జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. ఉన్నట్టుండి ఆయన హస్తిన టూర్‌కు వెళ్లడం ఆసక్తి రేపుతోంది. ఈ పర్యటనలో బీజేపీ పెద్దల్ని కలిసి తెలుగు రాష్ట్రాల పరిస్థితులను వివరిస్తారని సమాచారం. ప్రధానంగా ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై ఫిర్యాదు చేసేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. అటు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె విషయాన్ని బీజేపీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్తారనే చర్చ జరుగుతోంది. అయితే… […]

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీరుపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. గతంలో జగన్ ను తిట్టిన వంశీ ఇప్పుడు ఆ పార్టీలోకి ఎలా వెళ్లారు అని ప్రశ్నించారు. అన్నం తిన్న వారెవరూ వైసీపీలో ఉండరని విమర్శలు చేసిన ఆయన.. ఇప్పుడు ఏ కారణాలతో వైసీపీలోకి వెళ్తున్నారని నిలదీశారు. గతంలో వంశీ టీడీపీలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో తేడా చూపిస్తూ.. ఓ విడీయో మీడియాకు రిలీజ్ […]

ఆ ఊరు దాటాలంటే ఏరు దాటే సాహసం చేయాలంటూ.. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని చిన్నకాకుమాను గ్రామంపై టీవీ 5 ప్రసారం చేసిన కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ప్రతిరోజూ వాగు దాటుతూ.. ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులపై ప్రభుత్వం స్పందించింది. గ్రామస్తుల కోసం ఓ తాత్కాలిక బల్లకట్టు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ కష్టాలు తెలిసేలా కథనాన్ని ప్రసారం చేసిన టీవీ 5కి […]

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సన్‌ రైజ్‌ ఏపీ కాస్తా…సూసైడ్ ఏపీగా మారిపోయిందని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్.. రాష్ట్రంలో భవననిర్మాణ కార్మికులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ 6 నెలల కాలంలో జగన్ సాధించింది కక్ష సాధింపులు, కేసులు మాత్రమే అన్నారు లోకేశ్. ఇప్పటి వరకు 610 మంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారని […]

అయోధ్య వివాదం ముగియడంతో.. ఇక తమ తదుపరి లక్ష్యం తిరుమల తిరుపతి దేవస్థానమేనన్నారు హిందూ మహాసభ ఛైర్మన్‌ స్వామి చక్రపాణి మహారాజ్‌. దీనిపై ఉద్యమం చేస్తామని.. త్వరలోనే తిరుమలను దర్శించి అక్కడి చేపట్టాల్సిన సంస్కరణలపై హిందూ మహసభ ఉద్యమం చేపడుతుందన్నారు. టీటీడీ ద్వారా వచ్చిన ఆదాయం అంతా వేంకటేశ్వరస్వామి భక్తులకే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు స్వామి చక్రపాణి మహారాజ్‌. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం టీటీడీ నిధులను ప్రభుత్వ […]

27 వేల మంది వెలుగు ఉద్యోగులను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడ అలంకార్‌ సెంటర్‌ ధర్నా చౌక్‌లో ఆందోళనకు దిగారు. జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒక్క ఉద్యోగిని తొలగించినా సహించేదిలేదంటున్నారు.

టీడీపీతో పాటు అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది అధిష్టానం. ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన అధినేత చంద్రబాబు.. సుధీర్ఘ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వంశీ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చింది. వంశీ ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేశారని.. వైసీపీలోకి వెళ్లేందుకే పార్టీపై దుమ్మెత్తిపోశారని మెజార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. వంశీ […]

వైసీపీ నేతల వేధింపులతో నెల్లూరు జిల్లా దగదర్తిలో ఆత్మహత్య చేసుకున్న గండికోట కార్తీక్‌ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. అంతకుముందు కావలి ముద్దురుపాడు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత కార్తీక్‌ ఇంటికి లోకేష్‌ చేరుకున్నారు. లోకేష్‌ను చూసిన కార్తీక్‌ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. వారిని లోకేష్‌ ఓదార్చుతూ మనోధైర్యం చెప్పారు. కార్తీక్ జీవనాధారమైన హోటల్‌ను పగలగొట్టి ఇబ్బందులకు […]

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ అనంతపురం పంచాయితీరాజ్ AEE సురేష్ రెడ్డి ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. 3కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. చాలా కాలంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న సురేష్ రెడ్డి.. రాజకీయ నేతల అండదండలతో అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలున్నాయి. జేసీ దివాకర్‌ రెడ్డి పదవిలో ఉన్నా.. లేకపోయినా ఆయనకు సురేష్‌ రెడ్డి సేవలందించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల […]

  ఏపీలో ఇసుక కొరతతో పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు నిర్వహిస్తోంది. జనసేన అధినేత పవన్‌ పిలుపుతో.. విశాఖపట్నం అక్కయ్యపాలెంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ఏర్పాటు చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున శిబిరానికి తరలివచ్చి ఆకలి తీర్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో ఇసుక సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు జనసేన నేతలు. కార్మికులకు నెలకు 10 […]