ఏపీలో వన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో వన మహోత్సవం నిర్వహించారు. డోకిపర్రు వద్ద మొక్కలు నాటి వనమహోత్సవాన్ని ప్రారంభించారు సీఎం జగన్‌. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ఆయన తిలకించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. ఈ సందర్బంగా వన మహోత్సవాల్లో భాగంగా మొత్తం 25 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకుంది అటవీశాఖ.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామ సచివాలయాలు ఇక వైసీపీ రంగుల్లోకి మారిపోనున్నాయి. అక్టోబర్‌ 2 నుంచి విలేజ్‌ సెక్రటేరియట్‌‌లో ఈ మార్పు కనిపించనుంది. పంచాయతీ భవనాలన్నీ కొత్త రంగుల్లోకి మార్చాలంటూ గ్రామ సచివాలయ భవన నమూనాను అన్ని జిల్లాలకు పంపింది పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే భవనాలకు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలని […]

మూడు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం జగన్‌. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్‌ అధికారులు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం తొలిదశలో […]

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిడమర్రు, కూరగల్లులో పర్యటించిన ఆయన కొండవీటి వాగు వద్ద వంతెన పనుల్ని పరిశీలించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పవన్‌ ముందు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రాజధానిపై మంత్రి బొత్స ప్రకటనలు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చాం తప్ప… ఓ పార్టీకి ఇవ్వలేదని అన్నారు. ఈ సందర్భంగా […]

ఏపీలో సెప్టెంబర్ నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఆలస్యం కానున్నాయి. సెప్టెంబరు 1 ఆదివారం సాధారణ సెలవు దినం కావడం, మరుసటి రోజు (2న) వినాయక చవితి పండగ రోజు కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో వరుసగా రెండురోజులు సెలవుదినాలు రావడంతో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి జీతాలు,పింఛన్లు అందుతాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ తెలిపింది. కాగా గతనెల కొన్ని సాంకేతిక కారణాలతో జీతాలు, పింఛన్లు 10 […]

ఏపీలో ఇసుక పాలసీ ప్రకటించకపోవడంతో భవన నిర్మాణ రంగం బావురుమంటోంది. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇసుక కొరత గుంటూరు జిల్లా అధికార పార్టీ నేతలకు వరంగా మారుతోంది. డిప్యూటీ స్పీకర్‌ నియోజకవర్గమైన బాపట్లలో ఇసుక మాఫియా బరితెగిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇసుక అవసరం ఎక్కువగా ఉండడంతో… అక్రమ దందాకు తెరలేపారు. ఒక ట్రాక్టర్‌ ఇసుక 18 వందలు ఉండగా, గుంటూరు వచ్చే సరికి 7వేల […]

  ఏపీలో చిన్నారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నారు. అభంశుభం తెలియని పసిపిల్లలను ఎత్తుకెళుతున్నారు. మొన్నటి రాజమండ్రి బాలుడి కిడ్నాప్‌ ఘటన మరవకముందే..మరికొన్ని చోటు చేసుకున్నాయి. కొన్ని కిడ్నాప్‌ కేసులు సుఖాంతంగా ముగిస్తే…కొన్నిమాత్రం విషాదాంతం అవుతున్నాయి. తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. డబ్సు కోసం కొన్ని అయితే..వ్యక్తిగత కక్షలకు చిన్నారులను బలి తీసుకుంటున్నారు. వరుస కిడ్నాప్‌ కేసులు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారగా.. ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురి అవుతున్నారు. గుంటూరు జిల్లాలో […]

మూడు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం జగన్‌. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం తొలిదశలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రెండో దశలో విజయనగరం, విశాఖతోపాటు […]

అక్రమాలు జరిగాయన్న పేరుతో రాజధాని మారుస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని..ఇప్పటికైనా సీఎం జగన్‌ రాజధానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాజధాని మార్పుకు జనసేన వ్యతిరేకమన్నారు. అమరావతిలో పర్యటిస్తున్న పవన్‌.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.

తిరుపతి నగరంలోని భూమా థియేటర్‌ వద్ద మూడేళ్ల చిన్నారిని కొందరు ఆగంతకులు కిడ్నాప్‌ చేశారు. భూమా సినీ కాంప్లెక్స్‌లో పనిచేస్తోన్నపవన్‌,రేణుకల మూడేళ్ల కుమార్తెను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అయితే.. తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు 5 గంటల్లోనే చిన్నారి కిడ్నాప్‌ కేసును ఛేదించారు. పోలీసులు తమ కోసం వెతుకులాట ప్రారంభించిన నేపథ్యంలో.. కిడ్నాపర్లు చిన్నారిని రోడ్డు మీద వదిలిపెట్టి పరారయ్యారు. చిన్నారి భాగేశ్వరిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పజెప్పారు. […]