బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా.. నిర్భయ వంటి చట్టాలు అమలవుతున్నా..  అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై  కఠిన చట్టాలు వస్తున్నప్పటికీ.. బాలికలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఓ వైపు దేశం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు నీచుల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. తాజాగా ఓ యువకుడు ముద్దు పెట్టుకోనివ్వలేదన్న కోపంతో తన స్నేహితురాలినే కొట్టి చంపేశాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన […]

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పాతూరులో నివాసముంటున్న ప్రసన్న కుమారి ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. ప్రసన్నకుమారికి… ప్రేమసాగర్‌కి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇటీవలే ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో ప్రసన్న కుమారి పుట్టింటికి వచ్చింది. ప్రసన్నకుమారి తల్లి ఫంక్షన్‌లో పాల్గొనేందుకు పొరుగురికి వెళ్లి వచ్చే సరికి..కూతురు ఉరి వేసుకుని విగతజీవిగా కన్పించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడే..తన కూతురిని చంపి […]

ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టమండీ బాబు.. ఎన్ని తెలివి తేటలు. మా రోజుల్లో అయితే ఇలా ఉండేవారా.. చెప్పిన మాట విని బుద్దిగా చదువుకునేవారు. ఇప్పుడు పిల్లలు.. పిల్లలు కాదండీ పిడుగులు.. పనికొచ్చే తెలివి తేటలయితే బానే ఉంటుంది. ఏడేళ్లకే ఎన్ని బుద్దులో.. పిల్లల తెలివికి బాధపడాలో సంతోషించాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రులకి. పట్టుమని పదేళ్లయినా లేవు వాడికి. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుకోవడానికని నాన్న బ్యాంక్ అకౌంట్ […]

కోడలి అక్రమ సంబంధం విషయం తెలిసి ప్రియుడిని, ఆమెను సీక్రెట్‌గా పట్టుకోవడానికి ప్రయత్నించిన అత్తకు ఆ జంట షాక్ ఇచ్చింది. వివాహేతర సంబంధం బయటపెట్టేందుకు యత్నించిన అత్త నుంచి తప్పించుకుని ప్రియుడితో కలిసి కోడలు పరారైంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోవిల్‌పట్టికి చెందిన సులోచనకు సింగపూర్‌లో పనిచేసే మేల్‌నిలై పట్టికి చెందిన ఓ యువకుడితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. సింగపూర్‌లో ఉంటూ అప్పుడప్పుడూ సొంతూరికి వచ్చి […]

గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. తప్పు చేసిన వారిపట్ల ఎంతటి కఠిన వైఖరి అవలంభిస్తారో ఈ సంఘటన రుజువు చేస్తుంది. పైగా తీర్పులు కూడా సంవత్సరాల తరబడి నాన్చకుండా వెంటనే అమలు పరిచేలా చర్యలు తీసుకుంటారు. కేరళకు చెందిన అబ్రహం, బ్లెస్సీ టామ్ ‌భార్యా భర్తలు. దుబాయ్‌లో నివసిస్తున్న వారికి ఇద్దరు కుమారులు. బ్లెస్సీ.. షార్జా యూనివర్సిటీ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో […]

కారణాలు చిన్నవే.. కానీ మనుషుల్ని చంపేంత కక్షలు. కోపం తారాస్థాయికి చేరుకుంటోంది. ఏం చేస్తున్నారో వారికి కూడా తెలియట్లేదు. అనంతర పరిణామాలు ఆలోచించట్లేదు. బిల్లు ఇంత వేశారేంటి అని హోటల్ యజమానిని అడిగినందుకు పాతికేళ్ల కుర్రాడిని దారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భదోని జిల్లాకు చెందిన సురాజ్ సింగ్, విశాల్ దూబే అనే ఇద్దరు యువకులు మహరాజ్‌గంజ్ సమీపంలోని సర్దార్ దాబాకి భోజనానికని […]

ఎయిర్‌పోర్టులో ఎక్కువ లగేజీని అనుమతించరని తెలుసు.. అడుగడుగునా చెకింగ్ ఉంటుందనీ తెలుసు. అయినా అంత సాహసం ఎలా చేసిందో.. లగేజీ బ్యాగ్‌లోని బిడ్డని చూసి విమాన సిబ్బంది షాక్‌కి గురయ్యారు. ఆరు రోజుల బిడ్డని అమ్మ నుంచి దూరం చేసి అక్రమంగా తరలిస్తుందేమో అన్న అనుమానంతో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం అమెరికాకు చెందిన […]

అనంతపురం జిల్లా వజ్రకరూర్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌ తగిలి ఇద్దరు యువ రైతులు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పొట్టిపాడు గ్రామానికి చెందిన వీరన్న, భాగ్యమ్మలకు ముగ్గురు సంతానం. ఏడాది క్రితం 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. పక్కనే ఉన్న HNSS కాలువ నుంచి పొలానికి మోటార్‌ బిగించే క్రమంలో చంద్రన్న, వీరన్నలు విద్యుత్ […]

అన్నకు తోడుగా ఉండాల్సిన తమ్ముడు.. అన్న కొడుకుకు అండగా నిలవాల్సిన బాబాయి.. రాక్షసుడయ్యాడు.. ఆస్తి కోసం అన్న కుటుంబాన్నే అంతం చేయాలనుకున్నాడు. ఎనిమిదేళ్ల చిన్నారి నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని పుట్టిన రోజునాడు ఆశీర్వదించాల్సిన అతడు మానవత్వం మరిచిపోయాడు. చిన్నారి నోటిని తీపి చేయాల్సిన కర్కోటకుడు.. కేకులో విషం కలిపి ప్రాణాలు తీశాడు.. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఈ దారుణం మానవత్వాన్ని మరోసారి ప్రశ్నించేలా చేసింది. పుట్టిన రోజు అంటే […]

అమలాపురంలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కేసు కొత్త అనుమానాలకు తావిస్తోంది. గత నెలలో విషాన్ని సెలైన్‌తో ఎక్కించుకొని డాక్టర్ రామకృష్ణంరాజు అతని భార్య, కుమారుడుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆర్ధోపెడిక్ డాక్టర్ గా రామకృష్ణం రాజుకు మంచి పేరు ఉంది. తక్కువలో వైద్యం చేసే వ్యక్తిగా మంచి గుర్తింపు కూడా ఉంది. కుటుంబంలో అంతా డాక్టర్లే. పెద్దకుమారుడు MBBS పూర్తి చేశాడు. చిన్న […]