దిశ ఘటనతో దేశవ్యాప్తంగా జనం రగిలిపోయారు. ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఊరూవాడా ఆందోళనలకు దిగారు. మీ వల్ల కాకపోతే మాకు అప్పగించండి… వాళ్లను చంపేస్తామంటూ నినాదాలు చేశారు. దిశను దారుణంగా హత్యచేసిన వారిని నిల్చోబెట్టి కాల్చేయాలన్న కసి జనంలో కనిపించింది. వాళ్లను నిర్దాక్షిణ్యంగా ఉరివేయాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా వాళ్లు […]

పోలీసులు తమకు అన్యాయం చేశారన్నారు దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య. నేరం చేసిన ఎంతోమందిని ఏళ్ల తరబడి జైళ్లలో పెట్టి పెంచుతున్నారని,కానీ తన భర్తను ఇలా చంపేశారని ఆమె అన్నారు. Also watch:

ఇంత త్వరగా తమ బిడ్డకు న్యాయం జరుగుతుందని అనుకోలేదన్నారు దిశ తల్లి. తప్పుచేసేముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేదికాదన్నారు. తన కూతురు కొవ్వొత్తిలా కరిగిపోయి దేశాన్ని కదిలించిందన్నారు. మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ పోలీసులను దిల్లీ పోలీసులు ఆదర్శంగా తీసుకొని నిర్భయ నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు విజ్ఞప్తిచేశారు.

దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై మహిళా లోకం హర్షిస్తోంది. నల్గొండ జిల్లాలో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడాలంటే భయపడేలా చేశారని అభిప్రాయ పడుతున్నారు. కామాంధుల ఎన్‌కౌంటర్‌తో ఇకనైనా మహిళలపై అత్యాచారాలు, హత్యలకు బ్రేక్‌ పడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. తెలంగాణ పోలీసులు.. దిశకు నిజమైన ఘన నివాళిని ఇచ్చారని మహిళలోకం అభిప్రాయపడుతుంది. స్పాట్‌కు వెళ్లిన పోలీసులపై స్థానికులు పూలవర్షం కురిపించారు.

హైదరాబాద్‌ శివార్లలో నవంబర్‌ 27వ తేదీన దిశను హత్యాచారం చేశారు నలుగురు నిందితులు. ఆ స్కూటీకి పంచర్‌ ఏపిస్తామంటూ నమ్మించి.. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు. ఆమె ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు విచారణ సాగించారు. కొన్ని గంటల్లో నిందితులను గుర్తించారు. 28వ తేదీన ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్.. నలుగురినీ పట్టుకున్నారు. ఆ తర్వాతి రోజు.. షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో వారిని విచారణ చేశారు. ఆ టైమ్‌లో పోలీస్‌స్టేషన్ బయట టెన్షన్‌ […]

ఆ రాక్షసుల పాపం పండింది. దిశను తగులబెట్టిన చోటే.. ఆ నలుగురూ హతమయ్యారు. దిశపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో.. ఆమెను ఏకంగా హత్య చేసిన దుర్మార్గులు.. అదే స్పాట్‌ దగ్గర హతమయ్యారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర దిశను తగులబెట్టిన స్పాట్‌కు.. జస్ట్ అర కిలోమీటర్ దూరంలో వారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. హైద్రాబాద్‌ శివార్లలోని తొండుపల్లి టోల్‌గేట్‌ దగ్గర.. నవంబర్‌ 27న అత్యంత […]

దిశ హంతకులు హతమయ్యారు. పోలీసుల నుంచి పారిపోతుండగా ఎన్‌కౌంటర్ చేసేశారు. దిశ హత్య కేసును విచారిస్తున్న పోలీసులు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసే క్రమంలో నలుగురు నిందితులను చటాన్‌పల్లికి తీసుకెళ్లారు. వాళ్లు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. దీంతో.. వాళ్లు తుపాకులకు పనిచెప్పాల్సి వచ్చింది. కొన్నాళ్ల క్రితం శంషాబాద్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కన దిశపై దారుణ అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు నిందితులు ఆరిఫ్, శివ, […]

దిశ హంతకులు హతమయ్యారు. పోలీసుల నుంచి పారిపోతుండగా ఎన్‌కౌంటర్ చేసేశారు. దిశ హత్య కేసును విచారిస్తున్న పోలీసులు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసే క్రమంలో నిందితులను చటాన్‌పల్లికి తీసుకెళ్లారు. వాళ్లు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో.. పోలీసులు తుపాకులకు పనిచెప్పాల్సి వచ్చింది.  

దిశ కేసులో పోలీసులు దూకుడు పెంచారు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఛార్జ్‌ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి నిందితులకు కఠిన శిక్షలు వేయించడమే టార్గెట్‌గా పనిచేస్తున్నారు. ఏడు బృందాలు ఆధారాల సేకరణలో వున్నాయి. ఒక్కో టీమ్‌లో ఉన్నతాధికారి నుంచి కానిస్టేబుల్ వరకూ ఏడుగురు ఉంటారు. ఇక కేసులో కీలకమైన నిందితుల కస్టడీ ఎపిసోడ్‌ బాధ్యతలు డీసీపీ ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం తీసుకుంది. విచారణకు సంబంధించిన వివరాలన్నీ అత్యంత […]

గత నెల 26న హైదరాబాద్ వనస్థలిపురంలో…జరిగిన ఓ వ్యక్తి సజీవదహనం ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. S.K.D నగర్‌ కాలనీలో..రాత్రి ఇంట్లో నివసిస్తున్న రమేష్ అనే వ్యక్తి సజీవ దనహం అయ్యాడు. అయితే పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. రమేష్‌ను భార్య స్వప్నే అంతమొందించినట్లు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డుగ్గా ఉన్నాడని.. ప్రియుడు వెంకటయ్యతో కలిసి భర్తను చంపేసింది. నవంబర్ 26న రమేష్‌ నిద్రిస్తున్నప్పుడు వెంకటయ్యతో కలిసి […]