జూమ్ కార్ బంపరాఫర్.. వంద శాతం డిస్కౌంట్‌తో పాటు ఉచిత ప్లైట్ వోచర్..

సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎక్కడికైనా జామ్ అంటూ వెళ్లి పోవాలనుకుంటే జూమ్ కార్ బుక్ చేసుకోండి. ఈకారే ఎందుకు బుక్ చేసుకోవాలంటే.. 100 శాతం డిస్కౌంట్ ఇస్తోంది మరి. సెల్ఫ్ డ్రైవ్ బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కార్లను అద్దెకు ఇచ్చే జూమ్ కార్ కంపెనీ ఈ అదిరి పోయే ఆఫర్‌ని అందిస్తోంది. కంపెనీ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. మే31 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అలాగే కారుని కనీసం 12 గంటలైనా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న కారుతో జూన్ 8 నుంచి నవంబర్ 25 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఒకవేళ ఆరోజుల్లో ఏదన్నా అత్యవసర పనిపడి క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి ఎలాంటి క్యాన్సలేషన్ చార్జీలు వసూలు చేయదు. కంపెనీ 100 శాతం తగ్గింపు ఆఫర్‌లో 50 శాతం క్యాష్ బ్యాక్ రూపంలోను, మరో 50 శాతం డిస్కౌంట్ రూపంలోనూ ఉంటుంది. మరి ఈ ఆఫర్‌ని పొందాలంటే యూజర్లు ‘ఎల్‌యూవీ100’ ప్రోమో కోడ్‌ను ఉపయోగించాలి. కేవలం డిస్కౌంట్ ఒక్కటే కాదండోయ్.. కస్టమర్లకు మరో ఆఫర్‌ని కూడా అందిస్తోంది కంపెనీ. ఈ ఆఫర్ సేల్‌లో భాగంగా లక్కీ కస్టమర్లకు ఉచిత ఫ్లైట్ వోచర్ కూడా ఇస్తోంది. ప్రతి రోజు ఒక లక్కీ కస్టమర్‌ని ఎంపిక చేస్తారు. ఈ వోచర్‌తో పేటీఎంలో ఫ్లైట్ బుక్ చేసుకుని 100 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

నీరవ్‌ మోదీని ఏ జైలులో ఉంచుతారు.. - మెజిస్ట్రేట్‌

Fri May 31 , 2019
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను నిట్టనిలువునా ముంచిన ఆర్థిక నేరస్తుడు నీరవ్‌ మోదీకి బ్రిటన్‌ కోర్టు జూన్‌ 27 వరకు రిమాండ్‌ పొడిగించింది. అలాగే నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారు.. ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో 14 రోజుల్లోగా వెల్లడించాలని భారత అధికార వర్గాలు తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి రిమాండ్‌ విచారణను వచ్చే నెల 27న వీడియోలింక్‌ ద్వారా చేపట్టనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు. […]