ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

శృతిమించిపోతున్న వైసీపీ నేతల ఆగడాలు.. మహిళపై..

ఏపీలో ప్రభుత్వం మారగానే వైసీపీ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. మొన్నటివరకు టీడీపీ నేతలపై భౌతిక దాడులకు దిగిన అధికారపార్టీ ఇప్పుడు చిరుద్యోగులను కూడా వదలటం లేదు. గుంటూరు జిల్లా ఈపూరు ICDS ప్రాజెక్టులో రాజకీయ వేధింపుల కారణంగా ఓ అంగన్‌వాడీ వర్కర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ రాష్ట్ర సహాయక కార్యదర్శి వేమేశ్వరి బాధితురాలిని […]

గోవులు మృత్యువాత.. పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలన విషయాలు

విజయవాడలో కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 గోవులు మృత్యువాత పడడంపై పోస్ట్‌మార్టం ప్రిలిమినరీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిపడని ఆహారం తినడం వల్లే గోశాల ఆవులు మృత్యువాత పడ్డాయని.. పోస్టుమార్టం ప్రిలిమినరి నివేదిక పేర్కొంది. గడ్డి మినహా పొట్టలో ఎలాంటి ఆహారం లేదని నిర్ధారణ చేశారు. గోవుల ఊపిరితిత్తులు, గుండెపై రక్తపు చారలు కనిపించాయి. గోవుల ఊపిరితిత్తుల్లో నీరు.. ముక్కులోంచి […]

రాష్ట్రంలో ఏమిటీ రాక్షస పాలన : చంద్రబాబు

వైసీపీ వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అంగన్‌వాడీ టీచర్‌ ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఏమిటీ రాక్షస పాలనంటూ నిలదీశారు. ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో వైసీపీ కార్యకర్తలు చిన్న ఉద్యోగులను వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా టీడీపీ చూస్తూ ఊరుకోదని […]

వీడని వరదలు.. ఇళ్లలోకి విషసర్పాలు

ఉభయగోదావరి జిల్లాలను వరదలు వీడడం లేదు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నది పరివాహక ప్రాంతాల గ్రామస్తుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఉభయ గోదావరి జిల్లాల్లో 159 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. గత 8 రోజులుగా వరదలతో తీవ్ర ఇబ్బందులు నరకయాతన పడుతున్నారు జనం. పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా […]

ఈనెల 19 తర్వాత బీజేపీలోకి వలసలు : కన్నా లక్ష్మీనారాయణ

వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆత్రం తప్ప ప్రగతి కనిపించడంలేదని విమర్శించారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఈనెల 19 తర్వాత అన్ని రాజకీయ పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఆర్టికల్ 370 రద్దు విజయోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ట్రిపుల్ తలాక్‌, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఘనత మోదీ […]

ఒక్కో పొట్టేలు ధర ఎంతో తెలుసా..

బక్రీద్ సీజన్లో పొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణ ధరల కన్నా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువకు పొట్టేళ్లను అమ్ముతున్నారు వ్యాపారులు. చిత్తూరు జిల్లాలో మేకలు, పొట్టేళ్ల రేట్లు చూసి కొనుగోలుదారులు హడలిపోతున్నారు. మాములు రోజుల్లో 10 నుంచి 15 వేలు పలికే పొట్టేళ్ల ధర..బక్రీద్ డిమాండ్ తో 30 నుంచి 50 వేలకు పెరిగింది. దిమ్మతిరిగేలా పెరిగిన ధరలతో పండగ ఎలా […]

అందువల్లే గోవులు మృత్యువాత పడ్డాయా? ఆ ప్రయోగం జరిగిందా?

విజయవాడలో కొత్తూరు తాడేపల్లి గోశాలలో 100 గోవులు మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపుతోంది. మరికొన్ని ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి ఆవులకు పెట్టిన దాణా తిన్న ఆవులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాయి. తెల్లవారేసరికి 100 ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. కలుషిత ఆహారం తినడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందాయని నిర్వాహకులు చెబుతున్నారు. అంతే కాదు గతంలోనూ […]

గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు..

గుప్త నిధుల కోసం దుండగులు రెచ్చిపోతున్నారు. గుప్తనిధుల కోసం మనుషులను, జంతువులను బలివ్వడం చూశాం. ఇప్పుడు ఏకంగా వాటి కోసం చారిత్రక ఆలయాలనే ధ్వంసం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామ శివారులోని కొండపై ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గతరాత్రి వాచ్‌మెన్‌ ఇంటికి వెళ్లాక కొందరు గుర్తు తెలియని దుండగులు గుప్త […]

కత్తి పట్టుకున్న యువకుడి ఫోటో.. విజయవాడలో కలకలం

ఓ యువకుడు కత్తిని షర్టులో పెట్టుకుని బైక్‌పై వెళ్తున్న ఫోటో విజయవాడలో సంచలనంగా మారింది. కానూరు ప్రాంతంలో కెమెరాకు చిక్కిన ఈ ఫోటో నగర వాసుల్లో భయాందోళనలు రేపింది. మళ్లీ నగరంలో రౌడీయిజం మొదలైందా అన్న అనుమానాలు రేకెత్తించింది. అయితే ఈ ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు.. బైక్‌ నెంబర్‌ ఆధారంగా ఆ యువకుడు షేక్‌ ఫయాజ్‌గా గుర్తించారు. అతనితో పాటు అతని […]

ప్రధాని మోదీతో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విభజన సమస్యలను గవర్నర్‌ ప్రస్తావించినట్లు సమాచారం. ఆ తర్వాత హోం శాఖ మంత్రి అమిత్‌ షా, సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌.. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను […]