దిశ ఘటనపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఫైర్‌ అయ్యారు. దిశ హత్యకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే.. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్‌ కళ్యాణ్ అనడం చూస్తుంటే.. ఆయన మానసిక స్థితి ఏంటో అర్థమవుతోంది అన్నారు. రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా..? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా నాయకుడు అని చెప్పుకునే […]

బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనన్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీతో విభేదించిన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశామని గుర్తు చేశారు. అమిత్‌షా అంటే వైసీపీ వాళ్లకే భయమని.. తనకు గౌరవం ఉందని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పవన్.. YCPపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్లే నాతో సంప్రదింపులు జరిపారని అన్నారు. మత మార్పిడుల అంశంపైనా […]

వైసీపీ నేతల తీరులో రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని విమర్శించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. పారిశ్రామిక వేత్తలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. 70 శాతం ఉద్యోగాలు స్థానికులే అంటున్నారు.. అసలు పరిశ్రమలు వస్తాయా అని ప్రశ్నించారు. కడప ఉక్కు పరిశ్రమ గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషను చంపేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ […]

ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి శివారులో చిన్నారి సహా మహిళ దారుణ హత్యకు గురైంది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య చేసిన తర్వాత మృతదేహాలను తగలబట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి తలపై బండరాయితో మోది చంపినట్లుగా ఆనవాళ్లను గుర్తించారు. ఓ కత్తితో పాటు బీరు బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. […]

  దిశ ఘటనపై దేశం అట్టుడికిపోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసనలు హోరెత్తిపోతున్నా.. మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో ఒకే రోజు ఘోరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ కామాంధుడు 55 ఏళ్ల మహిళలపై అత్యాచారానికి తెగబడి హత్య చేశాడు. మరో ఘటనలో భర్తే తన స్నేహితుడితో కలిసి భార్యను రేప్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో ఒకరు గతంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి […]

  రాష్ట్రంలో ఈ ఆరునెలల్లో అరాచక పాలన చూశామని.. భవిష్యత్ అంతా మనదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన రెండోరోజు పలు నియోజకకవర్గాల నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వైసీపీ బాధితులతో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ శ్రేణులకు అధినేత చంద్రబాబు ధైర్యం నూరిపోస్తున్నారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ జిల్లాలో టీడీపీ బలోపేతానికి వ్యూహాలు రచిస్తున్నారు.. తొలిరోజు […]

చంద్రబాబు అమరావతి పర్యటనలో జరిగిన దాడి ఘటనను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేసినట్లు డీజీపీ ప్రకటించగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణ జరుపుతోంది. ఈ విచారణ కొనసాగుతుండగానే టీడీపీ నేతలు గవర్నర్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అటు తమ ఫిర్యాదుపై గవర్నర్‌ స్పందన సంతృప్తినిచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య లాఠీ యుద్ధం నడుస్తోంది. గతనెల […]

ఉల్లి రేట్లు జెట్ స్పీడులో ఆకాశన్నంటుతున్నాయి. కిలో ఉల్లి ధర ఏకంగా సెంచరీ మార్క్ దాటేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి గోల మిన్నంటింది. హైదరాబాద్, కర్నూల్ ప్రతీ మార్కెట్లోనూ క్వింటా ఉల్లి ధర 10 వేలకు పైగా పెరిగింది. ఉల్లి రేట్లు రోజురోజుకి పెరిగిపోతున్నా.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదంటూ విమక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో సబ్సిడీ ఉల్లిగడ్డ అందించాలని అధికారులను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు స్టాక్ మార్కెట్లో […]

పవన్ వర్సెస్ వైసీపీతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రభుత్వంపై మరింత దూకుడు పెంచిన పవన్.. జగన్ పై విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. అటు మంత్రులు కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. ఈ విమర్శలు వ్యక్తిగత అంశాల వరకు వెళ్లటంతో రెండు పార్టీల మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఏపీ ప్రభుత్వానికి ఆరు నెలల గడువు ఇస్తామని.. ఆ తర్వాత వైఫల్యాలపై పోరాడుతామని చెప్పిన జనసేన అధినేత […]

గుంటూరు జిల్లా ఎర్రబాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు, టీడీపీ సానుభూతి పరురాలు యలమంచిలి పద్మజకు తెలుగుదేశం నేతలు అండగా నిలిచారు. గత నెల 26న పద్మజ మంత్రి కొడాలి నానిని విమర్శించిందంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా కంచించర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు స్టేషన్ బెయిల్‌పై పద్మజను విడిపించారు. స్థానిక నాయకురాలు సౌమ్య స్వయంగా తన […]