వేద మంత్రాలు.. మంగళవాద్యాలు.. సంప్రదాయాల మధ్య పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల హృదయాలు భక్తి పారవశ్యంలో ఉప్పొంగాయి. సిరిమాను రథానికి విశేష పూజలు జరిపిన తరువాత అమ్మవారి ప్రతి రూపంగా ఉన్న పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమాను రథాన్ని అధిరోహించారు. భక్తుల జేజేల నడుమ ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. పూర్వం పట్ట్భాషిక్తుడైన ఆనందగజపతిరాజు […]

తిరుమల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం వాహనసేవలో విహరించి భక్తులకు అభయప్రదానం చేసిన శ్రీవారి వేడుకలు ముగిశాయి. ఉదయం చక్రస్నానం నిర్వహించిన వేదపండితులు.. సాయంత్రం ధ్వజావరోహణం పూర్తిచేశారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ.. ధ్వజస్తంభానికి ఎగురవేసిన గరుడధ్వజాన్ని అవరోహణ చేసి.. ఉత్సవాలు పరిసమాప్తం అయ్యాయని తెలియజేశారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు వచ్చిన సకల దేవతలకూ వీడ్కోలు పలికినట్లే.. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు […]

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం వేదమంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా జరిగింది. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై ఊరేగిన శ్రీవారు సేదతీరేందుకే ఈ చక్రస్నానం ఉంటుంది. వరాహస్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిలో స్వామివారి చక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనాలు పూర్తి చేసిన తర్వాత స్నానం చేయించారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాత్రి ఆలయంలో ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

విజయదశమి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దసరారోజు రాజరాజేశ్వరీదేవిగా కొలువైన అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. సోమవారం దాదాపు 2 లక్షల మంది వస్తే దసరారోజు అంతకుమించిన రద్దీ ఉండబోతోంది. రాక్షస సంహారంతో అమ్మవారు ముల్లోకాలకు శాంతిసౌభాగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించిన రోజు కాబట్టి దానికి ప్రతీకగా ఇవాళ విజయదశమిని అంతా ఘనంగా జరుపుకుంటున్నారు. భవానీల దీక్ష విరమణలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో.. […]

తిరుమల బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనసేవ నయనానందకరంగా సాగింది. తిరుమలేశుడు హనుమంత వాహనంపై ఊరేగారు. దాస భక్తిని చాటుకునే హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ మహదానందంగా సాగింది. శ్రీవారిని అర్చించుకునే వివిధ భక్తిమార్గాలను భక్తులకు ఉపదేశిస్తున్నట్లుగా వాహనసేవ కొనసాగింది. త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడిని కూడా తానేనని చెబుతూ వెంకటాద్రి రాముడిగా శ్రీనివాసుడు కనువిందు చేశారు. ప్రతిరోజు రాముడి పేరిట సుప్రభాత సేవలో మేల్కొంటున్న వెంకటేశ్వరుడు లోకహితం కోసం […]

బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి… శ్రీవారి వాహనసేవలలో ప్రధానమైన గరుడ వాహన సేవను చూసి తరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.. దీంతో ఏడుకొండలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసి తరించేందుకు ఉదయం నుంచే భక్తులకు గ్యాలరీలకు చేరుకుంటున్నారు. దీంతో ఇప్పటికే ఆలయ మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గ్యాలరీల్లో […]

కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. శ్రీవారి నామస్మరణతో శేషాచల కొండలు మారుమోగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్నారు. ప్రకృతికి శోభను తీసుకొచ్చేది, మనిషికి జీవ వాయువుని అందించేది చెట్టు.. సృష్టిలోని వృక్షాలన్నింటిలోకి గొప్పది కల్ప వృక్షం.. అందుకే ఈ వాహన సేవలో స్వామివారిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. కామితార్థ ప్రదాయినిగా పేరున్న కల్పవృక్షానికి […]

దసరా పండుగ మహిళలకెంతో సరదా సంతోషాలను తీసుకువస్తుంది. బతుకమ్మల కోలాహలం.. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు.. ప్రతి ఇల్లూ రంగుల హరివిల్లవుతుంది. దసరా తొమ్మిది రోజులు ప్రతి రోజు పండుగలానే అనిపిస్తుంది. కోలాటాలు, బతుకమ్మ ఆట పాటలతో, తెలుగింటి ఆడపడుచులు ఆనందపారవశ్యంలో మునిగి తేలుతుంటారు. ఈ సంబరాలను వినోదాత్మకంగా నిర్వహించాలని తలపోసింది టీవీ5 ఆధ్యాత్మిక ఛానెల్ హిందూధర్మం. నారీ మణుల కోసం ‘నవనాయకి’ అని ప్రత్యేక గేమ్‌షో నిర్వహించనుంది. అదృష్టలక్ష్మి నిర్వాహకులు, […]

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధానార్చకులు నరసింహాచార్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుట్ట కింద రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఒక చిన్న గుడి తొలగింపు వివాదానికి కారణమైంది. మంగళవారం దీనికి సంబంధించిన పూజలు చేశాక, ఆలయ తొలగింపు పనులు ప్రారంభించారు అధికారులు. ఐతే.. స్థానికులు కూల్చివేతను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులుతో వాగ్వాదం జరిగింది. ఉన్నది చిన్న గుడి అయినా.. పెద్ద గుడైనా.. దేవుడే కదా..? అని […]

లాల్‌బాగ్‌ గణేషుడిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. కోరిన కోర్కెలు ఇట్టే నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఎంత సమయమైనా.. క్యూ లైన్లు ఎన్ని కిలోమీటర్లు దాటినా సరే… బొజ్జ గణపయ్య దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూస్తుంటారు. విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటారు. ఇక ముంబైలో అన్ని విగ్రహాల కంటే లాల్‌బాగ్‌ వినాయకుడి విగ్రహమే ఎత్తయినది. సింహాసనంపై ఆసీనుడైన లాల్‌బాగ్‌ లంబోదరుడు.. తన రూపంతో భక్తులను విశేషంగా […]