ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్‌లను యాపిల్‌ విడుదల చేసింది. ఐఫోన్‌ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్‌ స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆవిష్కరించారు. ఐఫోన్‌ 11.. ఆరు రంగుల్లో లభ్యం కానుంది. కొత్తగా గ్రీన్, పర్పుల్‌, రెడ్, యెల్లో రంగుల్లో వచ్చింది. స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ […]

ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అందరికీ సాధ్యం కాదా. పెరుగుతున్న ఈ రేట్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఎక్కడికక్కడ డెవలప్‌మెంట్ జరుగుతూ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్‌లు ఆకాశహర్మ్యాలవుతున్నాయి. దక్షిణ ముంబయిలోని తార్‌దేవ్ రోడ్‌ దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ చదరపు అడుగు స్థలం ధర రూ.56,200 పలుకుతోంది. స్థిరాస్థి సలహా సంస్థ అన్‌రాక్ దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ఇక్కడ […]

మార్కెట్లోకి మరో బండి వచ్చేస్తోంది. టూ వీలర్‌లలో ఎక్కువగా అమ్ముడయ్యే హోండా యాక్టివా నుంచి కొత్త స్కూటర్ మరో రెండు రోజుల్లో వాహన ప్రియుల కోసం అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలి బీఎస్ (భారత్ స్టేజ్) 6 యాక్టివాను ఈ నెల 11న మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ముందైతే వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ […]

తక్కువ ధరకే స్మార్ట్ టీవీని అందించేందుకు జర్మనీకి చెందిన ఎలక్ట్రానిక్ సంస్ధ ముందుకు వచ్చింది. కేవలం రూ.24,999కే 49 ఇంచుల డిస్‌ప్లే కలిగిన టీవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది బ్లౌపంక్ట్ కంపెనీ. హెడ్‌ఫోన్స్, సౌండ్ బార్‌లను తయారు చేసిన ఈ కంపెనీ రెండు రకాల టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది. వినియోగదారులకు అతి తక్కువ ధరకే టీవీ అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సంస్ధ జెన్ జడ్ సిరీస్‌లో విడుదల […]

శుక్రవారం నాటి బులియన్ మార్కెట్లో భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు అడ్డుకట్ట పడింది. ఆభరణాల తయారీ దారులనుంచి బంగారానికి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడడం బంగారం రేటు దగ్గడానికి కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ అన్నారు. బంగారంలో పెట్టుబడులు బలహీనంగా మారడాన్ని కూడా మరో కారణంగా చెబుతున్నారు. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.372 తగ్గి రూ.39,278కి చేరింది. ఇదిలా వుంటే, […]

బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మరో కొత్త పాలసీని లాంచ్ చేసింది. అదే ఎల్‌ఐసీ టెక్ టర్మ్ ప్లాన్. ఇది ఆన్‌లైన్ టెర్మ్ పాలసీ. ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కనీసం రూ.50 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. పాలసీ దారుడికి కచ్చితంగా రెగ్యులర్‌ ఆదాయం వచ్చే మార్గం ఉండాలి. ఏడాదికి ఒకసారైనా అంటే వార్షిక ప్రీమియం చెల్లించొచ్చు. లేదంటే 3 నెలలకోసారి, […]

వాడుతున్న కారు లేదా బండి కొని ఎంతో కాలం కాలేదు. ఎందుకో కొత్త కారు మీద మనసు పోతోంది. తమ దగ్గర ఉన్న వాహనం కంటే ఫీచర్లు ఎక్కువ, పెట్రోల్ కన్జంప్షన్ తక్కువ.. రోడ్డు మీద రయ్‌ మంటూ దూసుకుపోతుంటే మనసు మాట విననంటోంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త వెహికల్ కోసం షోరూం వైపుకి అడుగులు పడుతుంటాయి. ఎక్సేంజ్‌లో మంచి ధర వస్తుందని డీలర్ అంటే.. దాని కంటే కొంచెం […]

గురువారం నుంచి జియో ఫైబర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డీటీహెచ్, కేబుల్‌ టీవీ కస్టమర్లను ఆకర్షించే దిశగా రిలయన్స్‌ జియో ప్రతి బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌పై ఉచితంగా సెట్‌టాప్‌ బాక్స్‌ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. జియోఫైబర్‌ కస్టమర్లందరికీ కాంప్లిమెంటరీ సెట్‌టాప్‌ బాక్స్‌ కూడా లభిస్తుందని జియో వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ మొబైల్‌ యాప్స్‌లోని వీడియో కంటెంట్, సినిమాలు మొదలైనవన్నీ కూడా జియోఫైబర్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు […]

గ్యాస్ ధరలను ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ సంస్థలు సవరిస్తుంటాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ నెలలో గృహ వినియోగ వంట గ్యాస్ ధర సవరించిన రేట్ల ప్రకారం రూ.16 పెరిగింది. 14 కిలోల బరువున్న సిలిండర్ ధర గత నెలలో రూ.590.50 వుంటే.. ఇప్పుడది రూ.16లు పెరిగి రూ.606.50గా ఉంది. ఈ ధర ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. ఇదే విధంగా వాణిజ్య వినియోగానికి ఉపయోగించే 19 కిలోల […]

వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, ఆఫర్‌లు ప్రకటిస్తుంటాయి మొబైల్ కంపెనీలు. నిన్నటి వరకు రూ.27,999ఉన్న నోకియా 8.1 ఫోన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.12,000లు తగ్గి 15,999కి వచ్చేస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ మెమోరీతో లభిస్తోంది. రూ.22,999కు 6 జీబీ+128 జీబీ వేరియంట్ ఫోన్ లభిస్తోంది. నోకియా ఆన్‌‌లైన్ స్టోర్‌లో ఈ డిస్కౌంట్ ధరలకే నోకియా 8.1స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు. నోకియా 8.1 ప్రత్యేకతలు.. 6.18 ఫుల్ హెచ్‌డీ + […]