గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలనే ప్రస్తుత వైసీపీ సర్కార్‌ కాపీ కొడుతుందా…? ఆ పథకాల పేర్లే మార్చి కొత్త స్కీమ్‌గా అమలు చేస్తుందా.. దీనిపై రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని..గత తెలుగుదేశం ప్రభుత్వం 2018లోనే తీసుకువచ్చిందని అంటున్నారు. అప్పట్లో ఈ పథకం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు అర్హులకు కాకుండా వైసీపీ కార్యకర్తలకే కంటి పరీక్షలు చేసి కళ్లజోళ్లు […]

ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. మరోసారి బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది. రాబోయే దీపావళి సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ‘ఎస్‌బీఐ ఇండియా కా దీపావళి ఆఫర్’ పేరుతో పండగ ఆఫర్లను ప్రకటించింది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ సేల్ లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం […]

ఆమె ఓ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌. అడవిని వదిలి అసెంబ్లీ బాటపట్టారు. ఆయుధం విడిచి కలం చేతపట్టారు. న్యాయవాద వృత్తిని చేపట్టి PHD చేస్తూ నిత్య విద్యార్థిగా మారారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. పరిచయం పెద్దగా అవసరంలేని సీతక్క ప్రస్తుతం దసరా సందర్భంగా పొలం బాటపట్టారు. ములుగు జిల్లా జగ్గన్నపేట ఎమ్మల్యే సీతక్క స్వగ్రామం. పుట్టిన ఊరంటే సీతక్కకు ఎంతో అభిమానం. దసరా […]

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అవంతి పొరాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదుట పడటంతో దుండగులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. ఘటనా స్థలంలో పేలుడు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలిస్తున్నాయి.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. 87వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. నేషనల్ వారి మెమోరియల్ వద్ద అమరవీరులకు త్రివిధ దళాల అధిపతులు శ్రద్ధాంజలి ఘటించారు. వారి సేవల్ని స్మరించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌ఫోర్స్‌కు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వాయిసేన అందించిన సేవలు మరువలేనివని అన్నారు.

భారత దిగ్గజ స్పిన్ ద్వయంగా గుర్తింపు పొందిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వ్యక్తిగత రికార్డులు సాధించి సత్తా చాటారు. తన 66వ టెస్టులో 350వ వికెట్ సాధించిన రవిచంద్రన్ అశ్విన్ ఆల్ టైం గ్రేట్ ముత్తయ్య మురళీధరన్‌కు ధీటుగా నిలిచాడు. సరిగ్గా మురళీధరన్ కూడా తన 66వ టెస్టులోనే 350వ వికెట్ సాధించి, అప్పట్లో అతి తక్కువ టెస్టుల్లో ఆ ఫీట్ సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. […]

ప్రభుత్వం పెట్టిన డెడ్‌ లైన్‌ ముగిసింది.. ఉద్యోగాలు పోతాయని వార్నింగ్‌ ఇచ్చినా ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.. ప్రభుత్వ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా బంద్‌ కొనసాగిస్తున్నారు.. సాయంత్రం ఆరు గంటల్లోగా కార్మికులు రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా లైట్‌ తీసుకున్నారు.. ఇప్పటి వరకు ఎవరూ రిపోర్ట్ చేయలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు ప్రభుత్వ చర్యలపై కార్మికుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.. అటు రేపటి నుంచి ఆందోళనలు ఉధృతం […]

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ మోత మోగించాడు. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతోపాటు భారీ స్కోర్ సాధించిన రోహిత్ రెండో ఇన్నింగ్స్ లోను సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. శనివారం నాల్గో రోజు ఆటలో మయాంక్‌ అగర్వాల్‌(7) నిరాశపరిచినప్పటికీ రోహిత్‌ మాత్రం నిలదొక్కుకున్నాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లలో శతకం పూర్తి చేసుకున్నాడు. ఎక్కడ కూడా తడబడకుండా సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి టీమిండియాకు భారీ […]

బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి… శ్రీవారి వాహనసేవలలో ప్రధానమైన గరుడ వాహన సేవను చూసి తరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.. దీంతో ఏడుకొండలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసి తరించేందుకు ఉదయం నుంచే భక్తులకు గ్యాలరీలకు చేరుకుంటున్నారు. దీంతో ఇప్పటికే ఆలయ మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గ్యాలరీల్లో […]

ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట ముగిసిన అధ్యాయమే అనిపిస్తోంది. నాలుగు రోజులుగా జరుగుతున్న వెలికితీత పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు..ఇప్పుడున్న పరిస్థితుల్లో బోటు బయటకు తీయడం కష్టమే అంటున్నారు. ఇప్పటి వరకు ధర్మాడి సత్యం టీమ్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కచ్చులూరు ప్రాంతంలో పలుమార్లు వర్షం కురుసింది..దీనికి తోడు ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రస్తుతానికి బోటు వెలికితీత పనులు నిలిపివేశారు. అధికారుల నుంచి కూడా అనుమతి […]