అటు హాలీవుడ్‌లో, ఇటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుని ఇల్లాలైంది. ఇప్పటివరకు లాస్ ఏంజిల్స్‌లోని బెవెర్లీ హిల్స్‌లో ప్రియాంక, నిక్‌ల జంట ఉంటున్నారు. ఇప్పడు దీన్ని అమ్మేసి ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. అది కూడా లాస్ ఏంజిల్స్‌లోని ఎన్సివో ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఇల్లుని ఈ జంట కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగులు గల […]

పెట్స్‌ని ప్రేమించు.. కానీ పిల్లలకంటే ఎక్కువగా ప్రేమిస్తానంటే ఎలా తల్లీ. పట్టించుకుంటేనే పక్కదారి పడుతున్నారు. మరి కుక్కని అంత బాగా పట్టించుకుని కొడుకుని పట్టించుకోపోతే వాడు ఎలా తయారవుతాడో ఏమో.. నలభై ఏళ్లు వచ్చినా ఏ మాత్రం నాజుకు తగ్గని బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఐటెం డ్యాన్సర్‌గా అభిమానులను సంపాదించుకున్న మలైకా డాగ్ లవర్. క్యాస్పర్ అనే పొమేరియన్ జాతికి చెందిన కుక్కను ఆమె ఎంతో […]

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి చిక్కుల్లో పడ్డారు. ఆమె భర్త రాజ్ కుంద్రా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. మనీలాండరింగ్ కేసులో రాజ్‌కుంద్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ముంబైలోని ఈడీ ఆఫీస్‌లో విచారణ జరిగింది. వాస్తవానికి నవంబర్ 4న విచారణ జరగాల్సి ఉండగా, వ్యక్తిగత పనుల కారణంగా రాజ్‌కుంద్రా ముందుగానే విచారణకు హాజరయ్యారు. గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చీ అనుచరుడు రంజిత్ బింద్రాతో సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. RKW డెవలపర్స్‌, బాస్టియన్ […]

ఓ అందమైన అమ్మాయి అమాయకంగా ముఖం పెట్టి వలపు వల విసిరేసరికి అబ్బాయిల హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అందంతో పాటు తెలివితేటలు కూడా అమోఘంగా ఉన్న అమ్మాయి టెక్నాలజీని తెగ వాడేస్తుంటుంది. ఓ డేటింగ్ యాప్‌తో ప్రయోగాలు చేస్తుంటుంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కబీర్‌సింగ్ చిత్రంలో కాలేజీ అమ్మాయి పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన కియారా ఇందూ కీ జవానీ‌లో కాస్త డిఫరెంట్‌గా కనిపించనుంది. […]

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని పెళ్లై నలుగురు పిల్లలున్నా నటుడు ధర్మేంద్రపై మనసు పడింది. ఎందుకో ఆయన్ని చూడగానే సొంత మనిషిలా అనిపించారు. ఆ క్షణంలోనే ఆయన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. అయితే మొదటి భార్యనుంచి, ఆమె పిల్లలనుంచి అతడిని దూరం చేయాలనే ఉద్దేశం అసలు లేదు. అందుకే ఆ విషయాల్లో నేను తల దూర్చను అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమామాలిని పేర్కొన్నారు. ఎంపీగా ఉన్న తాను […]

బాలీవుడ్‌ సెలబ్రెటీలతో మోదీ మీటింగ్‌ను మెచ్చుకుంటూనే సెటైర్లు వేశారు చిరంజీవి కోడలు ఉపాసన. హిందీ కళాకారులతో మాత్రమే సమావేశం అయ్యారని ఆక్షేపించారు. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి ఎవ్వరికీ ప్రాతినిథ్యం లేకుండా పోయిందని ఉపాసన గుర్తుచేశారు. నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఇది తనను చాలా బాధిస్తోందని ఉపాసన ఆవేదన వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను సరైన స్ఫూర్తితో తీసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. Jai Hind @narendramodi ji. 🙏🏻 pic.twitter.com/11olAv1tsV — […]

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితమే ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఐసీయూ తరహా సదుపాయాలు ఉండే గదిలో బిగ్‌బీకి ట్రీట్‌మెంట్ జరుగుతోంది. కాలేయ సంబంధ వ్యాధి కారణంగా అమితాబ్ హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం. ఐతే, అమితాబ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, […]

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. లివర్ సమస్య కారణంగా మూడు రోజుల నుంచి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యుల బృందం వెల్లడించింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆయన హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలిపారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని […]

నీ మనసులో ఎలాంటి ఆలోచనలు చేస్తావో అవి నీ ముఖంలో ప్రతిబింబిస్తాయి. అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అందునా నటులకు అది అత్యంత అవసరం. ఓ నటి హావ భావాలను, ఆమె ప్రవర్తను ఓ కంట కెమెరా కన్ను కనిపెడుతూనే ఉంటుంది. చాలా కష్టపడుతున్నాము  అని మనకి మనం అనుకుంటాం. కానీ ఎదుటి వ్యక్తి కూడా అదే స్థాయిలో.. ఒక్కోసారి అంతకంటే ఎక్కువే కష్టపడుతుంటారు. […]

వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచంలో నాకంటే సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరు అని బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఆనందంగా చెబుతోంది రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్‌ల పెళ్లి గురించి. రణ్‌బీర్‌కు కరీనా వరుసకు సోదరి అవుతుంది. ముంబయలోని ‘జియో మామి మూవీ మేలా’ వేడుకలకు కరీనాతో పాటు దీపికా పదుకొణె, ఆలియా, జాన్వీ కపూర్, కరణ్ జోహార్ తదితరులు హాజరయ్యారు. వారి సరదా సంభాషణలో ఆలియా-రణ్‌బీర్‌ల పెళ్లి ముచ్చట వచ్చింది. […]