ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు ప్రకటించిన గ్రామ వాలంటీర్‌ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌ సైట్‌ ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. […]

విజయవాడ కార్పొరేషన్‌లో ఫొటోల రగడ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తనను అడగకుండా కౌన్సిల్ హల్‌లో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టడంపై మేయర్ శ్రీధర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే అక్కడున్న ఎన్టీఆర్‌, చంద్రబాబు ఫొటోలను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు. సీఎం జగన్ ఫొటోను ఏర్పాటు చేశారు. దీనిపై మేయర్ అసహనం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు ఫొటో తీసేసినా పర్వాలేదు.. NTR ఫొటోపై ఎందుకు అభ్యంతరం […]

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే నోట్లో ఏం పెట్టుకుంటారో అని భయం. పాకడం మొదలు పెట్టిన చిన్నారులైతే కనిపించిన ప్రతిదీ నోట్లో పెట్టుకుంటారు. అందుకే తల్లి ఓ కన్నెప్పుడూ బిడ్డ మీద వేసి వుంచుతుంది. అయినా ఎప్పుడు పెట్టేసుకుందో.. ఎలా పెట్టేసుకుందో ఏడు నెలల చిన్నారి తనకి నెయిల్స్ కట్ చేసేందుకు వాడే నెయిల్ కట్టర్‌ని నోట్లో పెట్టేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మౌర్య రాజు,లక్ష్మి దంపతులు ఇటీవల గుంటూరు జిల్లా […]

బీజేపీలో టీడీపీ రాజ్యసభ పక్షం విలీనంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ…భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ కానున్నారు. మాజీ మంత్రి గంటాతో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. పార్టీ వలసలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. బీజేపీలో టీడీపీపీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టీడీపీ ప్లాన్ చేస్తోంది.‌

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 42 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా మధుసూదన్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్‌, కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉదయలక్ష్మి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా కాంతిలాల్‌ దండే, ఆరోగ్యశ్రీ సీఈవోగా మల్లికార్జునను నియమించారు. సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రవిచంద్ర, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ముఖేష్‌కుమార్‌, కార్మిక శాఖ […]

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. నియామక పత్రాలపై ముఖ్యమంత్రి జగన్‌ సంతకం చేశారు.. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం టీటీడీకి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ పేర్కొంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ దీనికి […]

ఏపీలో స్థానిక ఎన్నికలపై ఫోకస్‌ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్‌. జులై మూడోతేదీ లోపు ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి జులై 3, 4 తేదీల్లో ముగియనుండటంతో వాటికి ఎన్నికలు నిర్వ హించాల్సి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల లిస్టులు సిద్ధమైన వాటి ఆధారంగా ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకూ […]

ఏపీ రాజకీయాల్లో మరో చిచ్చు రాజుకుంది. చంద్రబాబు నివాస ప్రాంగణంలో ఉన్న ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కలెక్టర్ల సదస్సు కోసం ప్రజావేదిక భవనాన్ని వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే.. ప్రజావేదికను స్వాధీనం చేసుకోవటంపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఆందుబాటులో ఉండేలా తన నివాసాన్ని ఉండవల్లిలోని కరకట్టకు మార్చారు. ప్రతినిత్యం ఏదో సమస్యలతో తనను కలిసే ప్రజల సాధకబాధలు వినటంతో […]

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అగ్రనేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఏపీలో కమలం వికసిస్తుందా? మారుతున్న సమీకరణాలు దేనికి సంకేతం? కమలం గూటికి నేతలు క్యూ కట్టడానికి కారణమేంటి? హస్తినలో ఏం జరుగుతోంది.? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కేవలం 23 ఎమ్మెల్యే, మూడు ఎంపీ స్థానాలు […]

బెజవాడ రౌడీల బెండు తీస్తున్నారు పోలీసులు. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న నగరంలో ఈమధ్య మళ్లీ అలజడి రేగుతోంది. తాగిన మైకంలో.. రౌడీషీటర్లు అమాయకులపై దాడులకు తెగబడుతున్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టిన డీసీపీ విజయరావు… కఠిన హెచ్చరికలతో వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. రౌడీ షీటర్ల వేధింపులు భరించలేక ప్రజలు తిరగబడుతున్నారు. ఇటీవల వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన కిలారి సురేష్ అనే రౌడీ ఆగడాలు భరించలేని ఇద్దరు ఆటో […]