ఊరు వెళ్ళడానికని 10 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు. కానీ అనుకోకుండా ఆఫీస్‌లో అర్జంట్ పని ఉండి ఊరు వెళ్లడాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మరి టికెట్ క్యాన్సిల్ చేయకుండా మరొకరి పేరు మీదకు మార్చాలనుకుంటే అందుకు అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇందుకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే ఈజీగా మరొకరి పేరు మీదకు మార్చేయొచ్చు. మరి ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. […]

మహాబలిపురంలో మహా భేటీ ముగిసింది. చెన్నై నుంచి మహాబలిపురం చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఘనంగా స్వాగతం పలికారు ప్రధాని మోదీ. తమిళనాడు సంప్రదాయ వస్త్రాధారణలో ఆకట్టుకున్నారు మోదీ. తెల్ల లుంగీ, తెల్లచొక్కతో మెరిసిపోయారు. అటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కూడా తెల్లచొక్కాలోనే వచ్చారు. పల్లవులు నిర్మించిన వెయ్యేళ్లనాటి కట్టడాలు, చారిత్రకవైభవం, నిర్మాణాల విశిష్టతను జిన్‌పింగ్‌కు వివరించారు మోదీ. సీ షోర్ ఆలయాన్ని మొత్తం తిప్పి చూపించారు. మహాబలిపురం, సీ షోర్ […]

‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే’.. అంటూ ఓ సినీ గేయరచయిత చెప్పినట్టు.. ఎవరిని చూస్తే గుండె వేగంగాకొట్టుకుంటుందో.. ఎవరితో మాట్లాడుతుంటే ప్రపంచమే మర్చిపోయాలే అనిపిస్తుందో.. కొంతమంది దాన్నే తొలిచూపు ప్రేమ అంటారు. మరికొంత మంది స్టయిల్‌గా ‘లవ్ యట్ ఫస్ట్ సైట్’ అని చెబుతుంటారు. మరి లవ్ యట్ ఫస్ట్ సైట్‌లోనే ప్రేమ పుట్టిందంటూ అమ్మాయికి అబ్బాయి చెప్పి ఒప్పించినా.. పెళ్లి చేసుకోవటం మాత్రం కొంత ఆలస్యం […]

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి పళనిస్వామి ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ ముందుకు కదిలారు జిన్‌పింగ్‌. మైలాపూర్ ఆలయ పూజారులు వేద మంత్రాలు చదువుతూ.. పూర్ణకుంభాన్ని బహూకరించారు. దీని ప్రాముఖ్యాన్ని అక్కడే ఉన్న చైనా అనువాదకుడు జిన్ పింగ్‌కు వివరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా జిన్ […]

బుజ్జి కుక్క పిల్ల ఎంత ముద్దుగా ఉందో.. ఎవరూ చూడట్లేదు.. కట్టేసి కూడా లేదు.. అటు ఇటూ చూశాడు.. శుభ్రంగా చంకన పెట్టుకుని వెళ్లిపోయాడు.. ఆర్డర్ చేసిన ఫుడ్‌ని కస్టమర్‌కి అందించిన జొమాటో డెలివరీ బాయ్. తన పప్పీ అరుపులు చెవిని తాకట్లేదని పసిగట్టిన ఆ ఇంటి ఓనర్ ఇల్లంతా వెతికింది. ఇంటి చుట్టూ చూసింది. సీసీ కెమెరా ద్వారా అసలు దొంగని కనిపెట్టేసింది. మహారాష్ట్ర పుణెకు చెందిన వందనా […]

బుద్దిగా చదువుకోవాల్సిన విద్యార్ధులు రౌడీల్లా వ్యవహరించారు. కాలేజీలో జూనియర్లు.. సీనియర్లు కత్తులతో దాడులకు దిగారు. చిన్న వివాదంలో గొడవ పడిన విద్యార్ధులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో జూనియర్ విద్యార్ధి అశ్విన్ గాయపడ్డాడు. చెన్నైలో నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

కాసేపట్లో చెన్నై చేరుకోనున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌. ప్రత్యేక విమానంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ సాదర స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు మోదీ. ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామితో పాటు మంత్రులు, అధికారులు, రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భేటీకి […]

ఇప్పటికే రైల్వేలో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు వచ్చాయి. మరోసారి వాటికి సంబంధించిన వివరాలు నిరుద్యోగ యువతీ యువకులకోసం.. అప్లై చేసుకోని వారు దరఖాస్తుకు ఇంకా సమయం ఉంది. గమనించుకోండి. 1. పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ RRC అసిస్టెంట్ లోకో పైలెట్-ALP, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 306 ఖాళీలున్నాయి. ఇప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తున్న వాళ్లు మాత్రమే ఈ పోస్టులకు […]

మా ఆయన బంగారం. ఇలాంటి భర్త ఎవరికీ ఉండరు. నా పుట్టింటి వాళ్లని ఎంత బాగా చూసుకుంటున్నాడు. నా చెల్లెలు చదువుకుంటానంటే అన్నీ తానై చూసుకుంటున్నాడని ఎంతో సంబరపడింది ఆ ఇల్లాలు. కానీ ఆ చెల్లెలు తన సంసారానికే ఎసరు పెడుతుందని ఊహించలేకపోయింది. భర్తని వల్లో వేసుకుని నాలుగ్గోడల మధ్య చెల్లెలు అతడితో రాసలీలలు సాగించడాన్ని భరించలేకపోయింది భార్య. తన సంసారం నాశనం చేసిన చెల్లెలిని బజారుకు ఈడ్చింది. భర్తని […]

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను ఒకేసారి 5 శాతం పెంచుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతం వరకు పెరిగింది. దీంతో వారికి ముందుగానే దీపావళి వచ్చినట్టయింది. కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. 5 శాతం పెంపు నిర్ణయంతో పెన్షనర్లు ప్రతి నెలా తీసుకునే పెన్షన్ మొత్తం రూ.450 నుంచి రూ.6,250 మధ్యలో […]