గుడ్డు నాన్ వెజ్ కదా.. మేము తినము అని అనకండి. అందరూ హాయిగా తినొచ్చు. ఆరోగ్యానికి మంచిది. శరీరానికి కావలసిన విటమిన్-ఎని గుడ్డు అందిస్తుంది. శరీరం బలహీనంగా ఉంటే రోజుకో ఉడకబెట్టిన గుడ్డు తినమని డాక్టర్లు చెబుతుంటారు. విటమిన్ ఏ కాలేయం, చేపలు, రొయ్యల్లో అధికంగా ఉంటుంది. ఇంకా పాలు, పాలపదార్థాల్లో కూడా సమృద్ధిగా లభిస్తుంది. క్యారెట్, చిలకడదుంప, ఆకుకూరలు, టొమాటో, క్యాప్సికం, బొప్పాయి, గుమ్మడి ఇలా ఆయా సీజన్లలో […]

అమ్మ కావాలంటే అమ్మ పెట్టినవన్నీ తినాలి. డాక్టర్ చెప్పినట్లు చెయ్యాలి. అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. డెలివరీ అయిన తరువాత పాలిచ్చే క్రమంలో శరీరంపై శ్రద్ధ పెట్టే అవకాశం ఉండదు. మరి అలానే వదిలేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదు. అందుకే అమ్మ జిమ్ముల్లో కసరత్తులు చేస్తుంది. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు తనని తాను సమాయత్తం చేసుకుంటోంది భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా […]

ఒకప్పుడు వళ్లు నొప్పులంటే కళ్లుప్పుని వేడి చేసి కాపడం పెట్టే వాళ్లు. లేదా ఏదైనా ఆయిల్‌తో నొప్పి ఉన్న ప్రాంతంలో బాగా మర్దనా చేసి వేడి నీళ్ల కాపడం పెట్టే వాళ్లు. మళ్లీ ఇప్పుడు ఆ పాత పద్దతులనే అనుసరిస్తున్నారు కానీ సరికొత్తగా. మసాజ్‌లో భాగంగా ఏకంగా ఒంటి మీద మంటపెడుతున్నారు. దీని ద్వారా నొప్పులన్నీ తగ్గిపోతాయంటున్నారు. దీన్నే ఫైరీ టక్నిక్ అని పిలుస్తారని చెబుతున్నారు. ఇది ఈజిప్ట్‌కు చెందిన […]

యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది వాట్సాప్. ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తీసుకువస్తూ మార్కెట్లో తిరుగులేని రారాజుగా కొనసాగుతుంది వాట్సాప్. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు తమ వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ స్టోరీలుగా షేర్ చేసుకువచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. స్టేటస్ అప్‌డేట్ తర్వాత స్టేటస్ బార్ కింద ‘షేర్ […]

వర్షాకాలం వస్తూనే జలుబు, దగ్గులను మోసుకు వస్తుంది. వాతావరణంలో మార్పులు, వర్షంలో తడవడం, ఇంట్లో ఒకరికి వస్తే మరొకరికి, ఇలా ఏదో విధంగా వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి దగ్గు జలుబులు. నిజానికి దగ్గు వస్తేనే మంచిది. మన ఊపిరితిత్తులకు రక్షణ లాంటిది. శ్వాస మార్గం ద్వారా ఏవైనా వ్యర్థ పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు. అయితే దగ్గు రోజుల తరబడి […]

ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. ఆ జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకుంటే? అక్కడితోనే మన కథ పరిసమాప్తమవుతుంది! చాలా మంది ఊహల్లో బతుకుతారు. భవిష్యత్ అలానే ఉంటుంది అనుకుంటారు. ముఖ్యంగా పెళ్ళి చేసుకునే యువతీ యువకులు ఆలోచనలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. వారు వాస్తవిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. వివాహ బంధాన్ని మధ్యలోనే కాలదన్నుకుంటున్నారు. కొత్త మురిపెం కొన్నాళ్ళే అన్నట్టుగా.. పెళ్లైన కొత్తలో ఒకరికొకరి మధ్య అన్యోన్యత ఉన్నా […]

పాపాయిల నుంచి పండు ముదుసలి వరకు పాలను ఇష్టపడతారు. పాలల్లో ఉన్న క్యాల్షియం ఎముకలు ధృఢంగా మారడానికి సహకరిస్తుంది. అందుకే ప్రతి రోజూ ఓ గ్లాస్ పాలు తాగమని చెబుతుంటారు వైద్యులు. ఇక స్కూలుకు వెళ్లే చిన్నారులకైతే అమ్మ పాలగ్లాస్ తీసుకుని వెంటపడుతుంది. టిఫిన్ తినకపోయినా కనీసం పాలైనా తాగమంటూ. మరి మారాం చేయకుండా పాలు తాగాలంటే అందులో ఏదో ఒక పౌడర్ జోడించాల్సి వస్తుంది. గ్లాస్ గోరు వెచ్చని […]

నేటి యువతీ యువకులకు ఎన్నో అవకాశాలు. వారికున్న తెలివితేటలకు ఆధునిక పరిజ్ఞానము తోడై అద్భుతాలు సృష్టిస్తున్నారు. వినూత్న ఆలోచనలకు రూపకల్పన చేస్తున్నారు. టెక్నాలజీతో కొత్త పుంతలు తొక్కుతున్నారు. అతి తక్కువ వ్యయంతో 22 ఏళ్ల ఇంజనీరింగ్ యువకుడు పోర్టబుల్ వాటర్ ఫిల్టర్‌ను తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. బాటిల్‌లో పోసిన నీరు ఈ పరికరం ద్వారా క్షణాల్లో పరిశుభ్రంగా మారిపోతుంది. ‘ప్యూరిట్ ఇన్ పాకెట్’ పేరుతో తీసుకు వచ్చిన […]

ఛార్జింగ్ పెట్టిన కొద్ది సేపటికే అయిపోతే ఎలా.. అన్ని పనులు ఫోన్‌తోనే. ఫోన్ లేకపోతే ఎంత కష్టం. ఛార్జింగ్ లేక స్విచ్ఛాఫ్ అయిపోతే.. మాటలు మధ్యలో కట్ అయిపోతాయి. ఈ క్రమంలో చాలా మంది పవర్ బ్యాంకులను వెంట పెట్టుకుంటున్నారు. వాటికి కూడా ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఓ గంట ఛార్జింగ్ పెడితే కానీ ఆరోజు నడవదు. అదీ చూసుకుని మాట్లాడాల్సి వస్తుంది. మరి 5 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యే ఫోన్ […]

వానాకాలం వస్తూనే వైరల్ ఫీవర్లని తెస్తుంది. దోమలు చంపేస్తుంటాయి. పరిసరాల పరిశుభ్రత పాటించకపోతే అవి మరింతగా విజృంభిస్తాయి. ఇల్లుని నీట్‌గా పెట్టుకోవడం ఇంట్లో అందరి బాధ్యత. ఏ మాత్రం అశ్రద్ద చేసినా జ్వరాలతో మంచం పట్టాల్సి వస్తుంది. నీరు నిల్వ వుండే ప్రదేశాల్లో దోమలు చేరే అవకాశం ఎక్కువ. చెత్త బుట్టలు శుభ్రంగా ఉంచడం, ఎప్పటికప్పుడు ఇంట్లో పనికి రాని వస్తువులను బయటపడేయడం, ఇంట్లో గాలి వెలుతురు వచ్చేలా కిటికీలు, […]