ఏపీ శాసనసభ సమావేశాల రెండోరోజూ… అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. స్పీకర్‌కు ధన్యావాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరుపక్షాలు పోటాపోటీగా విమర్శలకు దిగాయి. ప్రధానంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు విమర్శలు, ప్రతివిమర్శలతో సభ హాట్‌హాట్‌గా నడిచింది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో మాదిరిగా కొనుగోలు చేశారంటూ సీఎం జగన్‌ ఘటుగా విమర్శించారు. కానీ ఎన్నికల్లో టీడీపీ తరుపున […]

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఐదుగంటలకు కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కలుస్తారు. హోంమంత్రి అమిత్‌షాతో జగన్‌ పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో భేటీ అనంతరం రాత్రి ఢిల్లీలోని 1- జనపథ్‌లో బస చేస్తారు. శనివారం వైఎస్స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. […]

ఏపీలో ఐదు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి ఛైర్మన్లను కూడా నియమించారు. కృష్ణా-గుంటూరు డెవలప్‌మెంట్‌ బోర్డుకు ఛైర్మన్‌ గా పార్ధసారధి, రాయలసీమ బోర్డు ఛైర్మన్‌ గా అనంత వెంకట్రామిరెడ్డిని నియమించారు. ప్రకాశం-నెల్లూరు జిల్లాల బోర్డుకు కాకాణి గోవర్దన్ రెడ్డి, ఉభయగోదావరి జిల్లాలకు ఛైర్మన్‌ గా దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ గా ధర్మాన ప్రసాదరావును నియమించారు. అటు సిఆర్‌డిఏ ఛైర్మన్‌గా మంగళగిరి […]

టీటీడీ చైర్మన్‌గా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం మారినా.. తన పదవికి రాజీనామా చేయనందువల్లే తనపై కక్ష కట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ తనపై పతప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారాయన. వాటిపై తక్షణం విరాచరణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషిగా తేలితే, ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఛాలెంజ్ విసిరారు. స్విమ్స్‌ డైరెక్టర్‌కు తాను ఎమైనా సిఫార్సులు చేసినా.. జీవోల […]

ఏపీలో ఐదు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో రాయలసీమ ప్రాంతీయ బోర్డు డెవలప్ మెంట్ ఛైర్మెన్ గా మాజీ ఎంపీ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి నియమితులయ్యారు. ఇక నెల్లూరు – ప్రకాశం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మెన్ గా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, కృష్ణా- గుంటూరు ప్రాంతీయ బోర్డు ఛైర్మెన్ గా మాజీ మంత్రి పార్థసారధిని […]

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి.. స్పీకర్‌ ఎన్నిక ఎపిసోడ్‌ను ఇరుపక్షాలు వివాదాస్పదంగా మార్చేశాయి.. మొదట అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌ను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు, అధికార, ప్రతిపక్ష సభ్యులంతా కొత్త స్పీకర్‌కు అభినందనలు తెలిపారు.. ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌ చైర్‌ వద్దకు తీసుకెళ్లారు.. ఈ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో కనిపించలేదు.. అయితే, […]

ఫిరాయింపులు, సంప్రదాయాలు, వెన్నుపోట్లు.. అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు ఇవే మాటలు ఎక్కువగా వినిపించాయి.. అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి.. పార్టీ ఫిరాయింపులపై మఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరిగింది. గత ప్రభుత్వం ఆలోచించినట్టుగానే తానూ ఆలోచించి ఉంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదని చంద్రబాబును ఉద్దేశించి జగన్‌ తీవ్ర విమర్శలు చేయగా.. చంద్రబాబు కూడా స్ట్రాంగ్‌ రిప్లై […]

ఓవైపు సమీక్షలు, మరోవైపు వరుస సమావేశాలు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తూనే ప్రజలతో మమేకం అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇందుకోసం ఆయన త్వరలోనే ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం అరగంట ప్రజల విన్నపాలు స్వీకరించనున్నారు ముఖ్యమంత్రి. జులై మొదటి వారం నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంను కలిసేందుకు ప్రతిరోజూ వివిధ […]

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.. స్పీకర్‌ ఎన్నికపై అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది.. అధికారపక్షం సంప్రదాయాన్ని మరచిపోయిందని టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు విమర్శించగా.. అధికార పక్ష సభ్యులు ఆ విమర్శలను తిప్పికొట్టారు.. ప్రతిపక్ష నేత అనే విషయాన్ని చంద్రబాబే మరచిపోయారని శ్రీకాంత్‌రెడ్డి, అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు.

విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలంగా వీచిన గాలులకు చెట్లు కుప్పకూలాయి. విద్యుత్‌ స్తంభాలు, సెల్‌ టవర్లు విరిగిపడ్డాయి. బుధవారం రాత్రి నుంచి సాలూరు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు బెంబేలెత్తిపోయారు.