వైసీపీ నేత పీవీపీపై కేసు నమోదు

వైసీపీ నేత పీవీపీపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. పీవీపీపై కైలాష్‌ విక్రం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు..తనపై గుండాలతో దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదు చేశారు. 40 మంది అనుచరులతో తమ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. టెర్రస్‌పై గార్డెన్‌ కట్టొద్దని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో... Read more »

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మాస్క్ ధరించకపోతే ఎలా? : మాజీ ఎంపీ ఉండవల్లి

ఏపీ ప్రభుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ మండిప‌డ్డారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో జరుగుతున్న అక్రమాలపై నిలదీశారు. అధిక ధర‌ల‌కు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇస్తామనడం జగన్ సర్కారు అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు. ఆవ భూముల‌పై లేఖ... Read more »

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి.. అధికారుల నిర్లక్ష్యం

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజలు ఒక్కచోట చేరకుండా చూడాలి. కానీ నెల్లూరు జిల్లా పొదలకూరులో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం లాటరీ పద్ధతి ఏర్పాటు చేశారు... Read more »

ప్రజావేదిక కూల్చివేసి రేపటికి ఏడాది పూర్తి

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేసి గురువారం నాటికి ఏడాది పూర్తైంది. సంవత్సర కాలం గడిచినా… అక్కడి స్క్రాప్‌ను మాత్రం తొలగించకుండా అలాగే వదిలేశారు. మరోవైపు ప్రభుత్వ వైఖరిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏడాది గడచిన సందర్భంగా గురువారం ప్రజావేదిక ప్రదేశాన్ని... Read more »

ఆ ముగ్గురి సమావేశం సాధారణమైందే : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. కేవలం ప్రతిపక్షాల మీద మాత్రమే కేసులు పెడుతూ…సొంత పార్టీ వారిని వదిలిపెడుతున్నారని ఆరోపించారు. వైసీపీ శ్రేణులు పెడుతున్న అసభ్య పోస్టుల సంగతేంటని నిలదీశారు…సైబర్‌ క్రైమ్ చట్టాన్ని మరింత... Read more »

ప్రకాశం జిల్లాలో నేతన్నల పరిస్థితి నానాటికీ దుర్భరం

ప్రకాశం జిల్లాలో నేతన్నల పరిస్థితి నానాటికీ దుర్భరమవుతోంది… పూట కూడా గడవక ఇబ్బంది పడుతున్నారు. చేనేతకు ఆయువుపట్టులాంటి చీరాల ప్రాంతంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమే అతిపెద్దరంగంగా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు 30వేలకుపైగా మగ్గాలుంటే ఇప్పుడవి కేవలం 4 వేలకు పడిపోయాయి. ఈపురుపాలెం, వేటపాలెంతో... Read more »

పల్నాడులో టీడీపీ కార్యకర్తలే టార్గెట్ గా తెగబడుతున్న వైసీపీ నాయకులు

పల్నాడులో మళ్లీ దాడులు మొదలయ్యాయి. టీడీపీ కార్యకర్తలే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు వైసీపీ నాయకులు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త చింతపల్లి గౌసుపై అటాక్ జరిగింది. తీవ్ర గాయాలు కావడంతో గౌసును పిడుగురాళ్లలోని ప్ర్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. Read more »

ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి చేస్తున్నది మరోటి..

అధికారంలోకి వస్తే చేనేత రంగాన్ని ఆదుకుంటాం.. మగ్గం నేసే ప్రతి కార్మికుడికి సాయం చేస్తాం.. కులం, మతం చూడకుండా అందరికీ సమానంగా ఆర్థికసాయం అందిస్తాం. ఇది వైసీపీ అధినేత జగన్…‌ ఎన్నికలకు ముందు పాదయాత్రలో నేత కార్మికులకు ఇచ్చిన హామీ… కానీ ప్రస్తుతం మాత్రం... Read more »

అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు ఇప్పట్లో లేనట్టేనా?

ఏపీనుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి వెళదామనుకున్న ప్రయాణికులకు నిరాశే మిగిలింది. ఈవారం నుంచి ఆర్టీసీ సర్వీసులు మొదలవుతాయనుకుంటే అధికారులు షాక్ ఇచ్చారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై నేడు (బుధవారం) జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల భేటీని... Read more »

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు ఇచ్చిన వైసీపీ

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. వారంలోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు పంపింది. ఇటీవల వైపీసీ ఏడాది పాలనపై రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పించారు. ఇసుక అక్రమ రవాణా,... Read more »

ఒక సామాజిక వర్గాన్ని తొక్కేయాలని అనుకోవడం భ్రమ : ఎంపీ సుజనా చౌదరి

నిమ్మగడ్డ, కామినేనితో భేటీకి సంబంధించి….. స్పష్టత నిచ్చారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఈ నెల 13న తాను నిమ్మగడ్డ, కామినేనితో రహస్యంగా సమావేశమైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు సుజనాచౌదరి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా వైసీపీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు…... Read more »

కరోనా సమయంలోనూ వైసీపీ కుంభకోణాలు, కక్షసాధింపు గర్హనీయం : చంద్రబాబు

ఏపీలో జగన్‌ సర్కారుపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కరోనా సమయంలోనూ వైసీపీ కుంభకోణాలు, కక్షసాధింపు గర్హనీయమన్నారాయన. పార్టీ సీనియర్‌ నేతలతో ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా…. ఇంటింటికి 3 మాస్కులు ఇస్తామని చెప్పి వైసీపీ మోసం చేసిందన్నారు. మాస్కుల తయారీలో... Read more »

ఏపీ : 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 9 వేల 834కు చేరాయి. కొత్తగా 462 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 407 మందికి… ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి… విదేశాల నుంచి వచ్చిన వారిలో 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.... Read more »

ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్‌డౌన్

కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో… ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్‌ ఇంతియాజ్ తెలిపారు. కేవలం మెడికల్‌ షాపులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ప్రజలు వారం రోజుల పాటు బయట తిరిగ... Read more »

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన భేటీలో దాదాపు గంటసేపు... Read more »

రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు భేటీ కావడంలో తప్పేంటి? : వర్ల రామయ్య

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు సుజన, కామినేని భేటీ కావడంలో తప్పేముందని ప్రశ్నించారు టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య. వారేమైనా అసాంఘిక శక్తులా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు. రమేష్‌ కుమార్‌ను తిరిగి నియమించేందుకు జగన్‌... Read more »