ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ అరెస్టు చేసిన కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ను అధికారులు నేడు కోర్టు ముందు హాజరుపరిచనున్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్ యాక్ట్‌ కింద అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు.. ఈడీ కోర్టులోనే ప్రవేశపెట్టనున్నారు. తమ ప్రశ్నలకు డీకే సరిగా సమాధానాలివ్వలేదని, మరింత లోతుగా విచారించేందుకు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరనుంది ఈడీ. 14 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. సుమారు […]

అప్పటి వరకు పెళ్లి పీటల మీద కూర్చుని పురోహితుడు చెప్పినట్లు చేస్తున్న వధువు.. పెళ్లి కుమారుడు తాళి కట్టే సమయంలో చీర మార్చుకుంటానని గదిలోకి వెళ్లింది. అంతే మళ్లీ బయటకు రాలేదు.. ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తమిళనాడు వేలూరు జిల్లా వాణియంబాడి ప్రాంతానికి చెందిన యువతికి గుడియాత్తం ప్రాంతానికి చెందిన మేనమామతో వివాహం నిశ్చయించారు పెద్దలు. ఆదివారం రాత్రి పెళ్లి విందు జరిగింది. సోమవారం పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. బంధుమిత్రుల […]

ఐఎన్‌ఎక్స్‌ మీడియా 300 కోట్ల రూపాయల కుంభకోణంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంను సీబీఐ మరో రెండు రోజులపాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. చిదంబరంను తిహార్‌ జైలుకు పంపకుండా, గృహ నిర్బంధంలోనే ఉంచి విచారించేందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఆయనకు తాత్కలిక ఉపశమనం లభించింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతవరకు ఆయన్ను సీబీఐ కస్టడీలోనే కొనసాగించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలనే ట్రయల్ […]

మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులపై సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లో భారీ పెట్టుబడులు పెట్టాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా భారీ ఎత్తున భూమిని కొనుగోలు చేయాలని ఫడ్నవిస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాశ్మీర్‌లో రెండు రిసార్ట్స్ లను నిర్మిస్తామని ఎంటీడీసీ ఇప్పటికే ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లో పెట్టుబడులు పెడుతున్న తొలి సర్కారుగా మహారాష్ట్ర ప్రభుత్వం రికార్డును సొంతం చేసుకోబోతోంది. రిసార్ట్స్ నిర్మాణం కోసం ల్యాండ్ సర్వే చేయాలని ఇప్పటికే […]

చంద్రయాన్‌-2 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. విక్రమ్‌ ల్యాండర్ ఆర్బిటర్‌ నుంచి విడిపోయే రెండో కార్యక్రమం కూడా విజయవంతమైంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడికి మరింత దగ్గరగా వెళుతోంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ ను విజయవంతంగా వేరు చేసిన ఇస్రో.. ల్యాండర్ ఆర్బిట్‌ను ఇంకాస్త తగ్గించింది. తెల్లవారుజామున మూడు గంటల 42 నిమిషాల సమయంలో ఈ ప్రాసెస్‌ పూర్తి చేశారు. కేవలం 9 సెకెన్లలోనే శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను […]

అమెరికా యుద్ధ హెలికాప్టర్‌ అపాచీ ఏహెచ్‌-64 భారత వాయుసేన అమ్ములపొదిలో చేరాయి. అమెరికాకు చెందిన బోయింగ్‌ విమాన సంస్థ ఇవాళ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను భారత్‌కు అందించింది. పంజాబ్‌లోని పఠాన్‌ కోట్‌ ఎయిర్‌ బేస్‌‌లో ఈ అత్యాధునిక వార్‌ హెలీకాప్టర్లకు పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా. వీటి చేరికతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మరింత బలోపేతం కానుంది. అత్యాధునిక యుద్ధ హెలికాప్టరైన అపాచీ […]

వెటరన్ ఇండియా బ్యాటర్ మిథాలీ రాజ్ మంగళవారం (సెప్టెంబర్ 3) టి 20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 2006 లో భారతదేశపు మొట్టమొదటి టి 20 కెప్టెన్‌గా ఉన్న మిథాలీ రాజ్ అతి తక్కువ కాలంలో 89 మ్యాచ్‌లు ఆడి, 2364 పరుగులు సాధించింది. 2012, 2014, 2016లో ప్రపంచకప్‌లతో సహా 32 మ్యాచ్‌ల్లో ఆమె భారత్‌కు నాయకత్వం వహించింది. ఆమె చివరి T20 ప్రదర్శన ఇంగ్లాండ్‌లో జరిగింది. […]

నిత్యం లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న అతిపెద్ద రవాణా సంస్థ భారతీయ రైల్వే. మరోవైపు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కూడా రైల్వే ప్రయాణికులకు మరిన్ని సేవలు అందిస్తోంది. ఇటీవల ఐఆర్‌సిటీసీలో అనేక మార్పులు జరిగాయి. వాటిలో కొన్ని.. బెర్త్ స్టేటస్, పబ్లిక్ రిజర్వేషన్ చార్ట్స్, బయోమెట్రిక్ లింకింగ్.. ఇవన్నీ ప్రయాణీకులకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.. 1. రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అయిన […]

ప్రముఖ పారిశ్రామిక వేత్త.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వినాయకచవితి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కూతురు, కొడుకు పెళ్లిళ్లు ఒకే సంవత్సరంలో జరగడంతో ఇరు జంటలకు ఇదే మొదటి వినాయకచవితి. దాంతో ఈ సంబరాలను అత్యంత ఆనందంగా జరుపుకోవాలని భావించారు అంబానీ దంపతులు. ఇందుకోసం వేడుకల్లో పాలు పంచుకునేందుకు రమ్మంటూ ఆహ్వాన పత్రికలను సైతం ప్రింట్ చేయించారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే అంబానీ ఇంట హడావిడి […]

అమెరికా యుద్ధ హెలికాప్టర్‌ అపాచీ ఏహెచ్‌-64 భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. అమెరికాకు చెందిన బోయింగ్‌ విమాన సంస్థ ఇవాళ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను భారత్‌కు అందించింది. పంజాబ్‌లోని పఠాన్‌ కోట్‌ ఎయిర్ బేస్ లో ఈ అత్యాధునిక యుద్ధ విమానాలకు పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా. వీటి చేరికతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మరింత బలోపేతం కానుంది. అత్యాధునిక యుద్ధ హెలికాప్టరైన […]