పాలనలో తన మార్క్‌ను చూపిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొత్త కొత్త ఆలోచనలతో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా దర్బార్‌ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జులై ఒకటి నుంచి ఈ ప్రజా దర్బార్‌ నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను కలిసి వారి ఫిర్యాదులను స్వీకరించనున్నారు.. జగన్‌ ప్రజా దర్బార్‌ కోసం తాడేపల్లిలోని […]

చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా వీడుతున్నాయి.. విభజన సమస్యలకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించిన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలోని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులను సొంత రాష్ట్రానికి కేటాయించే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.. అలాగే నిధులు, ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలను వెంటనే పరిష్కరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి రోడ్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది.. […]

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్‌పై మరోసారి ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు. మాట మార్చమ్‌.. మడమ తిప్పమ్‌ అన్న జగన్ మాటలను కాస్త మార్చి.. మాట మార్చామ్‌.. మడమ తిప్పామ్‌ అని రాసి ఎద్దేవా చేశారు. నాడు పట్టిసీమకు వ్యతిరేకం అన్న జగనే‌.. చివరికి తన చేతితోనే పట్టిసీమ నీళ్లు వదిలారని సెటైర్‌ వేశారు. దేవుడి స్క్రిప్ట్‌లోనూ ట్విస్ట్‌లు ఉంటాయి జగన్‌ గారూ అంటూ ట్వీట్‌ చేసిన […]

వైసీపీ, టీడీపీల మధ్య ట్విట్టర్ వార్‌ నడుస్తోంది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. ట్విట్‌ చేసుకుంటున్నారు. మాజీ మంత్రి లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చేసిన విమర్శలకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ఘాటుగా స్పందించారు. 16 నెలలు జైల్లో ఉన్న ఏ1, ఏ2లు ఎవరి కాళ్లు పట్టుకుని బయట తిరుగుతున్నారని విమర్శించారు. రాజ్యసభ ఎంపీగా ప్రధాని కార్యాలయం చుట్టూ 5 […]

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఉత్తర బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది..ఇది తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇందుకు అనుకూలమైన వాతావరణం స్థానికంగా ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం కూడా నెలకొంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా […]

కులం తక్కువ అతన్ని పెళ్లి చేసుకుందని కన్న తండ్రే కూతురు పాలిట యముడయ్యాడు. కులం పిచ్చిలో ఆమె పుట్టింటి వారిని మానవత్వం కూడా మరిచిపోయేలా చేసింది. బాలింత అని చూడకుండా చిత్రహింసలు పెట్టి పొట్టనపెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఏడు రోజుల పసికందు మొహం చూసైనా కూతుర్ని వదిలిపెట్టలేదు ఆ తండ్రి. కులం మత్తులో మనిషి అనే విషయాన్నే మరిచిపోయింది బాస్కర నాయుడి కుటుంబం. […]

సీఎంల సమావేశంలో గత ప్రభుత్వం హాయంలో జరిగిన కృష్ణా- గోదావరి అనుసంధానంపై ఎందుకు చర్చించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. గత నాలుగేళ్లలో పట్టిసీమ ద్వారా 263 టిఎంసీల నీటిని మళ్లించిన ఘనత టీడీపీకి దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టుల పనుల ఆపేసిన జగన్‌.. కేసీఆర్‌ చెప్పిన దానికి ఎందుకు తలూపుతున్నారన్నారు. ఏపీలో ఉన్నప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకే జగన్‌.. బార్డర్‌ దాటి తెలంగాణలో అడుగుపెడితే రివర్స్‌ టెండరింగ్‌, […]

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయని ఇందుకు జగన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య. ఎమ్మెల్యేనే జర్నలిస్టును చంపుతా.. నరుకతా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందన్నారు. హోంమంత్రి కూడా దాడులను సమర్దించినట్టు మాట్లాడడం సరికాదన్నారు. యదారాజా తథాప్రజల అన్నట్టు పాలన సాగుతుందన్నారు.

ఏపీ సీఎం జగన్ తండ్రి వైఎస్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. గతంలో వైఎస్ చేపట్టిన మాదిరిగానే ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జూలై 1 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజలు తనను నేరుగా కలిసేందుకు వీలుగా జగన్ ప్రజాదర్బార్ ను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు గంట పాటు ఆయన ప్రజల వినతులు స్వీకరిస్తారు. అంతేకాదు సంక్షేమపథకాల్లో అవతవకలపై నేరుగా సీఎంకే ఫిర్యాదు చేయవచ్చు. ప్రజాదర్బారు […]

విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్‌ మీడియా పోస్టింగ్‌ పరంపర కొనసాగిస్తున్నారు. జగన్‌ – కేసీఆర్‌ చర్చలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో విభజన సమస్యలు పరిష్కారం దిశగా చర్చలు ప్రారంభించడం ఆహ్వానించదగ్గ పరిణామం.. కానీ దేవుడిచ్చిన మీ స్నేహితుడు కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి అనాథగా మారిన ఏపీకి రావాల్సిన బకాయిలు కూడా అడిగితే బాగుంటుందని ట్విట్టర్‌ ద్వారా సలహా ఇచ్చారు ఎంపీ నాని. మీరు సమస్యల పరిష్కారం పేరుతో […]