పరపాలనపై పట్టు బిగిచేందుకు, వివిధ శాఖల్లో నెలకొన్న పరిస్థితులపై అవగాహన కోసం వరస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఇందులోభాగంగా శనివారం ఆర్ధికశాఖపై సమీక్ష నిర్వహించారు. అప్పులతో కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, సమస్యలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలన్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న తరుణంలో రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షన ఆవశ్యతను అధికారులకు వివరించిన జగన్..అన్ని […]

ప్రత్యేక హోదా కోసం 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్ధవంతంగా వాదనలను వినిపించాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం జగన్‌. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులు, సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. శాఖవారీగా వరుస సమీక్షలో భాగంగా శనివారం ఆర్ధిక శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్‌.. సామాన్యుడిపై భారం పడకుండా రాష్ట్ర ఆర్ధిక స్థితి మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. హరిత పన్ను, వ్యర్ధ […]

పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకోవాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖరాస్తే తప్పకుండా తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మోదీ ఐదేళ్ల కృషి ఫలితంగానే బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. సైనికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం మోదీ పరిపాలనా […]

ఏపీ డీజీపీగా అధికారికంగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో సవాంగ్ చార్జ్ తీసుకున్నారు. సవాంగ్‌కు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఏపీ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసుల నుంచి సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందన్నారు ఏపీ నూతన డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అత్యున్నతమైనదన్నారు. అటువంటి దానికి డీజీపీగా రావడం […]

విజయవాడలో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు అనే వ్యక్తి… ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు జమ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. బోగస్‌ ఎస్‌ఎంఎస్‌లో అమాయక జనాన్ని వల్లో వేసుకుని లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో రెండు నెలల వ్యవధిలో 19 మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి […]

ప్రమాణ స్వీకారం అవగానే పరిపాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అదే స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. సమీక్షలు, బదిలీలు, నియామకాలు, అవసరం లేని ఉద్యోగాలపై కొరడా ఝులిపిస్తూ.. వరుస నిర్ణయాలతో తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి శాఖల వారిగా సమీక్షలు నిర్వహించనున్నారు సీఎం జగన్‌. ఈ ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్ష చేస్తారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై […]

ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది. ఈ నెల 13 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ దామోదర్‌ తెలిపారు. ఇందుకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని జేఏసీ కార్యాలయంలో వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. తమ సమస్యలు, డిమాండ్లపై కొత్త ప్రభుత్వం స్పందించాలన్నారు. సంస్థ నష్టాలను ప్రభుత్వమే భరించాలని.. సిబ్బంది కుదింపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీల్ని.. […]

ఆంధ్రప్రదేశ్‌‌ క్యాబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 8వ తేదీన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. అమరావతి సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో ఆ రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే 11 గంటల 49 నిమిషాలకు జగన్ కేబినెట్ తొలి సమావేశం అవుతుంది. అయితే.. కేబినెట్‌లోకి ఎంతమందిని తీసుకుంటారు, ఎవరెవరిని తీసుకుంటారనేది సస్పెన్స్‌గా […]

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తన మంత్రివర్గం కూర్పుపై దృష్టి సారించారు. కేబినెట్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. కేబినెట్ లోకి ఎంతమందిని తీసుకుంటారు..ఎవర్నెవరు తీసుకుంటారో సస్పెన్స్ గానే ఉన్నా..కొత్త మంత్రులు మాత్రం వచ్చే 8న ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేసేందుకు టైం ఫిక్స్ చేశారు. అదే రోజున జగన్ సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు. 9 గంటల 15 నిమిషాల నుంచి 11 […]

ప్రమాణస్వీకారం తర్వాత ఇక పాలనపై ఫోకస్ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం నుంచి శాఖల వారీగా జగన్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఆర్ధిక, రెవెన్యూ శాఖలపై రివ్యూ నిర్వహించనున్న జగన్..వచ్చే నెల 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తారు. ఇక వచ్చే […]