లాల్‌బాగ్‌ గణేషుడిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. కోరిన కోర్కెలు ఇట్టే నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఎంత సమయమైనా.. క్యూ లైన్లు ఎన్ని కిలోమీటర్లు దాటినా సరే… బొజ్జ గణపయ్య దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూస్తుంటారు. విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటారు. ఇక ముంబైలో అన్ని విగ్రహాల కంటే లాల్‌బాగ్‌ వినాయకుడి విగ్రహమే ఎత్తయినది. సింహాసనంపై ఆసీనుడైన లాల్‌బాగ్‌ లంబోదరుడు.. తన రూపంతో భక్తులను విశేషంగా […]

గణనాధుడి నవరాత్రి మహోత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా ముస్తాబైంది. జిల్లా అంతటా చవితి పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రసిద్ధిగాంచిన అయినవెల్లి, బిక్కవోలు గణపతి క్షేత్రాలతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రాపురం, రంపచోడవరం డివిజన్లలో పెద్ద ఎత్తున గణనాధుడి మండపాలు వెలిశాయి. కోనసీమలోని మధ్య గౌతమీ, వృద్ధగౌతమీ గోదావరి పాయల సమీపంలో వెలసిన వరసిద్ధి వినాయక క్షేత్రం అయినవిల్లి ఆలయం. ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. […]

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి అంతా ఇంతా కాదు. చవితి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్‌ గణేశుడే. ప్రతి ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిచ్చే ఇక్కడి గణనాథుడు.. ఈసారి 61 అడుగుల ఎత్తులో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్‌ గణపతి తొలిపూజకు భారీ ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లో వీధివీధినా ఎన్నో గణపతి విగ్రహాలు ప్రతిష్టిస్తారు. అయితే ఖైరతాబాద్‌ లో ప్రతిష్టించే మహా […]

హిందువుల పండుగల్లో వినాయక చవితి ప్రత్యేకం. తొమ్మిది రోజులు పాటు నిర్వహించే గణపతి పూజలో ఆధ్యాత్మిక, ఆయుర్వేద, పర్యావరణానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. వినాయకుడికి ఎన్నో పేర్లు. గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు.. ఇలా ఎన్నో నామాలు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా, తొలి పూజ అందుకునేది విఘ్ననాథుడే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. సర్వ విద్యలకు మూలం.. సకలవేదాల సారం గణపయ్య.. ఉపనిషత్తుల అంతరార్థం.. సర్వ […]

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వారి బంగారు రథం తయారీకి దేవాదాయ శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. రథం తయారీకి 6 కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. దీంతో రథం నిర్మాణ పనులు చకచకా సాగిపోనున్నాయి. స్వామివారి స్వర్ణ రథం పనుల్లో పురోగతి రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండలి స్వర్ణ రథం పనులపై ప్రత్యేక దృష్టిసారించింది. దాదాపు పదేళ్లుగా […]

కర్నూలు జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా మధ్యారాధన వైభవంగా జరిగింది. ప్రహ్లాదరాయుల ఉత్సవమూర్తిని గజవాహనంపై ఆశీనులను చేసి మఠం ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం పండితుల వేద మంత్రాలతో మఠం పీఠాదిపతులు ఊంజల్ సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తిని ఐదు రథాలపై మఠం ప్రాంగణవంలో ఊరేగించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సజీవ బృందవనస్తులైన రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

తమిళనాడు కంచిలోనీ వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో.. అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాక్షాత్తూ ఆ విష్ణుదేవుని స్వరూపమని నమ్మే.. ఈ స్వామి.. ఎప్పుడూ కొలనులోనే శయనిస్తారు. వేఘవతి నది ఒడ్డున కొలువుదీరిన కాంచీపురం క్షేత్రం విశ్వకర్మతో బ్రహ్మదేవుడే స్వామి విగ్రహాన్ని చెక్కించాడని ప్రతీతి. అయితే కేవలం 40 ఏళ్లకు ఓసారి మాత్రమే ఈ స్వామి.. భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటకు వస్తారు. అది కూడా కేవలం 48 రోజులు […]

శ్రావణమాసం వర్ణ శోభితం. తెలుగు లోగిళ్లన్నీ దేవాలయాలను తలపిస్తాయి. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు హిందువులు. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. అమ్మను కొలిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు ఉంటుంది. లోకంలో స్త్రీలు సకల సంపదలూ పొందేందుకు వీలుగా ఏదైనా వ్రతాన్ని సూచించమని పార్వతి ఆది దేవుణ్ణి […]

భారతదేశంలో ఎన్నో ఆలయాలు మరెన్నో సంప్రదాయాలు.. ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు.. పరిశోధకులకు సైతం అంతు చిక్కని రహస్యాలు. అదేదో పనిష్మెంట్ ఇస్తున్నట్టు.. కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తున్నారు ఓ పూజారికి. అభిషేకం అంటే పంచామృతాలు.. పాలతో కదా చేసేది అంటే ఇది ఈ ఆలయ ఆచారం అంటున్నారు. తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా నల్లమ్‌పల్లిలో ఆడి అమావాస్య సందర్భంగా కరుప్పుస్వామి ఆలయంలో ఇటువంటి వింత ఆచారం కొనసాగుతోంది. […]

టీటీడీ ఆధ్యాత్మిక ఛానల్‌ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సీని నటుడు పృథ్వీరాజ్‌ బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచఖ్యాతి గడించేలా ఎస్వీబీసీని అభివృద్ధి చేస్తామన్నారు పృథ్వీరాజ్. ఎస్వీబీసీ ఉద్యోగులతో కలిసి పనిచేస్తానని..శ్రీవారి సేవకు అంకితం అవుతానన్నారు పృధ్వీరాజ్‌.