కడప జిల్లా రాజంపేటలో మండలం పోలి గ్రామంలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చెరువు మట్టి విషయంలో పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో ముగ్గురి తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించగా అక్కడ కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరినొకరు దూషించుకుంటూ డాక్టర్‌ ముందే కుర్చీలతో ఘర్షణకు దిగారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉన్న ఇరువర్గాలకు చెందిన వారిని […]

తూర్పుగోదావరి జిల్లా తునిలో పత్రికా విలేకరి సత్యనారాయణ హత్యను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. దారుణమైన, క్రూరమైన సంఘటనగా, ఆటవిక చర్యగా జనసేన భావిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలతో మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా అని అనిపించక మానదంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన జర్నలిజాన్ని చంపినట్లుగా ఉందన్నారు. సత్యనారాయణ ఇంటి సమీపంలోనే నడిరోడ్డుపై హత్యకు తెగబడ్డారంటే దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని పవన్‌ కల్యాణ్‌ అనుమానం వ్యక్తం చేశారు. […]

వేద మంత్రాలు.. మంగళవాద్యాలు.. సంప్రదాయాల మధ్య పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల హృదయాలు భక్తి పారవశ్యంలో ఉప్పొంగాయి. సిరిమాను రథానికి విశేష పూజలు జరిపిన తరువాత అమ్మవారి ప్రతి రూపంగా ఉన్న పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమాను రథాన్ని అధిరోహించారు. భక్తుల జేజేల నడుమ ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. పూర్వం పట్ట్భాషిక్తుడైన ఆనందగజపతిరాజు […]

నెల్లూరు జిల్లా పర్యటనలో బిజీబిజీగా గడిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడంతోపాటు..వైసీపీ దాడులతో నష్టపోయిన వారిని ఒక్కొక్కరిగా పిలిచి పరామర్శించారు. ఆత్మకూరు నియోజకవర్గం మినగల్లులో హత్యకు గురైన వెంగయ్య కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు.రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ తన కుటుంబమని.. తన కుటుంబం జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టేది లేదని […]

తిరుపతి శ్రీనగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. స్కూలు బస్సు కింద పడి నాలుగేళ్ల ఉజ్వల్‌ దుర్మరణం చెందాడు. స్కూల్‌లో ఆడుకుంటున్న ఉజ్వల్‌ ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చేశాడు. ఇంతలో వేగంగా వచ్చిన స్కూల్‌ వ్యాన్‌ అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం జగన్‌ గారు ప్రవేశపెట్టింది వైఎస్‌ఆర్ రైతు నిరాశ కార్యక్రమం అన్నారు. ఎన్నికల హామీలో రైతుభరోసా కింద 12వేల 500 ఇస్తామని ప్రకటించి.. ఇప్పుడు కేవలం 7,500 ఇస్తూ రైతులకు రివర్స్ టెండర్ వేశారని విమర్శించారు లోకేష్. 64 లక్షల మంది రైతుల్లో సగం మందిని తగ్గించారని ఆరోపించారు. కులాన్ని […]

కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్ధులను ఓ టీచర్‌ చితకబాదాడు. ఎమ్మిగనూరులోని మాచాని సోమప్ప జిల్లా పరిషత్‌లో 9 వ తరగతి చదువుతున్న విశ్వం, సుబాన్‌ అనే విద్యార్ధులపై సైన్స్‌ టీచర్‌ రాజశేఖర్‌ కర్రతో ఇష్టం వచ్చినట్లు చికతబాదాడు. దీంతో విద్యార్ధుల శరీరాలపై బొబ్బలు వచ్చాయి. ఈ విషయాన్ని.. విద్యార్ధులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఆగ్రహించిన పేరెంట్స్‌.. స్కూల్‌ ముందు ఆందోళనకు దిగారు. టీచర్‌ను సస్పెండ్‌ చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ […]

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని శివకోటి గ్రామంలో రైతు భరోసా కార్యక్రమం రసాభాసగా మారింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ రాకుండానే వైసీపీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభించారు. అయితే కాసేపటికే సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే రాపాక.. అధికారులు, వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్‌ పాటించకపోవడంపై నిలదీశారు. ఈ క్రమంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య […]

ఒంగోలు ట్రిపుల్ ఐటీ కాలేజ్‌ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన లహరి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవుల కోసం ఇంటికి వెళ్లి ఇటీవలే కాలేజ్‌కు వచ్చింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చిన కాసేపటికే లహరి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలుస్తోంది. లహరి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందనే దానిపై […]

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ టెంపో లోయలో పడింది. ఈ ఘటనలో 7 మంది దుర్మరణం పాలయ్యారు. ఐదుగురుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో రుద్రాక్షమ్మ, శ్రీనివాస్‌, వాణి , రమేష్‌, గాయత్రమ్మ, రామలక్ష్మి, గీతాలక్ష్మీలుగా గుర్తించారు. భద్రాచలం నుంచి రాజమండ్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి అటవీ […]