మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయమే కీలకం కానుంది. శివసేనకు గవర్నర్ ఆహ్వానం పంపిం నేపథ్యంలో.. NCP-కాంగ్రెస్ మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం ఢిల్లీలో సోనియా నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగానే సాగింది. శివసేనకు మద్దతుపై మహారాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే జైపూర్‌లోని క్యాంపులో ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలతో కూడా మట్లాడారు. వీటన్నింటిపైన ఖర్గే సోనియాకు ఓ నివేదిక ఇచ్చారు. […]

మహారాష్ట్రలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అటు పార్టీలు వరుస సమావేశాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. కాసేపట్లో సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించి శివసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే నిర్ణయించనున్నారు. అయితే సోనియా నిర్ణయం కోసం పార్టీ ఎదురుచూస్తోంది. ఇప్పటికే జైపూర్ లోని స్టార్ హోటల్‌ లో క్యాంపులో ఉన్న కాంగ్రెస్ మహారాష్ట్ర ఎమ్మెల్యేల అభిప్రాయాలను […]

బుల్‌బుల్ తుపాన్‌ పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లను కుదిపేసింది. సాగర్ ఐలాండ్ వద్ద తీరం దాటిన తీవ్ర తుపాన్ ప్రచండ గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడింది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో జనజీవనం స్తంభించింది. చాలా ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు నేలకొరిగాయి. సముద్రంలో 2 మీటర్ల మేర అలలు ఎగిసిపడుతున్నాయి. ఒడిశాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కరుస్తున్నాయి. తుపాన్‌ ధాటికి పశ్చిమ బెంగాల్‌లో 10 మంది, బంగ్లాదేశ్‌లో […]

యూపీలో ఘోరరైలు ప్రమాదం చోటుచేసుకుంది. మధుర సమీపంలో గేటు వద్ద ఆయిల్ ట్యాంకర్ తో పాటు టూవీలర్ గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో రైల్వే ట్రాకు పాడైంది. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టీఎన్‌ శేషన్ ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. తమిళనాడు కేడర్‌ నుంచి 1955 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శేషన్‌.. దేశానికి 18వ కేబినెట్‌ సెక్రటరీగా పని చేశారు. అనంతరం ఎన్నికల కమిషన్‌కు పదో సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 1996 వరకూ ఆరేళ్లపాటు ఆయన సీఈసీగా వ్యవహరించారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి కేఆర్‌ నారాయణన్‌ […]

దేశంలో ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలకు ఆజ్యం పోసిన మాజీ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ ఇకలేరు. శేషన్‌ మరణించిన విషయాన్ని మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ వెల్లడించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. వృద్ధాప్య సమస్యలతో కొన్నేళ్లుగా చెన్నైలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయన.. ఆదివారం రాత్రి 9.30 గంటలకు తుది శ్వాస విడిచారు. కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా తిరునెళ్లాయిలో 1932 డిసెంబరులో జన్మించిన టీఎన్‌ శేషన్‌ ఫిజిక్స్‌లో […]

దేశంలోనే తొలిసారిగా ఎలిఫెంట్ మెమోరియల్ ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. ఆగ్రా-మధుర జాతీయ రహదారి పక్కన దీనిని నెలకొల్పారు. ఇందులో ప్రపంచంలో ఉండే అన్ని జాతులకు చెందిన ఎనుగులను ప్రదర్శనకు ఉంచారు. అలాగే వాటికి సంబంధించిన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. దేశంలోనే ఈ తరమా మెమోరియల్ మొదటిదని యూపీ ప్రభుత్వం తెలిపింది. విద్యార్ధులను, పరిశోధకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

మార్కెట్‌కు సరఫరా తగ్గిపోవడంతో కొందరు వ్యాపారులు ఇదే అదునుగా ధరలు అమాంతం పెంచేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అటు పెరిగిన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనడం మాట అటుంచితే చూస్తేనే ఘాటెక్కిపోతుండటంతో మార్కెట్‌లో ఉల్లివైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ కారణంగానే మార్కెట్‌కు ఉల్లి సరఫరా గణనీయంగా పడిపోయింది. హైదరాబాద్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటా […]

రైలు పట్టాలమీద నడుస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మిమ్మల్ని యమధర్మరాజు ఎత్తుకుపోతాడు.. యమధర్మరాజేంటి..? ఎత్తుకుపోవడమేంటి..? అని పరేషాన్‌ అవుతున్నారా.. అవును, ముంబైలో రైలు పట్టాలపై నడిచేవారికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. పట్టాలపై మనిషి కనిపించడం ఆలస్యం హఠాత్తుగా ప్రత్యక్షమై ఎత్తుకుని వెళ్లిపోతున్నాడు. అయితే, ఆయన నిజమైన యముడు కాదు.. ముంబై పశ్చిమ రైల్వే అధికారుల ఐడియా ఇలా వర్కవుట్‌ అవుతోంది. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌కు చెందిన కొందరు సిబ్బందికి యముడి వేషం […]

మరాఠా గడ్డపై కొత్త చరిత్ర లిఖించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆగర్భ శత్రు వులు, అధికారం కోసం చేతులు కలుపుతున్నారు. శివసేన, ఎన్సీపీల మధ్య పొత్తు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ ఫోన్ చేశారు. తాజా పరిణామాలపై చర్చించారు. సోమవారం వారిద్దరూ సమావేశం కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అటు, శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే […]