మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాలు

కర్నూలు జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా మధ్యారాధన వైభవంగా జరిగింది. ప్రహ్లాదరాయుల ఉత్సవమూర్తిని గజవాహనంపై ఆశీనులను చేసి మఠం ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం పండితుల వేద మంత్రాలతో మఠం పీఠాదిపతులు ఊంజల్ సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తిని... Read more »

40 ఏళ్ల తర్వాత దర్శనమిచ్చిన స్వామి.. జనాన్ని వీడి జలంలోకి..

తమిళనాడు కంచిలోనీ వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో.. అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాక్షాత్తూ ఆ విష్ణుదేవుని స్వరూపమని నమ్మే.. ఈ స్వామి.. ఎప్పుడూ కొలనులోనే శయనిస్తారు. వేఘవతి నది ఒడ్డున కొలువుదీరిన కాంచీపురం క్షేత్రం విశ్వకర్మతో బ్రహ్మదేవుడే స్వామి... Read more »

అష్టైశ్వర్యం.. వరలక్ష్మీ వ్రతం..

శ్రావణమాసం వర్ణ శోభితం. తెలుగు లోగిళ్లన్నీ దేవాలయాలను తలపిస్తాయి. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు హిందువులు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. అమ్మను కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.... Read more »

ఎక్కడైనా విన్నారా కారం నీళ్లతో అభిషేకం.. అది కూడా దేవుడికి కాదు పూజారికి..

భారతదేశంలో ఎన్నో ఆలయాలు మరెన్నో సంప్రదాయాలు.. ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు.. పరిశోధకులకు సైతం అంతు చిక్కని రహస్యాలు. అదేదో పనిష్మెంట్ ఇస్తున్నట్టు.. కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తున్నారు ఓ పూజారికి. అభిషేకం అంటే పంచామృతాలు.. పాలతో కదా... Read more »

నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది : పృథ్వీరాజ్‌

టీటీడీ ఆధ్యాత్మిక ఛానల్‌ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సీని నటుడు పృథ్వీరాజ్‌ బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచఖ్యాతి గడించేలా ఎస్వీబీసీని అభివృద్ధి చేస్తామన్నారు పృథ్వీరాజ్. ఎస్వీబీసీ ఉద్యోగులతో కలిసి పనిచేస్తానని..శ్రీవారి... Read more »

సెప్టెంబర్‌ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. సెప్టెంబర్‌ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్‌ 8 వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 29న ఉత్సవాలకు అంకురార్పణ జరగనున్నట్టు... Read more »

లష్కర్ బోనాలలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగానే పడతాయని భవిష్యవాణి చెప్పింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. భక్తుల్ని సంతోషంగా ఉంచే బాధ్యత తనదేనని.. ఈ ఏడాది ఉత్సవాలు జరిగిన... Read more »

భక్తుల ఆగ్రహంతో దిగొచ్చిన టీటీడీ

భక్తుల ఆగ్రహంతో టీటీడీ దిగొచ్చింది.. వీఐపీల సేవలో తరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో చర్యలకు సిద్ధమవుతోంది.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. నిర్ణయాన్ని అమలు చేసేదిశగా కసరత్తు చేస్తున్నారు.. మంగళవారం... Read more »

గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయం అదే..

గ్రహణ సమయంలో చంద్రుని నుంచి వెలువడే విష కిరణాలు దేవాలయాలపై ప్రభావం చూపుతాయనే నమ్మకం మనలో ఉంది. గ్రహణాలు సంభవించినపుడు ఆలయాలను మూసివేస్తారు. శ్రీవారి ఆలయం సహా ప్రతి ఆలయం మూతబడుతుంది. కానీ, శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో మాత్రం గ్రహణ సమయంలో... Read more »

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సద్గురు సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ... Read more »