కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ శనివారం భేటీ కానుంది. సమావేశం కానున్న కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేతను ఎన్నుకోనున్నారు. గెలిచిన 52 మంది ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే పార్లమెంటరీ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్‌లో ఒకింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొన్న జరిగిన సీడబ్యూసీ సమావేశంలో ఏకంగా రాజీనామా చేసేందుకు సిద్ధ పడ్డారు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ […]

రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్‌షాది కీలక పాత్ర. ఆయన్ను అపర చాణక్యుడిగా పిలుస్తారు కమలం పార్టీ నేతలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసి నెంబర్‌ టూగా పేరు తెచ్చుకున్న అమిత్‌ షాకి హోంశాఖ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? దీని వెనుక ఉన్న జాతీయ అజెండా ఏంటి? అవును హోంశాఖ మంత్రిగా అమిత్‌ షాను ఎంపిక చేయడం వెనుక ప్రధాన వ్యూహం… ఇన్నాళ్లుగా చెబుతున్న […]

రెండోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వం… 17వ లోక్‌సభ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు తొలి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభమైన మొదటి రోజున ప్రోటెం స్పీకర్‌ నియామకం జరుగుతుంది. ప్రోటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్‌ అయిన మేనకాగాంధీ ఎంపికయ్యే అవకాశం ఉంది. తొలి రెండురోజులు సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం […]

కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు.. తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో… హోంమంత్రి అమిత్‌షా తో 24 మంది క్యాబినెట్‌ మంత్రులు, 9 మంది స్వతంత్రహోదా మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో అదనంగా రెండు […]

కేంద్రంలో మోదీ సర్కారు రెండో విడత పాలన మొదలైంది. పలువురు కేంద్ర మంత్రులు తొలిరోజే బాధ్యతలు స్వీకరించారు. ఉదయమే తమ శాఖల కార్యాలయాలకు చేరుకున్న మంత్రులు నిరాండంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు… కిరణ్‌ రిజిజు, పీయూష్‌ గోయల్‌, జితేంద్ర సింగ్‌, ప్రహ్లాద్‌ జోషి, శ్రీపాద యశోనాయక్, ప్రకాశ్‌ జావ్డేకర్‌, రమేష్‌ పోక్రియాల్‌ ఉన్నారు.

కిసాన్‌ యోజన పథకం పొడిగించేందుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది… కిసాన్‌ యోజన పథకం రైతులందరికీ వర్తింపచేయాలని… గతంలో ఆదాయపన్ను చెల్లించే వారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది… పార్లమెంట్‌ సమావేశాల తేదీలను కేబినెట్‌ ఖరారు చేసింది… జూన్‌ 17 నుంచి జులై 26 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి… అలాగే జూన్‌ 19న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు… భారత రక్షణ నిధి ద్వారా ఇచ్చే స్కాలర్‌షిప్‌లపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది… కేంద్ర […]

ప్రముఖ గాయని ఆశా భోస్లే ..కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ప్రశంసలు కురిపించారు. తనకు ఎదురైన ఓ సంఘటనలో స్మృతి ఇరానీ స్పందించిన తీరును గుర్తుచేసుకుంటూ ట్విటర్‌ వేదికగా ఆమెపై తనకు ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు. ‘ ప్రధాని పదవీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నేను ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాను. ఆ రద్దీ నుంచి బయటపడడానికి నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఆ జనంలో నా ఇబ్బందిని గమనించిన స్మృతి.. అక్కడి […]

నమో టీం సిద్ధమైంది. నిన్న ప్రమాణస్వీకారం చేసిన 57 మంది మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రధాని మోదీ. ఇన్ని రోజులు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా..నెంబర్‌ టూగా వ్యవహరిస్తున్న అమిత్‌ షాకు హోంశాఖను కేటాయించారు. గతంలో రక్షణ శాఖ నిర్వహించిన నిర్మలాసీతారామన్‌కు ఈ సారి ఆర్థిక శాఖను కేటాయించారు. గత ప్రభుత్వంలో హోంశాఖ బాధ్యతలు నిర్వహించిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు రక్షణ మంత్రిత్వ శాఖను అప్పగించారు. అనూహ్యంగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న […]

1.రాజ్ నాథ్ సింగ్ – రక్షణశాఖ 2. అమిత్ షా – హోంశాఖ 3. కిషన్ రెడ్డి – హోంశాఖ సహాయమంత్రి 4.నిర్మలాసీతారామన్ – ఆర్థిక శాఖ 5. రవిశంకర్ ప్రసాద్ – న్యాయ, ఐటీశాఖ 6.స్మృతీ ఇరానీ -స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 7.ఎస్.జయశంకర్-విదేశాంగ శాఖ 8.రామ్ విలాస్ పాశ్వాన్ – పౌరసరఫరాలశాఖ, 9.హర్ సిమ్రత్ కౌర్ – ఫుడ్ ప్రాసెసింగ్ 10. పీయూష్ గోయల్ – రైల్వేశాఖ […]

ఆన్‌లైన్ గేమ్ పబ్‌ జీ‌కి ఎడిక్ట్ అయి యువత ప్రాణాలు కోల్పోతోంది. చుట్టూ ఎవరున్నారో అన్న విషయం కూడా తెలియకుండా గంటలు గంటలు గేమ్‌లో మునిగిపోతున్నారు. ఈ గేమ్ వల్ల వివాహ బంధాలు కూడా తెగిపోతున్నాయి. అనేక మంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్ పాలవుతున్నారు. ఇటీవల గుజరాత్ రాష్ట్రం ఈ ఆన్‌లైన్ వీడియో గేమ్‌ని బ్యాన్ చేసింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో మే 28న 16 ఏళ్ల ఫుర్ఖన్ […]