కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. సెప్టెంబర్‌ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్‌ 8 వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 29న ఉత్సవాలకు అంకురార్పణ జరగనున్నట్టు టీటీడీ తెలిపింది. 30న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9నుంచి 11గంటల వరకు, రాత్రి 8నుంచి 10గంటల వరకు స్వామి వాహనసేవలు జరగనున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో ఆలయ […]

ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగానే పడతాయని భవిష్యవాణి చెప్పింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. భక్తుల్ని సంతోషంగా ఉంచే బాధ్యత తనదేనని.. ఈ ఏడాది ఉత్సవాలు జరిగిన తీరుపట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది. గంగాదేవికి జలాభిషేకం చేస్తే.. అందరి కోర్కెలు నెరవేరుతాయని వివరించింది. 5 వారాలపాటు నాకు శాఖలు పోయాలని చెప్పింది. మరోమారు మారు బోనం సమర్పించాలని […]

భక్తుల ఆగ్రహంతో టీటీడీ దిగొచ్చింది.. వీఐపీల సేవలో తరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో చర్యలకు సిద్ధమవుతోంది.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. నిర్ణయాన్ని అమలు చేసేదిశగా కసరత్తు చేస్తున్నారు.. మంగళవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గురువారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కొత్త విధానం అమలులోకి రానుంది. ఇప్పుడు అమలవుతోన్న ఎల్1, […]

గ్రహణ సమయంలో చంద్రుని నుంచి వెలువడే విష కిరణాలు దేవాలయాలపై ప్రభావం చూపుతాయనే నమ్మకం మనలో ఉంది. గ్రహణాలు సంభవించినపుడు ఆలయాలను మూసివేస్తారు. శ్రీవారి ఆలయం సహా ప్రతి ఆలయం మూతబడుతుంది. కానీ, శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో మాత్రం గ్రహణ సమయంలో భక్తులు దర్శనానికి పోటెత్తుతారు. గ్రహణం.. ఈ మాటే అరిష్టంగా భావిస్తాం.. ఈ భూమికి చల్లదనాన్ని, కాంతిని పంచే సూర్య చంద్రులను రాహుకేతువులు మింగడాన్ని కీడుగా శంకిస్తాం.. గ్రహణ సమయాన్ని […]

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సద్గురు సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ స్మరణతో మార్మోగుతున్నాయి. సాయి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. విద్యుత్‌దీప కాంతులతో సాయి […]

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు మంగళం పాడుతున్నారు. ఎల్లుండి నుంచి L1, L2, L3 దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆలయాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో ఆ పిటిషన్‌ విచారణ కొనసాగుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ఏ ప్రాతిపదికన అమలు చేస్తున్నారని న్యాయస్థానం టీటీడీ అధికారులను ప్రశ్నించింది. అందుకు సంబంధించిన జీవోలు […]

రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అష్టదల పాదపద్మారాధన సేవ రద్దు చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సర్వదర్శననానికి భక్తులను అనుమతిస్తారు. ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశికి ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా […]

జగన్నాథ రథచక్రాలు కదిలాయి. జగాలనేలే జగన్నాథుడు అన్నాచెల్లెళ్లతో కలసి అమ్మదగ్గరకు పయనమయ్యాడు. అలిగిన అమ్మవారిని ఊరడించేందుకు యాత్ర చేపట్టాడు. బలభద్రుడు-సుభద్రతో కూడి జగన్నాథ స్వామి పుర వీధుల్లో ప్రయాణం ప్రారంభించాడు. ఒడిషాలోని పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అనే పేర్లతో పిలుస్తారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడిగా పూజలందుకుంటున్నాడు. భగవంతుడు భక్తుల మధ్యకు వచ్చి అత్యంత వైభవంగా జరుపుకొనే మహోత్సవం జగన్నాథుని రథయాత్ర. […]

డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలు, భక్తుల కోలాహలం మధ్య గోల్కొండ అమ్మవారు గురువారం బోనాలు అందుకోనున్నారు. ఆషాఢ మాస బోనాలు చారిత్రాత్మక గోల్కొండ కోటపై ఉన్న ఎల్లమ్మ జగదాంబిక ఆలయం నుంచి ప్రారంభమవుతాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జీహెచ్‌ఎంసీ,జలమండలి అదికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌,డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ లంగర్‌హౌస్‌ చౌరస్తా వద్ద […]

ఓం నమశ్శివాయ.. భంభంబోలే.. అంటు శివభక్తులు అమర్ నాథ్ యాత్రకు బయలుదేరారు. జమ్ము బేస్‌క్యాంప్ నుంచి ఆదివారం ఉదయం అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల మొదటి బృందం ప్రయాణం ప్రారంభమైంది. మంచుకొండల్లో సహజసిద్దంగా కొలువైన మహాశివుని మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బయలుదేరారు. ఆది శంకరుడిని కొలుచుకునేందుకు బయలుదేరిన భక్తుల బృందానికి సంబంధిత అధికారులు పచ్చరంగు జెండా ఊపి ప్రారంభించారు. అమర్‌నాథ్ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 46 రోజుల […]