రానున్న 48 గంటల్లో తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితలద్రోణి ఏర్పడింది. ఇది ఒడిశా, బెంగాల్‌ తీరాల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో వర్షాలు పడతాయన్నారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉంటాయన్నారు. వాతావరణ శాఖ అధికారులు సూచనలతో ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు రెవిన్యూ […]

సీఎం జగన్ కు తెలంగాణపై ఉన్న ప్రేమ ఏపీ మీద లేదని ఆరోపించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. పీపీఏలకు సంబంధించి గత ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారాయన. పీపీఏలపై సమీక్ష పేరుతో తెలంగాణకు కరెంట్ ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు. వైసీపీ చెప్పిన రేట్లకు టీడీపీ ప్రభుత్వం ఎక్కడా విద్యుత్ కొనుగోలు చేయలేదని ఆరోపణలను కొట్టిపారేశారు. పీపీఏల విషయంలో ప్రభుత్వ పాత్ర నామమాత్రం అని గుర్తు చేశారు. […]

ట్విట్టర్‌ వేదికగా మరోసారి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్‌.. అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకున్నారని అన్నారు. ఇందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. బాబు హయంలో ఒక్క జాబు కూడా రాలేదు అంటూ ఎన్నో ఆసత్యాలు తన పాదయాత్రలో చెప్పారని అన్నారు. కానీ సీఎం అయిన తరువాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు పాలనలో 39వేల […]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభలో సీట్ల కేటాయింపు వ్యవహారం అధికార , ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరీలు ఒకరి సీటులో మరొకరు కూర్చొన్నారంటూ వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రూలింగ్ ప్రకారం నడుచుకోవడం లేదంటూ అధికారపక్షం ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగింది. అసెంబ్లీలో అధికార పక్షం తీరుపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సభా సంప్రదాయాలు మరిచి ఇష్టారీతిలో […]

ఎస్సీ వర్గీకరణ చేయటం అంటే దళితుల్లో చీలిక తేవటమే అన్న సీఎం జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు మందకృష్ణ మాదిగ. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తండ్రి ఆశయాల దిశగా జగన్ అడుగులు వేయాలన్నారు ఆయన. ఎస్సీ వర్గీకరణపై ఏ అసెంబ్లీలో స్టేట్ మెంట్ ఇచ్చారో అదే అసెంబ్లీ వేదికగా 24 గంటల్లో స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే […]

అక్రమ కట్టడం పేరుతో ప్రజావేదికను కూల్చడం సరైంది కాదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. గత ప్రభుత్వం చేసిన తప్పునే జగన్‌ సర్కార్‌ చేసిందన్న భావన ప్రజల్లో నెలకొందని విమర్శించారు. ప్రజావేదికపై కొంత సమయం తీసుకుని దానిని మరో ప్రాంతానికి తరలించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. కూలగొట్టడం ద్వారా నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాధవ్‌..

కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై శాసన మండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఆ నిర్మాణాలకు ఎవరి పాలనలో అనుమతులు ఇచ్చారో జగన్‌ ప్రభుత్వం గుర్తు చేసుకోవాలన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. నాడు వైఎస్‌ ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. అప్పుడు చట్టాలు గుర్తుకు రాలేదా… ఇప్పుడు గుర్తువచ్చాయా అని మంత్రి బొత్సాను నిలదీశారు యనమల. ఆర్బన్‌ డెవలప్‌ యాక్ట్ కింద అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. […]

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే స్పైస్‌ జెట్ విమానం‌లో సాంకేతిక లోపం ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించింది. ఉదయం ఎనిమిదిన్నరకు 60 మంది ప్రయాణికులతో విమానం రన్‌వే నుంచి బయలుదేరినప్పుడు అంతా బాగానే ఉంది. టేకాఫ్‌కి కొన్ని క్షణాల ముందు గాల్లోకి లేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్ల నుంచి భారీ శబ్దాలు వచ్చాయి. అప్రమత్తమైన పైలెట్ వెంటనే ఫ్లైట్‌ను నిలిపేశారు. మెల్లిగా దాన్ని టెర్మినల్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది కదల్లేదు. […]

అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు. సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసి.. కక్ష సాధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీపడి ఇసుక దోచేస్తున్నారని, పరస్పరం కేసులు కూడా పెట్టుకుంటున్నారని అన్నారు. ఇసుక కొరతతో రాజధాని పనులు ఆగిపోయాయని, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా.. సభలో ప్రస్తావించే అంశాలపై చర్చించారు. ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని అన్నారు. […]

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. సమాచార లోపంతోనే అధికారపక్ష సభ్యులు దూకుడుగా వెళ్తున్నారన్న చంద్రబాబు.. ప్రతి అంశంలోనూ ఎదురుదాడి చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.. హ్యాపీ రిసార్ట్స్‌లో నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పలు సూచనలు చేశారు. ఆ తర్వాత టీడీపీ వ్యూహ కమిటీ సభ్యులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై […]