వరంగల్‌ రూరల్ జిల్లా నర్సంపేటలో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన భార్యాభర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తులతో పొడవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకన్నకు తీవ్ర రక్తశ్రావమైంది. వెంటనే ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ICUలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. నర్సంపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి […]

నిజామాబాద్‌ ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఘోరం జరిగింది. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌రెడ్డి ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే.. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో.. ప్రకాష్‌రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు ప్రకాష్‌ రెడ్డి కి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. మరో 8 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ప్రకాష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం […]

తక్కువ ధరకే ప్లాట్లు ఇప్పిస్తామని నమ్మించి కోట్లల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఓ సంస్థ బాగోతం బట్టబయలైంది. బాధితుల ఆందోళనతో హిమాయత్‌ నగర్‌లోని తాజ్‌ ఫ్రైడ్‌ సర్వీస్‌ సంస్థ గుట్టురట్టు అయింది. ఓ ప్లాన్ ప్రకారం ఈ సంస్థ వినియోగదారులను మోసం చేసినట్టు తెలుస్తుంది. ముందుగా గిఫ్ట్ వచ్చిందని ఆశ చూపి ప్రజలను ఆఫీస్‌లకు రప్పిస్తారు. హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరలకే ప్లాట్లు లభిస్తాయని.. ఈ రోజే బుక్ […]

ఉప్పెన లేదు. ప్రళయం రాలేదు. కానీ, కళ్ల ముందే మహా విషాదం జరిగిపోయింది. అప్పటివరకు సంతోషంగా గడిచిన క్షణాలు యమగడియలుగా మారిపోయాయి. ప్రకృతి రమణీయతతో కనువిందు చేసిన గోదారి ప్రయాణం మృత్యువై వెంబడించింది. కట్టుకున్న భర్త, కన్న కూతురు, తోడొచ్చిన స్నేహితులు ఇలా ప్రాణబంధాలన్నీ కళ్ల ముందే కొట్టుకుపోయాయి. నీటిని చూస్తేనే హడలిపోయేంతగా విషాదాన్ని మిగిల్చాయి. పాపికొండల ప్రయాణం. ప్రకృతి సోయగం. అదే ప్రకృతి అందాలు ప్రయాణికుల పాలిట వికృతిగా […]

విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో అర్థరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. ఫేషెంట్‌కు ట్రీట్‌మెంట్‌ చేయడంలో ఎందుకు లేట్‌ చేస్తున్నారంటూ డ్యూటీ డాక్టర్లని పేషెంట్‌ బంధువులు నిలదీశారు. ఈ విషయంలో డ్యూటీ డాక్టర్లకీ-పేషెంట్‌ బంధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమపై దాడి జరుగుతోందని.. పక్కనే ఉన్న హాస్టల్‌లో ఉంటున్న మెడికల్‌ కాలేజీ విద్యార్థులకి ఒక డ్యూటీ డాక్టర్‌ మెసేజ్‌ చేశాడు. దీంతో 200 మందికిపైగా మెడికల్‌ విద్యార్ధులు ఆస్పత్రికి చేరుకుని పేషెంట్‌ బంధువులను చితకబాదారు. […]

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యను ఇంట్లోనే రోకలి బండతో తలపై మోది హత్య చేశాడో భర్త. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కీర్తన మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త రవే ఆమెను హత్య చేసి ఉంటాడని అనుమానించిన వారు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రవి కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో భద్రాచలం గోదావరి బ్రిడ్జి పైన బైక్ […]

భార్య కాపురానికి రావడం లేదని, పోలీస్ స్టేషన్ ముందే ఓ తాగుబోతు బ్లేడ్ తో గొంతుకోసుకున్నాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగింది. బిజినపల్లి మండలానికి చెందిన నిజాముద్దీన్‌కు అతని భార్యకు కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఫుల్లుగా తాగడమే కాకుండా, ఆత్మహత్య చేసుకుంటానని అతను విసిగించేవాడు. ఈసారి ఏకంగా తన మండలం కానీ నాగర్ కర్నూలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. భార్య కాపురానికి వచ్చేలా చూడాలని, లేకుంటే […]

“గురుబ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర” అంటూ గురువును సాక్షాత్ పరబ్రహ్మగా పూజించే సమాజం మనది. అలాంటి స్ధానం కలిగిన గురువుపైనే కన్నేశాడో ఓ విద్యార్థి. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయురాలితో కామవాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించాడు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురైయూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామ పరిధిలోని మరుదై కొండ ఏజెన్సీకి చెందిన ఆదిద్రవిడ పాఠశాల ఉంది. అక్కడ గిరిజన సంక్షేమ శాఖలో 26ఏళ్ల […]

క్షణికావేశం ఒక కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను తీసింది. ఒక తప్పు మొత్తం కుటుంబాన్ని బలిగొంది. చివరికి మనవరాలి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న తాత కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌, స్వరూప దంపతులకు ఒక కొడుకు.. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సిరివల్లి అనే కూతురు 2017లో హత్యకు గురైంది. […]

హైదరాబాద్ KPHB కాలనీలో సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయి సూసైడ్ చేసుకున్నాడు. విశాఖపట్నంకు చెందిన చైతన్య 3 నెలల క్రితం జాబ్‌కోసం హైదరాబాద్ వచ్చాడు. KPHB కాలనీలోని బాలాజీ హాస్టల్‌లో ఉంటూ హైటెక్ సీటీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేదని.. జాబ్ మారతానని తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు దానికి ఒప్పుకోక పోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన చైతన్య.. హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరేసుకొని […]