నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమై ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చండూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాష్‌రావు అనే విద్యార్థి.. హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఓ మైనర్ బాలికను ప్రకాష్‌ ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో వారు ప్రకాష్‌ను బెదిరించారు. పేరెంట్స్‌కు కూడా ఫిర్యాదు […]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వర్షిణి హత్యకేసును చిత్తూరు జిల్లా పోలీసులు చేధించారు. నిందితుడు బసినికొండకు చెందిన లారీ డ్రైవర్ రఫీగా గుర్తించారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు రఫీని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి కురబాల కోటలో ఓ పెళ్లికి వచ్చిన ఆరేళ్ల వర్షిణి దారుణ హత్యకు గురైంది. కొత్తకోట మండలం గుట్టపల్లికి చెందిన సిద్దారెడ్డి కుమార్తె వర్షిని కుటుంబసభ్యులతో కలిసి బంధువుల వివాహానికి వచ్చింది. అప్పటివరకూ కళ్యాణమండపంలో సరదాగా […]

  అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న సుధాకర్‌ అనే ప్రయాణికుడిపై కొందరు దాడి చేశారు. కాలసముద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలో వ్యక్తులు దాడిచేశాక.. స్లోగా వెళుతున్న రైల్లోంచి సుధాకర్‌ దూకాడు. అయినా వెంబడించి కత్తితో గొంతు కోశారు దుండగులు. స్థానికులు గమనించడంతో… దాడిచేసినవాళ్లు పారిపోయారు. సుధాకర్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ మండలం పాలంవాండ్లపల్లికి చెందిన […]

తూర్పుగోదావరి జిల్లాలో హనీట్రాప్‌ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఇద్దరి మధ్య స్థలవివాదాన్ని సెటిల్ చేయడానికి యువతితో ట్రాప్‌ చేసిన ఘరానా మోసాన్ని సామర్లకోట పోలీసులు బట్టబయలు చేశారు. సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన చాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకున్నారు. జి.మామిడాడలో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న తాడి కేదారమణికంఠరెడ్డి, కాకినాడలో ఓ ఛానల్‌ నడుపుతున్న తేతలి దుర్గారెడ్డి మధ్య స్థలం వివాదం ఏర్పడింది. దీంతో దుర్గారెడ్డి తన చానల్‌లో పని […]

  కర్నూలు జిల్లా కాల్వబుగ్గలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. తాగునీరు సరఫరా చేయమన్నందుకు కాలనీవాసులపై దాడి చేశారు. కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బోరు స్టాటర్ కాలిపోవడంతో నాలుగు రోజులుగా కాలనీకి తాగునీరు అందడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోకపోవడంతో కాలనీవాసులే స్టాటర్ బిగించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే తమ అనుమతి లేకుండా స్టాటర్ ఎలా బిగిస్తారని వైసీపీ కార్యకర్తల దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం […]

శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి మండలం గంగన్నపేట గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకైన ఘటన కలకలం సృష్టించింది. గ్యాస్‌ లీకై కరెంట్‌ వైర్లకు తాకి మంటలు చెలరేగడంతో ఓ ఇంట్లోని సామాన్లు బుగ్గిపాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. 5 తులాల బంగారం, ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. గ్యాస్‌ లీకై […]

  గుంటూరు జిల్లా రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో రామిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు కోటిరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. అర్ధరాత్రి పోలీస్‌స్టేష్‌లోని బాత్రూమ్‌లో డెటాల్‌ తాగాడు. వెంటనే ఆయన్ను నర్సరావు పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కోటిరెడ్డిని తాము విచారణ కోసం మాత్రమే స్టేషన్‌కు పిలిచామని పోలీసులు చెప్తున్నారు. కోటిరెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. నర్సరావుపేటకు చెందిన కొందరు వైసీపీ నాయకులు తప్పుడు కేసులు […]

మహబూబాబాద్ జిల్లాలో మరో ఆర్టీసీ కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. 39 రోజులుగా సమ్మెలో పాల్గొన్న ఆవుల నరేష్ అనే కార్మికుడు గత కొద్దిరోజులుగా ఆందోళనగా ఉంటున్నాడు. అటు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చాడు. తీవ్ర మనోవేదనకు గురైన నరేష్.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుండా.. […]

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దామెర మండలం ముస్తాలపల్లిలో కుటుంబ కలహాలతో తల్లిదండ్రులే కొడుకును సజీవదహనం చేశారు. నిత్యం మద్యం సేవించి వచ్చి గొడవపడుతున్న కొడుకుతో విసిగిపోయిన వృద్ద దంపతులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కడారి మహేష్ చంద్ర అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం భార్యను వేధిస్తున్నాడు. దీంతో బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు వేములమ్మ, ప్రభాకర్ లతో […]