తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వర్షిణి హత్యకేసును చిత్తూరు జిల్లా పోలీసులు చేధించారు. నిందితుడు బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీగా గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు రఫీని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి కురబాల కోటలో ఓ పెళ్లికి వచ్చిన ఆరేళ్ల వర్షిణి దారుణ హత్యకు గురైంది. కొత్తకోట మండలం గుట్టపల్లికి చెందిన సిద్దారెడ్డి కుమార్తె వర్షిని కుటుంబసభ్యులతో కలిసి బంధువుల వివాహానికి వచ్చింది. అప్పటివరకూ కళ్యాణమండపంలో సరదాగా […]

  కడపలో రాయలసీమ వాసులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం జరిగి నేటికి 82 ఏళ్లు పూర్తయ్యాయని.. అయినా పాలక ప్రతిపక్షాలు రాయలసీమపై వివక్ష చూపిస్తున్నాయని విమర్శించారు ఏపీ విభజన హామీల ప్రత్యేక హోదా సమితి నేతలు. అప్పటి శ్రీబాగ్‌ ఒప్పందంలో కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కోటిరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. కడప కోటిరెడ్డి సర్కిల్‌లో ఆయన విగ్రహం ఎదుట పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా నిరసన […]

  అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న సుధాకర్‌ అనే ప్రయాణికుడిపై కొందరు దాడి చేశారు. కాలసముద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలో వ్యక్తులు దాడిచేశాక.. స్లోగా వెళుతున్న రైల్లోంచి సుధాకర్‌ దూకాడు. అయినా వెంబడించి కత్తితో గొంతు కోశారు దుండగులు. స్థానికులు గమనించడంతో… దాడిచేసినవాళ్లు పారిపోయారు. సుధాకర్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ మండలం పాలంవాండ్లపల్లికి చెందిన […]

వల్లభనేని వంశీ వ్యక్తిగత విమర్శలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వంశీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని తమనే తిట్టించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు టీడీపీ నేత దేవినేని ఉమా. తమను తిట్టడానికి 150 మంది ఎమ్మెల్యేలు చాలదా అని జగన్‌ను ప్రశ్నించారు. అటు టీడీపీ నేత బోడే ప్రసాద్‌ కూడా వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌పై వంశీ […]

తూర్పుగోదావరి జిల్లాలో హనీట్రాప్‌ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఇద్దరి మధ్య స్థలవివాదాన్ని సెటిల్ చేయడానికి యువతితో ట్రాప్‌ చేసిన ఘరానా మోసాన్ని సామర్లకోట పోలీసులు బట్టబయలు చేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. జి.మామిడాడలో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న తాడి కేదారమణికంఠరెడ్డి, కాకినాడలో ఓ ఛానల్‌ నడుపుతున్న తేతలి దుర్గారెడ్డి మధ్య స్థలం వివాదం ఏర్పడింది. దీంతో దుర్గారెడ్డి తన చానల్‌లో పని […]

  కర్నూలు జిల్లా కాల్వబుగ్గలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. తాగునీరు సరఫరా చేయమన్నందుకు కాలనీవాసులపై దాడి చేశారు. కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బోరు స్టాటర్ కాలిపోవడంతో నాలుగు రోజులుగా కాలనీకి తాగునీరు అందడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోకపోవడంతో కాలనీవాసులే స్టాటర్ బిగించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ అనుమతి లేకుండా స్టాటర్ ఎలా బిగిస్తారని వైసీపీ కార్యకర్తల దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం […]

సినీనటి, టీకాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి, జాతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ రామ్‌ శంకర్ కటారియా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో వేరు వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వాదం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.  

తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో భవన నిర్మాణ కార్మికుల నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కార్మికులను అరెస్ట్‌ చేసి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం  రూ. 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద దీక్ష చేపట్టారు. ఇసుక కోరతతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కుటుంబ పోషణ భారంతో […]

టీడీపీపై.. ఆ పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్పెన్షన్ వేటు పడింది. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో చంద్రబాబు తన నివాసంలో సమావేశమై.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పలువురు నేతలు జిల్లాల్లోని పరిస్థితులను చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా వంశీ ఎపిసోడ్‌ కూడా చర్చకు వచ్చింది. వంశీ తీరును టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వంశీ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని.. […]