తిరుపతిలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా వంటి నేతలే ఈ దేశానికి అవసరం అన్నారు. అమిత్‌ షా ఉక్కుపాదంతోనే మాట్లాడుతారని అన్నారు. మెతకగా మాట్లాడితే మనుషులు వినరని వ్యాఖ్యానించారు పవన్. కులాన్ని, మతాన్ని ప్రాంతాన్ని ఇష్టా రాజ్యానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాయలసీమలోకి ఎవరూ రావొద్దని దోరణితో గ్రూపులు కట్టారని ఆరోపించారు పవన్. అటు పవన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైసీపీ మంత్రి పేర్నినాని. పవన్ […]

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసును సిట్‌ అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి ముఖ్యమంత్రి జగన్‌ బాబాయ్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్ రెడ్డి, ఆయన సోదరుడు మనోహర్‌ రెడ్డి ఇంకా కొంతమందిని సిట్‌ అధికారులు విచారించారు. కడప నగర శివారులోని జిల్లా పోలీసు ట్రైనింగ్‌ సెంటర్‌లో విచారణ చేపట్టారు. అలాగే టీడీపీ నాయకుడు మాజీ జడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్‌ను […]

భవనాలను కూల్చేందుకు ప్రభుత్వం చూపించే శ్రద్ధ సామాన్య ప్రజల కష్టాలపై పెట్టాలన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. తిరుపతిలోని రైతు బాజర్‌లో ఉల్లి రైతులు, సామాన్య ప్రజలతో నేరుగా పవన్‌ మాట్లాడారు. 100 రూపాయలకు ఉల్లి అమ్ముతుంటే ఎలా కొనగలమని సామాన్యలు పవన్‌ ముందు వాపోయారు. దళారీల కారణంగానే విపరీంతంగా ధరలు పెరిగిపోయాయని కొనుగోలుదారులు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదంటూ .. రైతులు […]

ఏపీ సీఎం జగన్‌ తీరుపై మరోసారి ట్విట్టర్‌ వేదికగా నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌. ఆరు నెలల్లో తమపై చేసిన ఒక్క అవినీతి ఆరోపణనైనా నిరూపించగలిగారా అంటూ సీఎం జగన్‌ను ప్రశ్నించారు. తన చేతకాని పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని లోకేష్‌ మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబుపై బురదజల్లబోయి చేతులు కాల్చుకున్న తరువాత కూడా జగన్‌ బుద్ధిలో మార్పు రాలేదని విమర్శించారు. […]

ఓ ఆడపడుచు ఆక్రందన అరణ్య రోదనే అయ్యింది ఆమె నోరు లేని మూగ జీవాలకు డాక్టర్ నోరున్న మానవ మృగాల కామదాహానికి బలైపోయింది రోజూ మనుషులు తిరిగే ఆ దారిలో ఆరోజెందుకో ఆ దారిలో దెయ్యాలు తిరుగుతున్నట్లనిపించింది ఆమెకు.. మృగాళ్ల చూపులు ముళ్లులా గుచ్చుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది భయమైతుందని భయం భయంగానే చెప్పింది తోబుట్టువుతో.. భయపడినంతా అయింది.. నాలుగు గోడల మధ్య ఉన్న చెల్లెలికి.. అక్క నలుగురు నరరూపరాక్షసుల […]

జగన్‌ మతం మానవత్వం కాదు.. మూర్ఖత్వం అన్నారు టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ. ఈ ఆరు నెలల్లో ఏపీకి మొత్తం 67 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారాయన. రాష్ట్రంలో లక్ష బెల్ట్‌ షాపులు నడుస్తున్నాయన్నారు. మద్యం షాపుల పక్కనే బెల్ట్‌ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారన్నారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతనికి పడిపోయిందన్న ఆయన.. 30 వేల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయిందన్నారు. మంచి ముఖ్యమంత్రి కాదు.. […]

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నాగమణి అనే 55 ఏళ్ల మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఐ.పోలవరం మండలం జీ వేమవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతదేహంతో పాటు పరిసర ప్రాంతాల్లో కారం చల్లి ఉండటంతో.. అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇంట్లో మంచం మీదే చనిపోయింది నాగమణి. ఉదయం పక్కింటి మహిళ.. నాగమణి ఇంటికి వెళ్లగా ఆమె చనిపోయి ఉండటంతో.. పోలీసులకు […]

కడప జిల్లా రైల్వే కోడూరు స్టేషన్‌ వద్ద.. తిరుపతి – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఇంజిన్‌ వెనుక ఉన్న జనరల్‌ బోగి పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే రైలును నిలిపేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది.. మరమ్మత్తులు చేపడుతున్నారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  కర్నూలులో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు రాయలసీమ విద్యార్ధి నేతలు. దీంతో వీజేఆర్‌ ఫంక్షన్‌ హాలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు రాయలసీమ విద్యార్ధి నేతలు. విద్యార్ధి నేతల్ని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో వాగ్వాదానికి దిగిన విద్యార్ధులను చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు

అమరావతి పర్యటన సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి విషయంలో ఏపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఆ రోజు జరిగిన ఘటనను… గవర్నర్‌ భిష్వభూషణ్‌ హరిచందన్‌కు వివరించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. గవర్నర్‌ను కలిసివారిలో అచ్చెన్నాయుడు, వర్లరామయ్య, రామానాయుడు తదితరులు ఉన్నారు.