ప్రేమ విషయంలో తన కూతురికి జరిగిన అన్యాయంపై తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారులోని జండాల్‌ తండాలో చోటుచేసుకుంది. దారవత్‌ రామ అనే యువకుడు ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్‌ చేయించి వదిలించుకునేందుకు కుట్ర పన్నాడు. దీంతో బాధితురాలి తండ్రి గ్రామ పెద్దలతో పంచాయతీ పెట్టించగా.. ఆ యువకుడు పెళ్లికి ఒప్పుకున్నాడు. […]

దిశ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితులను పదిరోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పోలీసులు నిందితులను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. విచారణ పేరుతో సాగదీయకుండా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రజలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి […]

  దిశ ఘటనపై దేశం అట్టుడికిపోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసనలు హోరెత్తిపోతున్నా.. మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో ఒకే రోజు ఘోరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ కామాంధుడు 55 ఏళ్ల మహిళలపై అత్యాచారానికి తెగబడి హత్య చేశాడు. మరో ఘటనలో భర్తే తన స్నేహితుడితో కలిసి భార్యను రేప్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో ఒకరు గతంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి […]

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నాగమణి అనే 55 ఏళ్ల మహిళ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఐ.పోలవరం మండలం జీ వేమవరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతదేహంతో పాటు పరిసర ప్రాంతాల్లో కారం చల్లి ఉండటంతో.. అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇంట్లో మంచం మీదే చనిపోయింది నాగమణి. ఉదయం పక్కింటి మహిళ.. నాగమణి ఇంటికి వెళ్లగా ఆమె చనిపోయి ఉండటంతో.. పోలీసులకు […]

  ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలకు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 14 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటి వరకు వర్షాల కారణంగా 22 మంది మృతి చెందారు. మెట్టుపాళ్యంలో 18 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుదుకోట్టై, రామనాథపురం, అరియలూర్‌, శివగంగై, పెరంబలూర్‌ జిల్లాల్లో వర్షం కురిసింది. కడలూరులో వంతెన తెగిపోవడంతో పలు గ్రామాలకు […]

దిశ కేసులో నిందితులను విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాంటూ షాద్‌ నగర్‌ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. హత్య కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టాల్సి ఉందని నిందితులను తమకు అప్పగిస్తే విచారణ చేపడతామని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో కస్టడీకి అప్పగింతపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. అటు నిందితులను ఉరితీయాలంటూ ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీసులు సమీక్షించారు. […]

జస్టిస్ ఫర్‌ దిశ అంటూ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. దిశకు మద్దతుగా సామాన్యులు, మహిళలు, యువత అంతా ముందుకు కదులుతున్నారు. నిందితులను నడి రోడ్డుపై ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దిశ దారుణ హత్యపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని.. అత్యాచారాలు చేయాలంటేనే భయపడేలా శిక్ష ఉండాలి అంటూ మహిళా లోకం కథం తొక్కుతోంది. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటి దగ్గర క్యాండిల్ ర్యాలీ […]

లోక్‌సభలో దిశ అంశంపై వాడివేడి చర్చ జరిగింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే జీరో అవర్‌లో చర్చిద్దామని లోక్‌సభ స్పీకర్ తెలిపారు. క్వశ్చన్ రద్దుచేసి దిశ ఘటనపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశారు. దీంతో సభ దీనిపై చర్చ చేపట్టింది. దిశను అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు టీ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌. తెలంగాణ […]

చనువుగా ఉంటూ ఓ వివాహితను లోబర్చుకున్నాడు. అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్‌ మెయిల్‌కి పాల్పడ్డాడు. ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతానంటూ లోబర్చుకుని శారీరకంగా అనుభవించాడు. అంతేకాదు.. బాధిత మహిళ నుంచి 12లక్షల రూపాయలు అప్పు కూడా తీసుకున్నాడు. తిరిగి డబ్బులు ఇవ్వమంటే మాత్రం మోహం తిప్పేశాడు. దీంతో ఆ బాధిత మహిళ.. కామాంధుడి ఇంటి ముందు న్యాయం పోరాడానికి దిగింది. తనకు న్యాయం చేయాలని.. లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యం […]

సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. నలుగురు నిందితులను కఠినంగా శిక్షించేందుకు సైబరాబాద్‌ పోలీసులు పూర్తి సాక్ష్యాధారాల్ని సేకరిస్తున్నారు. ఈనేపథ్యంలో నిందితులను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన పోలీసులు మరింత అదనపు సమాచారం రాబట్టేందుకు దృష్టి సారించారు. ఇందులో భాగంగా నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని సోమవారం షాద్‌నగర్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని […]