ దూసుకుపోతున్నావ్.. ఏంటి సంగతి అని ఆరా తీస్తే.. కర్నాటక నుంచి కడప జిల్లాలోని నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్, పల్సర్ లాంటి బైకులు భారీగా దిగుమతి చేస్తోంది ఓ ముఠా. వాళ్లు తీసుకువచ్చిన ఆ బైకులను అతి తక్కువ ధరకు అంటే రూ.25 వేల నుండి 50 వేల లోపు రేటుకు అమ్మేస్తున్నారు. ఖరీదైన వాహనం కారు కాదు కాదు.. బండి చౌకగా వస్తుంటే ఎంగ్ జనరేషన్ ఎగబడి కొనేస్తున్నారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బుల్లెట్ బండికి బ్రేకులు వేశారు. పక్క రాష్ట్రం నుంచి బుల్లెట్ వాహనాలను అక్రమంగా తరలించి ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. వాహనాలను స్వాధీనం చేసుకున్న నందలూరు పోలీసులు.. వీటి వెనుక ఉన్న సూత్రధారి ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ప్లీజ్ విడిపించండి.. మీకంటే తక్కువే తిన్నాను: మేక రిక్వెస్ట్

Wed Aug 14 , 2019
ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగేస్తారని అంటారు.. కానీ నేను అలాంటి దాన్ని కాదండి.. ఏదో ఆకలేసిందని పచ్చని మొక్కలు కనిపిస్తే ఓ పది మొక్కలు తిన్నానండి.. అంత మాత్రానికే కట్టేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.. ప్లీజ్ విడిపించరూ అని వేడుకుంటోంది.. మెడలో బోర్డు వేసుకుని మరీ రిక్వెస్ట్ చేస్తోంది వనపర్తి జిల్లాకు చెందిన మేక. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్ల‌లో NREGA కింద రోడ్డు వెంట నాటిన […]