ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో పలు సూచనలు చేశారు. మనమంతా ప్రజలకు సేవకులన్న విషయం ప్రతి నిమిషం గుర్తించుకోవాలని అన్నారు. మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియని పరిస్థితి నుంచి మార్పు రావాలన్నారు. నవరత్నాలే ప్రభుత్వ మేనిఫెస్టో అన్నది గుర్తుంచుకోవాలన్నారు. దాదాపు 2 లక్షల మంది ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేలయ్యారని గెలిచిన వాళ్లు […]

గతంలో టీడీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లే వైఎస్‌ జగన్ ప్రభుత్వానికి సమయం ఇస్తామన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. ఏడాదిపాటు వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయమన్నారు. ప్రభుత్వ పనితీరును ఎప్పకికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు‌. రాజకీయాల్లో సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేనను స్థాపించామని తెలిపారు పవన్. ప్రజావేదికను కూల్చివేస్తే .. కరకట్టమీద ఉన్న భవనాలన్నింటినీ కూల్చివేయాలన్నారు పవన్ కల్యాణ్. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు ఏలా […]

నెల్లూరు జిల్లాలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు బోరుబావిలో పడ్డారు. విడవలూరు మండలం పెద్దపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరిని గ్రామస్తులు ప్రాణాలతో కాపాడారు. మరో చిన్నారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ చిన్నారి 10 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జేసీబీ సాయంతో సమాంతరంగా తవ్వకం చేపట్టారు.

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నేత ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సమక్షంలో కమలం కడువ కప్పుకున్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న నరేంద్ర మోడీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని బీజేపీతో చేరినట్లు అంభికా కృష్ణ తెలిపారు. టీడీపీ ఓటమికి కార్యకర్తలు నాయకుల తప్పేమిలేదని అధినేత నిర్ణయాల వలనే పార్టీకి ఈపరిస్థితి తలెత్తిందని విమర్శించారు. టీడీపీలో తనకు […]

ప్రజా వేదికను కూల్చివేస్తామనడం సరికాదని టీడీపీ సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. ప్రజల అవసరాల కోసం నిర్మించిన భవనాన్ని ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ప్రజా వేదిక అంశం కోర్టు పరధిలో ఉంది.. అలాంటప్పుడు కూల్చివేస్తామనడం సరికాదని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రం అయిన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది.. ఈ సమావేశానికి పొలిట్‌ బ్యూరో సభ్యులు యనమల, […]

ప్రజావేదిక కూల్చేయాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ ఆదేశాలిచ్చారు. ఇవాళ రేపు జరిగే కలెక్టర్లు, ఎస్పీల సదస్సు ముగిసాక దీన్ని కూల్చేయాలని జగన్ అన్నారు. గత ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు సహా అన్నింటినీ బేఖాతరు చేస్తూ ఈ ప్రజావేదికను నిర్మించిందని.. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇలా చేయడం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తే రూల్స్ అతిక్రమిస్తే.. […]

తెలుగుదేశం పార్టీకి మరో షాక్. ఆ పార్టీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు. అంబికా కృష్ణతో పాటు ఆయన సోదరుడు రాజా కూడా పార్టీ మారనున్నారు. మరోవైపు వీరిద్దరూ పార్టీకి గుడ్‌ బై చెప్పడం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో కలకలం సృష్టిస్తోంది.

ప్రజావేదిక కూల్చేయాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ ఆదేశాలిచ్చారు. ఇవాళ రేపు జరిగే కలెక్టర్లు, ఎస్పీల సదస్సు ముగిసాక దీన్ని కూల్చేయాలని జగన్ అన్నారు. గత ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు సహా అన్నింటినీ బేఖాతరు చేస్తూ ఈ ప్రజావేదికను నిర్మించిందని.. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇలా చేయడం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తే రూల్స్ అతిక్రమిస్తే.. […]

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ తొలిసారిగా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. నేడు, రేపు జరగనున్న సదస్సులో నవరత్నాల అమలుతోపాటు శాంతి భద్రతలపైనా చర్చించనున్నారు.. పరిపాలనలో పారదర్శకత, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ సరఫరాపై సమీక్షలు జరుగుతాయి. రేపు శాంతి భద్రతలపై జగన్‌ సమీక్ష నిర్వహిస్తారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు సర్వం సిద్ధమైంది.. ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహిస్తున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన […]

టీడీపీ రాజ్యసభపక్షం బీజేపీలో విలీనంపై రాజకీయ దుమారం రేపుతోంది. విలీన ప్రక్రియ నిబంధనలకు విరుద్ధమంటూ టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తోంటే.. అంతా రాజ్యాంగ బద్ధంగానే జరిగిందంటూ కమల దళం కౌంటర్ ఇస్తోంది. గతాన్ని మరిచి టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, నలుగురు ఎంపీలు పోయినా.. నాలుగువేల మందిని తయారు చేసే శక్తి టీడీపీకి ఉందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు […]