ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు నారా లోకేష్. ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చెయద్దన్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతుల సందర్భంగా చంద్రబాబుగారిపై యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన దానిని వక్రీకరిస్తూ..నాకు అబద్దాలు చెప్పడం అలవాటే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు చెప్పారంటూ జగన్ పై ఫైరయ్యారు లోకేష్. చంద్రబాబుగారిమీద జోకులు వేయబోయి.. […]

ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం అధికార వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. అంబికా సంస్థల అధినేత అంబికా రాజా గురువారం వైసీపీలో చేరారు. డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీ నేత అంబికా కృష్ణకు ఆయన సోదరుడు అవుతారు. ఇటీవల టీడీపీని వీడిన అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. కాగా ఈ కార్యక్రమంలో ఏలూరు వైసీపీ నాయకురాలు మధ్యాన్నపు బలరాం ఈశ్వరి, కొవ్వూరు, ఏలూరు […]

ఏపీలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కుప్పంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు.. ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాయన్నారు. తాను కాస్త జాగ్రత పడి ఉంటే బాగుండేదని.. అయితే కొంతమంది గెలుపుపై అతి విశ్వాసం ప్రదర్శించారన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వాఖ్యలు చేశారు. కార్యకర్తలకు స్పూర్తి నింపడంలో ఫెయిలయ్యామన్నారు. అదే […]

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న గొడవలు సైతం… పెద్దవవుతున్నాయి. పోలీసులు సర్ధి చెప్పినా.. ఇరువర్గాలు వినే పరిస్థితి లేదు. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతిపురంలో టీడీపీ ఫ్లెక్సీల వివాదం చల్లారక ముందే.. గుంటూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. రేపల్లెలో తమ ఫ్లెక్సీ పక్కనే టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టడంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ ఫ్లెక్సీలను చించిపారేశారు. దీంతో ఇరువర్గాల […]

జగన్‌ సర్కారుపై మరోసారి ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు మాజీ మంత్రి లోకేష్‌. ఏపీ పోర్టుల వ్యవహారంలో జూన్‌ 28న జారీ అయిన ఆర్టీ -62 జీవో గుట్టు ఎంటోనని ప్రశ్నించారు. ముందు రహస్య జీవో అని చెప్పి రెండ్రోజుల్లోనే ఆ జీవో జారీ చేయబడలేదని మార్చారంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌. బందరు పోర్టు గురించి ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని.. సీఎం జగన్‌.. ఈ జీవోపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ […]

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కామాంధుడి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. మహిళలను లొంగదీసుకుని.. వారి అశ్లీల వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్‌ చేసిన ఆగిశెట్టి సాయిని మొగల్తూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్‌ చేసిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నలుగురు నిందితులపై పలు సెక్షన్‌లపై కేసులు నమోదు చేశామన్నారు డీఎస్‌పీ నాగేశ్వరరావు.. ఇప్పటికే సాయి మాయమాటలతో చాలామంది మహిళలు మోసపోయారని పోలీసులు గుర్తించారు. […]

దివంగత నేత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సిట్‌ బృందం వేగం పెంచింది. సీఎం జగన్ ఆదేశాలతో కేసును నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యారు సిట్ అధికారులు. ఆధారాల సేకరణలో వరసగా అనుమానితులను, సాక్ష్యులను విచారిస్తున్నారు. అందులో భాగంగా నిన్న వివేకానంద రెడ్డి ఇంటి పని మనిషి రంగయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచిన సిట్‌ అధికారులు..మరోసారి ఇంటి పనిమనిషిని విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. […]

పల్నాడు ఎగువ ప్రాంతానికి జలకళ తేచ్చే ప్రయత్నం చేయాలన్నారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కృష్ణా నదికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ సాగు, తాగు నీరందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడుకి ఆయువుపట్టు లాంటి వరికిపూడిశెల పూర్తయితే సుమారు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 90 గ్రామాలకుపైగా తాగు నీరందించే వెసులుబాటు కలుగుతుందని ఆయన స్పష్టం […]

అసెంబ్లీ నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై అసెంబ్లీ మీటింగ్ హాల్ లో ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు జరిగాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ తరగతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ నిర్వహణ తీరు, గౌరవ సభ్యులు ఎలా ప్రవర్థించాలి? అన్న అంశాలన్నింటిపై శిక్షణ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వేదికగా చేసుకొని ఎలా వినియోగించుకోవాలో వివరించారు. రూల్స్‌ బుక్‌ను అందరూ చదవాలన్న సీఎం […]

2014లో టీడీపీ చేసిన ఆరాచకాలనే.. ఇప్పడు వైసీపీ వాళ్లు చేస్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కన్నా. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పర్యటించిన కన్నా దాచేపల్లి పట్టణంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. మాచర్ల మండలం జమ్మలమడకలో బీజేపీ జెండా ఆవిష్కరణకు సిద్ధం చేస్తున్న దిమ్మెను వైసీపీ వాళ్లు అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ […]