ఏపీలో ఇసుక పాలసీ ప్రకటించకపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇసుక కొరత గుంటూరు జిల్లా అధికార పార్టీ నేతలకు వరంగా మారుతోంది. డిప్యూటీ స్పీకర్‌ నియోజకవర్గమైన బాపట్లలో ఇసుక మాఫియా బరితెగిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒక ట్రాక్టర్‌ ఇసుక 18 వందలు ఉండగా, గుంటూరు వచ్చే సరికి 7వేల 5 వందలవుతోంది. ఇదిలా ఉండగా నిబంధనల ప్రకారం ఇసుక […]

ఇసుకపాలసీని ప్రకటించని ప్రభుత్వ తీరును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ నేతలు నిరసనల్లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. అంతకుముందే టీడీపీ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడును గృహనిర్బంధం చేశారు. దుగ్గిరాలలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఇంట్లో నిర్బంధించారు. దీంతో ప్రభాకర్‌ ఇంటి […]

ముంపు తర్వాత రోజుకో వివాదంలో మునుగుతోంది ఏపీ రాజధాని. రాజధాని తరలింపు గందరగోళానికి తెరతీసిన మంత్రి బొత్స సత్యనారాయణ..ఆ తర్వాత టీడీపీ నేతలపై మరో పిడుగు పేల్చారు. బినామీ పేర్లతో రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్నారని ఆరోపించారాయన. ఖచ్చితంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారాయన. బొత్స ఆరోపణలపై టీడీపీ ఎదురుదాడికి దిగింది. లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ ఇప్పటికే తనపై బొత్స చేసిన ఆరోపణలపై ఎదురుదాడికి దిగారు. ఇక ఇప్పుడు సుజనా […]

సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్ కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఆయనను ఢిల్లీలోని ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా నియమిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో విడుదల చేశారు. మీడియా రంగంలో 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న అరవింద్ యాదవ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియా సంస్థల్లో పనిచేశారు. జాతీయ మీడియా సంస్థలు ఆజ్ తక్, ఐబిఎన్ 7లో దక్షిణ భారత […]

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు ఇసుక కొరతను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. సిమెంట్‌ కన్నా ఇసుక ధర పెరిగిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. 20 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు సంఘీభావంగా టీడీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇసుక కొరత వల్లే ఏపీ ఎకానమీ కుదేలైందని […]

ఏపీ రాజధానిని తరలిస్తారా.. లేక అమరావతిలోనే కొనసాగిస్తారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. సీఎం జగన్‌ సీఆర్‌డీఏ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. సీఆర్‌డీఏ సమీక్ష అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజధాని పరిధిలో 35వేల […]

టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ రోజు ఎమ్మెల్యే కరణం బలరాంపై తప్పుడు కేసు పెట్టారు. నిన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై కేసులు పెట్టారు. మొన్న కూన రవికుమార్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఆముదాల వలసలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని మండిపడ్డారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో భేటీ అయిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ […]

పీటీ ఉష టెన్నిస్‌ ప్లేయర్‌. ఏంటి డౌటా. సాక్షాత్తు ఏపీ ప్రభుత్వమే ఆ విధంగా బ్యానర్లపై రాయించింది. నేషనల్‌ స్పోర్ట్స్‌ డే సెలబ్రేషన్స్‌ పేరుతో YSR క్రీడా ప్రోత్సాహకాలు ఇస్తామని ఏపీ గవర్నమెంట్‌ పేల్చిన సీరియస్‌ జోక్‌ అది. బ్యానర్‌పై టెన్నిస్‌ అని రాసి సానియా మిర్జా ఫోటో పెట్టి కింద పి.టి. ఉష అని రాసి అడ్డంగా బుక్కయింది ఏపీ గవర్నమెంట్‌. ఈ బ్యానర్‌ ఫోటోను టీడీపీ జాతీయ […]

శివుని సన్నిధి శ్రీశైలం. నిత్యం వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడుతుంటుంది. హరహరమహాదేవుడి సందర్శనార్థం భక్తులు ఆలయానికి విచ్చేస్తుంటారు. శ్రీశైలం చుట్టుపక్కల దట్టమైన అడవులు ఉంటాయి. దాంతో పాములు, పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల గర్భాలయ సమీపంలో, పరిసర ప్రాంతాల్లో, దేవస్థాన స్టాఫ్ క్వార్టర్స్‌లో, వసతి కేంద్రాల వద్ద పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలయంలో పాములు కనిపించడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే పాము […]

ఇప్పటిదాకా తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులకు ప్లాస్టిక్ కవర్లలో లడ్డూ ప్రసాదాలు అందజేస్తూ వస్తున్నారు. దీనివలన ప్లాస్టిక్ కవర్ల వినియోగం ఎక్కువ అవుతోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను జూట్‌(జనపనార)బ్యాగుల్లో పెట్టి ఇవ్వాలని నిర్ణయించారు. సెంట్రల్‌ జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కూడా తయారీ ధరకే జనపనార సంచులను టీటీడీకి విక్రయించాలని నిర్ణయించింది. జూట్‌ బ్యాగులు […]