ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు

గురువారం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానానికి స్వస్తి చెప్పింది. ఇకనుంచి ఇంటర్వ్యూలు నిర్వహించకుండా పరీక్షల ద్వారా అర్హత సాధించిన అభ్యర్థులకు నేరుగా ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉద్యోగాల భర్తీలో కేవలం రాత పరీక్షలలో మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని.. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

TV5 News

Next Post

వృద్ధుడిని మింగబోయిన కొండచిలువ.. చివరకు..(వీడియో)

Thu Oct 17 , 2019
పాముల్లో కొండచిలువ అత్యంత బయంకరమైనదన్న విషయం అందరికి తెలుసు. మనిషి ఒంటరిగా కనబడితే మింగేస్తుంది. కొండచిలువ భారిన పడి మరణించిన వారి సంఖ్య చాలానే ఉంది. అయితే తాజాగా ఓ వృద్ధుడు కొండచిలువ భారిన పడి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరువనంతపురంలోని నెయ్యర్ ఆనకట్ట సమీపంలో 61 ఏళ్ల భువనచంద్రన్ నాయర్ తన తోటి కూలీలతో పొదలను శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో పొదల […]