1969 డిసెంబర్ 30న తెలంగాణలోని కోదాడలో జన్మించిన వేణు మాధవ్.. నాలుగో ఏట నుంచే మిమిక్రీ చేస్తూ అందర్నీ ఆకర్షించేవాడు. మిమిక్రీ చేస్తూనే అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. పార్టీ ఆఫీసులో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు. సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న సంప్రదాయం చిత్రంలో కమెడియన్‌గా అవకాశం వచ్చింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన […]

ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు మోసం చేశాడు. దాంతో అతడి నుంచి విడిపోయింది.. విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైంది. అయిన వారు లేరు.. ఆదరించే వారు లేరు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇలా ఆలోచిస్తూనే రైలెక్కింది. గమ్యస్థానం తెలియకుండా రోజూ రైల్లో ప్రయాణం చేస్తుంటుంది. ఊహించని పరిణామం ఎదురవుతుంది ఓ రోజు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అదే ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’. […]

అయ్ బాబోయ్ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే అంటూ వరుణ్ తేజ్‌తో, సాయి పల్లవి ఆడి పాడి హిట్ కొట్టిన చిత్రం ఫిదా. అందులో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు వరుణ్‌ కూడా ఆమెకు ఫిదా అయ్యానంటున్నాడు. మంచు లక్ష్మి Voot అనే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో వరుణ్ తేజ్‌ను ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా.. వరుణ్‌ని ఇప్పటి వరకు నటించిన హీరోయిన్స్ గురించి చెప్పమంటే.. ఒక్కొక్కరి […]

ఇటీవల కన్నుమూసిన చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌కు నటన అంటే ఎంత ఆసక్తో తెలిసిందే. నటనపై ఆసక్తి కారణంగా డాక్టర్‌ వృత్తిలో బిజీగా ఉన్న సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించకపోయినా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. రాజకీయాల్లో కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకుగాను శివప్రసాద్ తనదైన శైలిలో నటనానుభవాన్ని జోడించి రోజుకో వేషంతో కేంద్రంపై నిరసన వ్యక్తం చేసేవారు. పారితోషికం […]

వరుస ప్లాపులతో ఇబ్బందిపడ్డ కాజల్ తాజా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తమిళంలో జయంరవితో చేసిన ‘కోమలి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో కాజల్‌ అగర్వాల్‌ ఆనందానికి అవధుల్లేవు. కొద్దిరోజులుగా కాజల్ ను ప్లాపులు వెంటాడుతున్న తరుణంలో ఈ సక్సెస్ మంచి కిక్కించింది. దాంతో వెర్రి ఆనందంలో ఉన్న కాజల్ ఈ విజయాన్ని తన అభిమానులతో పంచుకుంది. చాలా రోజుల తరువాత మంచి సక్సెస్ సాధించినందుకు ఆనందంగా […]

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (ఐఫా) 2019, 20వ ఎడిషన్ వేడుకల్లో ఓ వీధి కుక్క కూడా పాల్గొంది. దాంతో అది కూడా సెలబ్రిటీ అయిపోయింది. ఈ వేడుకలో ఆ కుక్కను ఇంటర్వ్యూ చేయటం కూడా జరిగిపోయింది. ఇటీవల ఐఫా వేడుకలు జరుగుతున్న వేదిక వద్దకు ఓ వీధి కుక్క చొరబడింది. గెస్ట్ ల కోసం ఏర్పాటు చేసిన గ్రీన్‌ కార్పెట్‌ మీద అటు ఇటు తచ్చాడటం మొదటుపెట్టింది.ఈ […]

నేను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎలా ఉండాలనే దానిపై పెద్దగా కోరికలు ఏం లేవు.. కాకపోతే ఉల్లి పాయ తినకూడదు.. ప్రతి రోజు క్లీన్ షేవ్‌తో కనిపించాలి.. మూడు పూటలా అతడే వంట చేయాలి.. మద్యం, మాంసం ముట్టుకోకూడదు.. కేవలం సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి.. భారత్‌లోని అన్ని భాషా చిత్రాలపై అతడికి గౌరవం ఉండాలి. వాటిని చూసి ఎంజాయ్ చేయాలి. కలర్, కులం వీటి గురించి నేనసలు పట్టించుకోను. […]

మహేష్ బాబు మరియు అల్లు అర్జున్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తుంటారు. ముఖ్యంగా తమ పిల్లలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్‌ చేస్తుంటారు ఈ హీరోలు. అయితే ఆదివారం ‘డాటర్స్‌ డే’ సందర్భంగా ఓ క్యూట్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ. అల వైకుంఠపురము మూవీ టీజర్‌లో మురళీ శర్మ, […]

మొదట తాను పెళ్లి చేసుకున్నా.. భార్య మనసు తెలుసుకుని తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు. ఇది కొత్త జీవితం చిత్రం లో భారతీ రాజా శివప్రసాద్‌కు ఇచ్చిన పాత్ర. ఓసారి దర్శకుడు భారతీరాజా శివప్రసాద్ చదివే కాలేజీకి చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. దర్శకుడిని కలిసి తనకీ సినిమాల్లో ఏదైనా వేషం ఇప్పించమని శివప్రసాద్ అడిగే సరికి.. ఆయనకు నాటకాల్లో ఉన్న అనుభవం.. సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి.. […]

బుల్లితెరపై సుధీర్, రష్మీల జోడీ చూస్తే అభిమానులకు పండగే. వారు చేసే చిలిపి అల్లరి, ఆకట్టుకునే డ్యాన్స్ ఫెర్మామెన్స్, వారిమధ్య కెమిస్ట్రీ, ఒకరిపై ఒకరు చేసుకునే కామెంట్లు.. అన్నీ హైలెట్టే. వీరిద్దరు ప్రధాన పాత్రధారులుగా సాగుతున్న బుల్లి తెర షో లు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. వీరి లవ్‌ట్రాక్ ప్రధాన హైలెట్‌గా కొనసాగుతుంటుంది. ఈ నెల 27న ప్రసారం కాబోయే జబర్దస్త్‌షోలో రష్మీ, సుధీర్‌ల జోడీపై షూట్ చేసిన సన్నివేశాలు […]