ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రగతిపై పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. కుప్పం ఐదేళ్ల ప్రగతిపై నివేదిక కోరారు. దీంతో చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లు నివేదిక సిద్ధం చేస్తున్నారు. గత ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం.. రామకుప్పం మండలాల్లో జరిగిన అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

ఈనెల 7వ తేదీన వైసీపీఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జగన్ అధ్యక్షతన జరిగే శాసన సభాపక్ష సమావేశంలో.. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులకు విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో.. అవకాశం దక్కనివాళ్లు నిరాశపడకుండా ఉండేలా వారికి భరోసా ఇస్తారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. పార్టీ […]

*ఈనెల 7వ తేదీన వైసీపీఎల్పీ సమావేశం *ఉదయం 10 గంటలకు జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం *తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీటింగ్ *మంత్రివర్గ కూర్పు, అసెంబ్లీ సమావేశాలకు ముందు.. *ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

జగన్ మంత్రివర్గం జూన్ 8న ఏర్పాటు కాబోతోంది. డేట్ ఫిక్స్ కావడంతో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు బిజీ అయ్యారు. అందరి అభ్యర్థనలు ఆలకిస్తున్న సీఎం.. హామీ మాత్రం ఇవ్వడం లేదు. అభ్యర్ధిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో కొన్నిచోట్ల బహిరంగ హామీలు ఇచ్చారు జగన్. వైసీపీ తరఫున 151 మంది గెలిచారు. కొన్ని జిల్లాలు క్లీన్‌ స్వీప్‌ అయ్యాయి. పార్టీ పెట్టిన 9ఏళ్ల […]

రాష్ట్ర ఆదాయం, జమాఖర్చులపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. కొత్త ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్థిక శాఖ అధికారులు నివేదక సమర్పించారు. ఎక్కడ ఆదాయం తగ్గుతుంది, ఎక్కడ ఖర్చులు పెరుగుతున్నాయో లెక్కించి.. 39 వేల 815 కోట్లు అదనంగా సమకూర్చుకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరం గట్టెక్కే వీలుంటుందని అందులో తెలిపారు. ఆ మేరకు ఆదాయ మార్గాలు క్రియేట్ చేసుకోవాలన్నది ఆ నివేదిక సారాంశంగా చెప్తున్నారు. 2014-15 సంవత్సరానికి రెవెన్యూ లోటు సుమారు […]

GSP-జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌ అంటే సాధారణ ప్రాధాన్య వ్యవస్థ. ఈ హోదా ఉన్న దేశాల్లో భారత్‌, థాయిలాండ్‌, కంబోడియా, టర్కీ, ఇండోనేషియా ఉన్నాయి. ఈ దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులను ఎగుమతి చేయొచ్చు. అయితే, ఇందుకు అమెరికా కాంగ్రెస్ విధివిధానాలను అనుసరించాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి భంగం కలగకుండా చూసుకోవడంతో పాటు ఆ దేశ మార్కెట్లలో అమెరికాకు సులభ ప్రవేశానికి వీలు కల్పించాలి. కానీ భారత్ […]

పరపాలనపై పట్టు బిగిచేందుకు, వివిధ శాఖల్లో నెలకొన్న పరిస్థితులపై అవగాహన కోసం వరస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఇందులోభాగంగా శనివారం ఆర్ధికశాఖపై సమీక్ష నిర్వహించారు. అప్పులతో కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, సమస్యలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న తరుణంలో రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షన ఆవశ్యతను అధికారులకు వివరించిన జగన్..అన్ని […]

ప్రత్యేక హోదా కోసం 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్ధవంతంగా వాదనలను వినిపించాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్‌. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు, సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. శాఖవారీగా వరుస సమీక్షలో భాగంగా శనివారం ఆర్ధిక శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్‌.. సామాన్యుడిపై భారం పడకుండా రాష్ట్ర ఆర్ధిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హరిత పన్ను, వ్యర్ధ […]

పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకోవాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖరాస్తే తప్పకుండా తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మోదీ ఐదేళ్ల కృషి ఫలితంగానే బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. సైనికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం మోదీ పరిపాలనా […]

ఏపీ డీజీపీగా అధికారికంగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో సవాంగ్ చార్జ్ తీసుకున్నారు. సవాంగ్‌కు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఏపీ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసుల నుంచి సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందన్నారు ఏపీ నూతన డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అత్యున్నతమైనదన్నారు. అటువంటి దానికి డీజీపీగా రావడం […]