ఏపీ ఆర్థిక పరిస్థితిపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నాలుగు నెలలుగా రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం అనుకున్నంతగా లేదు. అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, జీతాలు, ఇతరత్రా ఖర్చులు చూస్తే అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప… తగ్గే అవకాశాలేమీ లేవు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు ఏంచేయాలో తెలియక ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అయోమయంలో ఉంది. వాణిజ్యపన్నుల ఆదాయంలో అనుకున్నంత వృద్ధి లేదన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఉక్కు, […]

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తమ కూతురితో సన్నిహితంగా ఉన్నాడన్న కోపంతో.. లోకేష్‌ అనే యువకుడిని పెట్రోల్‌ పోసి తగులబెట్టారు యువతి తల్లిదండ్రులు. మదనపల్లె రూరల్‌ మండలం టేకుపల్లిలో ఈ ఘటన జరిగింది. పెట్రోల్‌ పోసి తగులబెట్టినా చనిపోకపోవడంతో… కరెంట్‌ షాక్‌ ఇచ్చి హత్య చేశారు. తర్వాత నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు, డాగ్ స్క్వాడ్‌ సాయంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ముగ్గురిని పట్టుకునేందుకు […]

అక్కమొగుడే కాలయముడయ్యాడు. మరదలిపై కన్నేసిన బావ…. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో… లైంగికంగా వేధించాడు. పెళ్లి చేసుకోకపోతే.. తల్లిదండ్రులతో పాటు అక్కను చంపేస్తానని బెదిరించాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన ఆ యువతి… ఆత్మహత్య చేసుకుంది. ఒంగోలులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఒంగోలుకు చెందిన సుధాకర్‌… మాధవిని ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో… మరదలు […]

హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాల పట్టివేత కలకలం రేపింది. DCM వ్యానులో తరలిస్తున్న 10టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు ఆర్టీఐఏ పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కిషన్‌ గూడ ఓఆర్‌ఆర్‌ టోల్‌ గేట్‌ వద్ద DCM వ్యానులో సోదాలు నిర్వహించిన పోలీసులు .. తప్పుడు వే బిల్లులు సృష్టించి వ్యానులో 200 బస్తాల అమ్మోనియం నైట్రేట్‌‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. భువనగిరి నుంచి చిత్తూరు […]

అమరావతిపై వైసీపీ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబు తూర్పారబట్టారు. తెలుగు ప్రజలకు ఒక శాశ్వత ఆస్తి ఉండాలని అమరావతికి శ్రీకారం చుడితే.. ఒక్క అవకాశం అంటూ మనుగడనే ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. అమరావతిని సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్టుగా తాను రూపొందిస్తే.. సీఎం జగన్‌ అమరావతిని దెబ్బతీయడంతో.. అంతా హైదరాబాద్‌లో ఖర్చు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు నిప్పులు […]

ఏపీలో నిధుల కటకటతో సర్కార్‌ అప్రమత్తమైంది. వివిధ శాఖల్లో వసూళ్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం జగన్‌ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖలపై రివ్యూ చేశారు. తాజా పరిస్థితులపై విభాగాల వారీగా ఆయా శాఖల అధికారులను సీఎం ఆరా తీశారు. లోటుపాట్లపై చర్చించి.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలన్నారు […]

ఏపీ రాజధాని మార్పుపై అగ్గిరాజేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. రోజుకో స్టేట్ మెంట్ తో ఆ సెగను కంటిన్యూ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలకు భూములున్నాయంటూ ఆరోపణలపర్వం మొదలు పెట్టిన మంత్రి.. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ మరో ప్రకటన చేశారు. బీజేపీ నేత సుజనాచౌదరి, చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడికి ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. ల్యాండ్‌పూలింగ్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు […]

కుదిరితే పక్క పార్టీపై దాడులు.. లేదంటే అంతర్గత కుమ్ములాటలు. మొత్తానికి ఘర్షణ వాతావరణంలోనే ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నాలు. వైసీపీపై గత కొద్దిరోజులుగా టీడీపీ చేస్తున్న విమర్శలు ఇవి. టీడీపీ ఆరోపణలకు తగ్గట్టుగానే టీడీపీ నేతలపై దాడులకు తోడు పార్టీలో గ్రూప్ వార్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోని పాల్తేరు గ్రామంలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు […]

శ్రీకాకుళంలోని కూనరవికుమార్‌ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు…. ఇంట్లో అణువణువూ సోదాలు చేశారు. డీఎస్పీ శ్రీనివాస చక్రవర్తి నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. సెర్చ్‌వారెంట్‌ లేకుండా ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారంటూ రవి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పినా …పోలీసులు పట్టించుకోలేదు. చివరికి…. రవి ఇంట్లో లేరని తేలడంతో వెనుదిరిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కూనరవి సతీమణి ప్రమీల. […]

ఏపీలో పరిపాలన అస్తవ్యస్థంగా మారిందన్నారు టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రోజుకో ప్రకటనతో అమరావతిపై తీవ్ర గందరగోళం నెలకొందని చెప్పారాయన. జగన్, కేసీఆర్ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము జగన్ కు లేదని ఆయన అన్నారు.