తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి ఓ ఇంట్లో నుంచి అరుపులు రావడంతో చుట్టుపక్కల వారికి మెలకువ వచ్చింది. మంత్రాలు చదువుతున్నట్టు అర్థం కావడంతో ఉలిక్కిపడ్డారు. శనివారం రాత్రి ఓ ఇంట్లో పూజలు చేస్తున్నట్టు స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చి పరిశీలించిన పోలీసులు.. ఇంట్లోవాళ్ల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also watch :

1

సాఫీగా సాగుతున్న ఓ జంట జీవితంలో ఊహించని మలుపు ఎదురైంది. భర్తతో ఎంతో హాయిగా జీవించాలనుకున్న ఆ భార్య జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. భర్త పరాయిస్త్రీతో సంబంధం పెట్టుకోడాన్ని తట్టుకోలేని ఆ ఇల్లాలు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనే విషయాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచాలని భావించింది. ఈ నేపథ్యంలో భర్తకు తెలియకుండా వారి పడక గదిలో సీక్రెట్ […]

గుంటూరు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జానియర్ కాలేజీలో లెక్చరర్‌ అదృశ్యం కలకలం రేపుతోంది. కాలేజీలో విద్యార్థిని మందలించే క్రమంలో లెక్చరర్‌ సాంబశివరావు చేయి చేసుకున్నాడు. దీంతో లెక్చరర్‌పై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు పోలీసులు.. విద్యార్థి-లెక్చరర్ మధ్య రాజీ కుదుర్చారు. అయితే బుధవారం సాంబశివరావుపై విద్యార్థి తల్లిదండ్రులు బెదిరింపులు, దౌర్జన్యానికి దిగారు. దీంతో మనస్తాపానికి గురైన సాంబశివరావు.. బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. దీంతో లెక్చరర్‌ […]

హైదరాబాద్‌లో కొత్త తరహా మోసానికి తెరలేపింది ఓ సైబర్‌ లేడి. నగరంలోని పలు స్కూల్స్‌కి చెందిన అఫిషియల్ ఫేస్‌బుక్‌ నుంచి ఫోటోలు డౌన్‌లోడ్‌ చేసి.. వాటిని మార్ఫింగ్ చేస్తోంది. ఆ తర్వాత ఆ ఫోటోలను బాధితులకు పంపి బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తోంది. తాను సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న ఈ కిలాడీ .. ఫోటోలు తీసేస్తానంటూ డబ్బులు వసూలు చేసింది. బాధితులు సైబర్ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించడంతో […]

హైదరాబాద్‌ శివార్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ గోల్డ్‌ షోరూంలో దోపిడీకి దొంగలు స్కెచ్ వేయగా.. దుండిగల్ ఎస్సై అడ్డుకున్నారు. స్పాట్‌కు వచ్చిన ఎస్సై శేఖర్‌రెడ్డిని.. తమ వెహికల్‌తో ఢీ కొట్టి.. హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. దొంగల బారి నుంచి దుండిగల్ ఎస్సై.. చాకచక్యంగా తప్పించుకున్నారు. దోపిడీ దొంగలు తనపై హత్యాయత్నం చేసినా ఎస్సై శేఖర్‌రెడ్డి ఏమాత్రం భయపడలేదు. వెంటనే వారిని వెంబడించారు. సినీ ఫక్కీలో ఛేజింగ్ సీన్ […]

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం జట్టిగుండ్లపల్లిలో దారుణం జరిగింది. ఓ మైనర్‌ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నెల 10న జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. 14 ఏళ్ల బాలికను హరి, రాజులతోపాటు మరో యువకుడు కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ముగ్గురూ కలిసి బాలికను  నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి […]

భార్యకు తోడుగా ఉండటానికి వచ్చిన మరదలిపై కన్నేసిన ఓ నీచుడు.. దారుణానికి యత్నించాడు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో సపర్యలు చేసేందుకు మరదలు వచ్చింది. ఆమెను లొంగదీసుకుని తన కోరికలు తీర్చుకోవాలనుకున్నాడు ఆ దుర్మార్గుడు. అందుకు ఆమె నిరాకరించడంతో అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తన చెల్లిలి జీవితాన్ని నాశనం చేయాలని చూసిన భర్తను కటకటాల వెనక్కు పంపించింది. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. భాగల్‌పూర్ పట్టణంలో ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి […]

కర్నూలు జిల్లా డోన్‌ తారకరామనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుంటుబ కలహాలతో వరలక్ష్మి అనే మహిళ తన నలుగురు పిల్లలకు విషం ఇచ్చి.. తరువాత తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈరన్నతో 14 ఏళ్ల కిందట వరలక్ష్మికి వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం ఉన్నారు. అయితే కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు […]

కట్టుకున్న భార్యను, ఏడాదిన్నర వయసున్న కూతురిని హత్య చేసి తర్వాత తాను కూడా సూసైడ్ చేసుకున్నాడో వ్యక్తి. విశాఖలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఒడిశాకు చెందిన సుజిత్ బన్స్‌దేవ్.. ఈనెల 19న భార్యాపిల్లల్ని చంపేశాడు. తర్వాత అపార్ట్‌మెంట్ నుంచి వెళ్లిపోయాడు. తల్లికి ఫోన్ చేసి తాను చేసిన ఘోరాన్ని చెప్పి మృతదేహాలను తీసుకెళ్లాలని కోరాడు. తాను కూడా సూసైడ్ చేసుకుంటున్నట్టు చెప్పాడు. తర్వాత రూర్కెలా వెళ్లి […]

ఆ జంట మూడు ముళ్ల బంధం మూడు నెలలు కూడా నిలబడలేదు. కాళ్లపారాణి ఆరకముందే ఓ భార్య తన కళ్ల ముందే భర్త ఆత్మహత్యను ప్రత్యక్షంగా చూడాల్సివచ్చింది. వివాహబంధం కళ్ల ముందే తెగిపోతుంటే ఏమీ చేయలేక నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది ఆ భార్య. హృదయ విదారకరమైన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. మహేందర్‌.. సింగరేణిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం శిరీషతో పెళ్లయింది. సంతోషంగా సాగిపోతున్న […]