ముఖ్యమంత్రి జగన్‌పై మరోసారి ట్విట్టర్‌లో విమర్శలు చేశారు మాజీ మంత్రి లోకేష్. వైఎస్ హయాంలో సోలార్ విద్యుత్ యూనిట్‌ ఎంతకు కొన్నారో, చంద్రబాబు పాలనలో యూనిట్‌కి ఎంత ఖర్చు పెట్టామో చూడండంటూ లెక్కలు తీశారు. కనీస ఆధారాలు లేకుండా టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల 2వేల 636 కోట్లు అవినీతి జరిగిందని తేల్చడం ఏంటని ప్రశ్నించారు. గుడ్డ కాల్చి మీద వేయడంలో మీకు మీరే సాటి అంటూ జగన్‌పై […]

మాజీ సీఎం చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసానికి CRDA అధికారులు నోటీసులు అంటించారు. కరకట్టపై ఆయన నివాసం అక్రమ కట్టడమని నిర్థారించినందున.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చారు. ఇంటి యజమాని లింగమనేని రమేష్‌ పేరునే ఈ నోటీసులు ఇచ్చారు. సీఆర్‌డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేంద్రరెడ్డి ఉండవల్లిలోని బాబు నివాసానికి వెళ్లి ఈ నోటీసులు అంటించారు. ఐతే.. ఇంట్లో అద్దెకు ఉంటున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ నోటీసులు తీసుకునే విషయంపై […]

తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కారించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి పెట్టారు. విభజన సమస్యలతో పాటు, జలవనరులను సద్వినియోగం చేసుకునేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్న ఇద్దరు సీఎంలు ఇవాళ ప్రగతిభవన్ లో భేటి కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పెండింగ్ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్‌, సీఎం జగన్. అందులో భాగంగా ఇప్పటికే సచివాలయ భవనాలతో పాటు హెచ్‌ఓడీ ల […]

ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబు నివాసంలో చర్చలు జరిపారు టీడీపీ నేతలు. ముఖ్య నేతలంతా హాజరైన ఈ సమావేశంలో.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. టీడీపీపై నిందలు వేయాలనే అజెండాతోనే సీఎం జగన్‌ సమీక్షలు చేస్తున్నారన్నారు టీడీపీ నేతలు. గతంలో వైఎస్‌ హయాంలో ఎన్నో సబ్‌ కమిటీలు వేశారని.. ఇప్పుడు అదే తరహాలో జగన్‌ సబ్‌ కమిటీలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది […]

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన కార్యకలాపాలపై సీఎం జగన్ విచారణకు ఆదేశించడం వివాదాస్పదమవుతోంది. జగన్‌ చర్యల్ని నిరసిస్తూ…. టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి ఛార్జిషీట్లున్నాయని విమర్శించారు. నిందితుడుగా కొన్నాళ్లు జైల్లో ఉన్నారని గుర్తుచేశారు. అలాంటి మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండడం బాగోలేదు సార్ అంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్.. గతంలోనూ చంద్రబాబు పాలనపై విచారణ […]

అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది రైతులు వాణిజ్య పంట వేరుశనగపై ఆధారపడుతుంటారు. జిల్లాలో నెలకొన్న వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు వర్షాదారపంటైన వేరుశనగ జీవనాధారం. ఏడున్నర లక్షల హెక్టార్లలతో వేరుశనగ సాగుచేస్తుంటారు ఇక్కడి రైతులు. ఈ పంటపై అధికారులు ముందుచూపు లేకపోవడంతో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని మార్కెట్ యార్డులో రైతులంతా కలసి నిలదీసిన పరిస్థితి తలెత్తింది… ఖరీఫ్‌లో రైతులు వేరుశనగ పంటను సాగుచేస్తారని తెలిసినా […]

ఏపీలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది పులివెందుల కోర్టు. ఈ హత్య కేసు నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌…అరెస్టై 90 రోజులు పూర్తి కావడంతో… బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ముగ్గురిని.. వివేకా హత్య కేసులో….. సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగంపై అరెస్ట్‌ చేశారు. దాదాపు మూడు నెలలైనా ఈ కేసులో నిందితులపై పోలీసులు ఛార్జ్‌షీట్‌ చేయకపోవడం,విచారణ పూర్తి కాకపోవడం […]

ఏపీ దేవాదాయశాఖలో ఉద్యోగుల వెతలపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఉద్యోగులకు జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు. ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి. ఏపీ దేవాదాయశాఖలో ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. ఉద్యోగుల ఇబ్బందులను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో గత కొన్ని నెలలుగా జీతాలు లేక దేవదాయ శాఖ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రంగంలోకి […]

కృష్ణానది కరకట్టలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. చట్టాలను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలన్నింటికి నోటీసులు సిద్ధం చేసింది. ఏ క్షణమైనా…. అక్రమ నిర్మాణదారులకు షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. విపక్షనేత చంద్రబాబు ఉంటున్న నివాసం సైతం.. అక్రమంగా నిర్మించినట్లు నిర్ధారణకు వచ్చారు సీఆర్‌డీఏ అధికారులు. దీంతో విపక్షనేత చంద్రబాబు సహా ఆ భవన యజమాని లింగమనేని రమేష్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. […]

విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్వాకం, యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన ఇప్పిలి రాము అనే యువకుడు కడుపునొప్పి రావడంతో బొబ్బిలిలోని డాక్టర్ రమేష్ కుమార్ కు చెందిన ఆర్కే ఆసుపత్రిలో వారం క్రితం జాయిన్ అయ్యాడు. వెంటనే ఆపరేషన్ చేయాలని..లక్ష ఖర్చవుతుందని చెప్పాడు డాక్టర్ రమేష్. చివరికి 55 వేలు తీసుకొని వరుసగా ౩ ఆపరేషన్లు చేసాడని బాధితుడి […]