దేవుడా.. అల్లు అర్జున్ కారవాన్ అంత కాస్టా..

అసలే స్టైలిష్ స్టార్.. ఆపై అల్లూ వారబ్బాయ్.. మెగాస్టార్ మేనల్లుడు.. టీనేజ్ అమ్మాయిల కలల రాకుమారుడు.. మరి ఇన్ని ప్లస్ పాయింట్లున్న సకల గుణాభిరాముడి కారవాన్ సింపుల్‌గా ఉంటే ఏం బావుంటుంది. అతనిలా స్టైల్‌గా ఉంటేనే అందం. అందుకే తన కారవాన్‌ని ముంబైకి చెందిన వ్యక్తితో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడట బన్నీ. మూడు కోట్లు పెట్టి ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటే.. మొత్తం కారవాన్ ధర రూ.7 కోట్లకు పై మాటేనట. ఇంత లగ్జరీ కారవాన్ దేశంలో ఏ హీరో ఇంతవరకు వాడలేదట. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. టబు, సత్యరాజ్, సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

Tue Jun 18 , 2019
మంగళవారం అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్‌ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఆర్కేకు శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. అందుకు ధన్యవాదాలు చెప్తూ ఆర్కే కూడా లోకేష్‌ను పలకరించారు. ఆ తర్వాత మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సందర్భంలో ఎమ్మెల్యే ఆర్కే రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం పనులు ఆగిన విషయం తనకు […]