నాలుగు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ధర ఈ రోజు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం పది గ్రాములున్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.39,640కు చేరుకుంది. 22 క్యారెట్ల ధర రూ.120 పెరిగి రూ.36,340కు చేరుకుంది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడుస్తోంది. కేజీకి రూ.20 పెరిగి ప్రస్తుతం కేజీ వెండి దర రూ.48,770కు చేరుకుంది. డిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర […]

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా తమ సంస్థ నుంచి వచ్చిన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,499 ఉన్న దానిని భారీగా తగ్గించి ప్రస్తుతం రూ.9,999కే అమెజాన్‌లో అందిస్తోంది. గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ కొనుగోలుపై వివిధ బ్యాంకులు ఆఫర్లను ప్రకటించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.500 వరకు, హెచ్‌ఎస్‌బీసీ క్యాష్ బ్యాక్ […]

స్మార్ట్ పీపుల్ కోసం ఇస్మార్ట్ బైక్ మార్కెట్లోకి రాబోతోంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో మోటారు వాహన తయారీ కంపెనీలు భారత స్టాండర్డ్ 6 ప్రమాణాలతో కొత్త బండ్లను తీసుకువస్తోంది. హీరో మోటోకార్స్ తాజాగా తన పాపులర్ మోడల్ స్ప్లెం డర్‌ను బీఎస్ 6 తో ఆధునీకరించి ismart పేరుతో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన Splendor మోటార్ సైకిల్ లేటెస్ట్ మోడల్ ఇది. మన దేశంలో […]

టెలికాం రంగంలో చైనా దూసుకుపోతోంది. మిగతా దేశాలు 5జీ నెట్‌వర్క్‌ను అందింపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉండగానే.. డ్రాగన్ కంట్రీ అప్పుడే 6జీపై కన్నేసింది. ఇప్పటికే ఆదేశంలో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. 6 జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనుల కోసం.. 2 గ్రూపులను ప్రారంభించింది చైనా. టెలికాం రంగంలో అమెరికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి గండికొట్టి.. ప్రపంచ శక్తిగా ఎదగాలన్నదే ఆ దేశ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 6జీ సాంకేతిక […]

అమెరికా- చైనా…. ప్రపంచ గమనాన్ని మార్చే శక్తిమంతమైన దేశాలివి. ఏడాదికిపైగా ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య ముదిరిన ట్రేడ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది కలవరపెట్టింది. ఒకరిపై ఒకరు పోటాపోటీగా ప్రతీకార సుంకాలను పెంచుకుంటూ వెళ్లాయి. కొన్ని కొన్ని ఉత్పత్తులపై ఏకంగా వంద శాతం సుంకాలను విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతీకార వడ్డింపులతో ఆర్ధికంగా జరుగుతున్న నష్టంపై రెండు దేశాల్లో ఆందోళన నెలకొన్నా..వెనక్కి తగ్గలేదు. […]

కాగ్నిజెంట్‌ బాటలో దేశీ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సైతం ఉద్యోగాల్లో కోత విధించనుంది. దేశంలోనే రెండో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వేల సంఖ్యలో తన ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్లు, మధ్య స్థాయి ర్యాంక్‌‌లు కలిగిన ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసేస్తున్నట్టు తెలిసింది. సీనియర్ మేనేజర్ల స్థాయి ర్యాంక్ కలిగిన జాబ్ లెవల్‌‌ 6లో 2,200 మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిసింది. కంపెనీలో లెవల్ 6, […]

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమి ఇటీవల తన అధికారిక వీబో ఖాతాలో త్వరలో రానున్న స్మార్ట్‌వాచ్ చిత్రాలను విడుదల చేసింది. ఇవి ఆపిల్ వాచ్ లకు తగ్గట్టుగానే కనిపిస్తోంది. ఈ షియోమి స్మార్ట్ వాచ్ గుండ్రని మూలలతో దాదాపు ఒకేలా ఉండే దీర్ఘచతురస్రాకార టచ్‌స్క్రీన్ కలిగి.. స్క్రోలింగ్ కోసం లుక్-అలైక్ రొటేటింగ్ రిడ్జ్ కిరీటం బటన్‌ను కలిగి ఉంది, ఈ వాచ్ కి కుడి వైపున ఉన్న పిల్-ఆకారపు బటన్ […]

ఈ దీపావళి ఆఫర్ కింద రిలయన్స్ జియో రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ. 699 కే అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మూడు వారాలుగా డిమాండ్ ఉన్నందున జియోఫోన్ దీపావళి ఆఫర్‌ను మరో నెలకు పొడిగించాలని నిర్ణయించినట్లు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. కేవలం 699 రూపాయలకు జియోఫోన్‌ను అందిస్తోంది.. ఈ ఆఫర్ గత నెలలో దీపావళికి ముందు ప్రారంభం అయింది. నవంబర్ లో కూడా […]

బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్‌లో 0.13 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.37,964కు చేరింది. అలాగే వెండి ధర 0.36 శాతం పెరుగుదలతో కేజీకి రూ.46,155కు ఎగసింది. సెప్టెంబర్ నెల ఆరంభంలో 10 గ్రాములు ఏకంగా రూ.40,000 మార్క్‌ పైకి చేరింది. తాజాగా బంగారం ధర దాదాపు రూ.2,000 పడిపోయింది. వెండి ధర కూడా గత నెలలో ఏకంగా రూ.51,000 మార్క్ పైకి చేరిన విషయం తెలిసిందే. మరోవైపు అంతర్జాతీయ […]

పసిడి ధరలో హెచ్చుతగ్గులు.. ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియని పరిస్థితి. నిన్న పెరిగింది. ఈరోజు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,880కు క్షీణించింది. కొనుగోలు దారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగార ధరపై ప్రతికూల ప్రభావం పడుతోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర వచ్చి రూ.36,530 పలుకుతోంది. బంగారం […]