వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మనుగడ కష్టమనిభావించారో ఏంటో తెలియదు గానీ ఒక్కొక్క టీడీపీ నేత సైకిల్ దిగి కమలం గూటికి చేరిపోతున్నారు. పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న నేతలు సైతం పార్టీ మారుతున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ బీజేపీలో చేరిపోయారు. ఆయనకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయన ఉన్నట్టుండి పార్టీ మారడంతో టీడీపీ వాయిస్‌ను బలంగా […]

ఉండవల్లిలో ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి నుంచి కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తున్న సీఆర్‌డీఏ అధికారులు.. 70 శాతానికి పైగా పూర్తి చేశారు. ఐరన్‌ రేకులతో నిర్మించిన పైకప్పు కావడంతో వాటిని తొలగించేందకు ఇవాళ సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. నిన్న రాత్రి వరకు కూల్చివేత పూర్తవుతుందని అంచనా వేశారు. అయితే.. అది సాధ్యం కాలేదు. భవనాన్ని పూర్తి నేలమట్టానికి మరికొంత సమయం పడుతుందంటున్నారు […]

గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త ఉమాయాదవ్‌ కుటుంబాన్ని.. మాజీ మంత్రి లోకేష్‌ పరామర్శించారు. ఉమాయాదవ్‌ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను చంపారని.. అయినా సంయమనం పాటిస్తున్నామన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రాజకీయ హత్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు లోకేష్. టీడీపి నాయకత్వం కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటుందని లోకేష్‌ భరోసా ఇచ్చారు. టీడీపీ […]

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌ ఉధృతం చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న అనగాని.. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను కలిశారు. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారంటున్నారు బీజేపీ నేతలు.

అనంతపురం జిల్లా గుత్తి లో గుంతకల్లు ఎమ్మెల్యే వెంట్రామిరెడ్డికి రైతుల నుంచి చుక్కెదురు. రైతులకు సబ్సీడి విత్తనాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వ అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. వేరుశనగ విత్తనాల పంపణీ ప్రారంభించడానికి వచ్చిన ఆయనను వర్షాలు కురుస్తున్నా విత్తనాలు మాత్రం అందడంలేని రైతులు నిలదీశారు. దీంతో కాసేపు ఎమ్మెల్యేకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులతో మాట్లాడిన వెంట్రామిరెడ్డి నాలుగైదు రోజుల్లో రైతులందరికి విత్తనాలు అందజేస్తామని హామీ […]

పాలనలో తన ముద్రతో ముందుకు వెళ్తున్నాను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్న ప్రజావేదిక కూల్చివేతపై నిర్ణయం తీసుకోగా.. తాజాగా గత పాలనలోని విద్యుత్ కొనుగోళ్లలో 2వేల 636 కోట్ల మేర అక్రమాలు జరిగాయని.. వాటిని రికవరీ చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని అధికారులను సూచించారు. అటు వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలోని […]

టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం మధ్య ప్రజా వేదిక కూల్చివేత కొనసాగుతోంది. నిన్న అర్థరాత్రి నుంచి మొదలైన కూల్చివేత ప్రక్రియ 90 శాతం పూర్తైంది. మరో రెండు, మూడు గంటల్లో ప్రజావేదిక భవనం నేలమట్టం కానుంది. ఎలాంటి ఉద్రికత్తలు చోటు లేకుండా ప్రజా వేదిక పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి పెద్ద సంఖ్యలో కూలీలు సమ్మెటలతో రంగంలోకి […]

చిత్తూరు జిల్లా అంటేనే పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, గుడిమల్లాం లాంటివి బాగా ప్రసిద్ధి. పాపులర్ కాని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయమే పెండ్లి కనుమ గంగమ్మ గుడి. కొన్నింటికి లాజిక్‌లు ఉండవ్. బండరాయికి, పెళ్లికి సంబంధం ఏంటి? ఒకవేళ గుండు ఎత్తే బలం, నైపుణ్యం లేకపోయినా మ్యారేజ్‌ ఎలా అవుతుంది? ఈ విషయంపై ఎంత ఆలోచించినా బుర్రకు తట్టదు. కానీ.. […]

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన ప్రత్యేకహోదా మాటను నిలబెట్టుకోవాలని వైసీపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన హోదా అంశాన్ని లేవనెత్తారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఇటీవల నీతి అయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోమన్‌ రెడ్డి కోరారని, ఆనాడు విభజన ప్రక్రియలో ఉన్న.. రాజ్యసభ ఛైర్మన్ ఏపీకి న్యాయం చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు.

ఉదయం నుంచి వరుస సమీక్షల్లో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్. ఆర్టీసీ విలీనంపై ఇప్పటికే సంబంధింత మంత్రి, అధికారుతో మాట్లాడిన ఆయన.. త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏం చేయాలనే దానిపై చర్చించారు. అటు, విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో సమావేశంలోనూ కీలకమైన అంశాలు చర్చకొచ్చాయి. ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. కొన్ని ఒప్పందాల్ని సమీక్షించాల్సి ఉన్నందున ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అధికారులతో మాట్లాడారు. […]